ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది.
అసలేం జరిగిందంటే..
మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్‌పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment