చెర్రీతో పోటీపడుతూ మరీ... | Ram Charan Kiara Advani Work Outs Video Viral | Sakshi
Sakshi News home page

Published Sat, May 19 2018 8:25 PM | Last Updated on Sat, May 19 2018 8:28 PM

Ram Charan Kiara Advani Work Outs Video Viral - Sakshi

కైరా పోస్టు చేసిన వీడియోలో దృశ్యాలు

బ్యాంకాక్‌: రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడ చెర్రీ-కైరా ఇద్దరూ పోటీపడి మరీ వర్కవుట్లు చేస్తున్నారు. 

బోయపాటి చిత్రం కోసం సరికొత్త యాంగిల్‌లో కనిపించేందుకు రామ్‌ చరణ్‌ బాడీని డెవలప్‌ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్‌సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్‌ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెబుతున్నారు. వివేక్‌ ఒబేరాయ్‌, ప్రశాంత్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement