ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలోని ఏటీఅగ్రహరంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పట్నంబజారు(గుంటూరు) : ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలోని ఏటీఅగ్రహరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఅగ్రహరం ప్రధాన రహదారిలో ఒక కుటుంబం టైర్ల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. వీరు ఉండే నివాసంలో మరో పోర్షన్‌లో ఉండే ప్రశాంత్ అనే వ్యక్తి నిత్యం ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వారి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ నెల 26తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
చిన్నారి అప్పటి నుంచి సరిగా ఉండకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా బాలిక విషయం చెప్పినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. బాలిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నుంచి సమగ్ర నివేదిక రావాల్సి ఉంది. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.