
ఈ రోజు సాయంత్రం నాని తొలి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని ఇప్పుడు తొలి సినిమా చేయటం ఏంటి అనుకుంటున్నారా..? హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఢీ ఫర్ దోపిడి సినిమా కోసం నాని నిర్మాతగా మారినా సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సొంతగా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ లో ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ విపరీతంగా నచ్చటంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోనూ రిలీజ్ చేయనున్నారు.
#Announcement
— Nani (@NameisNani) 25 November 2017
Wall Poster Cinema
Production no 1 pic.twitter.com/vWMPgEma3U
Comments
Please login to add a commentAdd a comment