ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి! | unsupcisously dance master died | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి!

Published Sat, Nov 14 2015 4:38 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి! - Sakshi

ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి!

హైదరాబాద్: తమ సాన్నిహిత్యం ప్రియురాలి బంధువులకు తెలిసిపోతుందనే భయంతో బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పైపులు పట్టుకొని దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి వర్ధమాన సినీ నటుడు దుర్మరణం చెందా డు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

 

మూసాపేట ఆంజనేయనగర్‌లో నివాసం ఉంటున్న బాలప్రశాంత్ (20) ‘ఇప్పట్లో రాముడిలా... సీతలా ఎవరుంటారండి బాబు’ సినిమా హీరోగా నటిస్తున్నాడు. అయితే తన ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న తన ప్రియురాలి భర్త లేకపోవడంతో శుక్రవారం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఒక్కసారిగా బంధువులు రావడంతో భయాందోళనకు గురైన ప్రియురాలు అతన్ని ఇంట్లోనే దాచిపెట్టింది. తన ఇంట్లో ఎవరూ లేరని, నిద్రపోతానని చెప్పి బంధువులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో అనుమానం వచ్చిన బంధువులు తనిఖీ చేస్తుండగా.. ప్రియురాలు చేతులు కోసుకొని గలాటా సృష్టించింది. దీంతో బంధువులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ ఇంటికి తాళం వేశారు. ఇంట్లోనే ఉన్న బాలప్రశాంత్ ఇంటి వెనకాల ఉన్న పైప్‌ల ద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.  కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

అనంతరం మృతదేహాన్ని ప్రశాంత్ స్వస్థలం గుంతకల్లుకు తరలించారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. ప్రశాంత్ తల్లిదండ్రులు అనంతపురం జిల్లాకు చెందిన సౌందరరాజు, గ్లోరీలు. కొన్నేళ్ల క్రితం తండ్రి మరణించారు. ప్రశాంత్.. జ్యోతిలక్ష్మి చిత్రంతోపాటు మూడు షార్ట్ ఫిలింలలో నటించాడు. ప్రశాంత్ నటించిన సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగడం తమను కలచివేసిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement