క్లైమాక్స్‌ స్టార్ట్‌ | ramcharan fainal shooting starts on july 10 | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ స్టార్ట్‌

Published Sat, Jul 7 2018 12:39 AM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM

ramcharan fainal shooting starts on july 10 - Sakshi

రామ్‌ చరణ్‌

రౌడీలను చిత్తు చిత్తు చేయడానికి రామ్‌ చరణ్‌ రంగం సిద్ధం చేశారు. బ్యాడ్‌ బాయ్స్‌ బెండు తీయడానికి స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు. ఈ సెటప్పంతా బోయపాటి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమా క్లైమాక్స్‌ కోసం. రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ప్రశాంత్, ఆర్యన్‌ రాజేశ్, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ను ఈ నెల 10న స్టార్ట్‌ చేయనున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా పాల్గొననున్నారట. ఈ షెడ్యూల్‌ తర్వాత ఫారిన్‌లో మరో షెడ్యూల్‌ కూడా ప్లాన్‌ చేశారట దర్శకుడు బోయపాటి శ్రీను. సంక్రాంతికి  రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement