wallposter
-
డబ్బులిస్తే తీసుకోండి.. సమర్థులకే ఓటేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం అభ్యర్థులెవరైనా డబ్బులిస్తే తీసుకుని ఓటును మాత్రం సమర్థులకే వేయాలని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరమ్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’వాల్‌పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ మంగళవారం ఆవిష్కరించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ...ప్రజలను మేలుకొల్పడంలో పొలిటికల్ కార్టూన్స్ చాలా ప్రభావం చూపిస్తాయన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం తదితర అవసరాలను మెరుగుపరిచే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. తానెప్పుడూ పొలిటికల్ మేనిఫెస్టో చూడనని, దానిని రూపొందించడం, అమలు చేయడం తెలిస్తే తానే ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయే వాడినని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’లో భాగమైన కార్టూనిస్ట్‌లను ఆర్జీవీ అభినందించారు. వ్యంగ్య చిత్రాలను గీసే వారు ఇంత సీరియస్‌గా ఉంటారని కార్టూనిస్టులను చూశాకే తెలిసిందని చమత్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టులు శంకర్ (సాక్షి), సుభాని, మృత్యుంజయ, నర్సిం, అక్బర్, వెంకటేశ్ కతుల, రాకేశ్, పి.ఎస్.చారీ, సురేందర్ సముద్రాల, జె.వెంకటేశ్, నివాస్ చొల్లేటి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి తదితర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
ఈ రోజు సాయంత్రం నాని తొలి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని ఇప్పుడు తొలి సినిమా చేయటం ఏంటి అనుకుంటున్నారా..? హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఢీ ఫర్ దోపిడి సినిమా కోసం నాని నిర్మాతగా మారినా సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సొంతగా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ లో ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ విపరీతంగా నచ్చటంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోనూ రిలీజ్ చేయనున్నారు. #Announcement Wall Poster Cinema Production no 1 pic.twitter.com/vWMPgEma3U — Nani (@NameisNani) 25 November 2017 -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
-
వాల్‌పోస్టర్ల కలకలం
కరీమాబాద్: వరంగల్ లోని ఖిలావరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ ప్రాంతంలో సోమవారం వెలసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ మహిళ, సాం స్కృతిక సంఘాల ఐక్యవేదిక పేర వెలిసిన ఈ వాల్ పోస్టర్లో ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి ఫొటో ఉంది. ఈ పోస్టర్‌పై ‘మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.. సమ్మక్క సారక్కల నుంచి శ్రుతి వరకు బతుకమ్మలను చిదిమి వేసిన రాజ్యానికి బతుకమ్మ ఆడే నైతిక హక్కు ఎక్కడిది?, గడీల బతుకమ్మ కాదు.. బడుగుల బతుకమ్మ ఆడుదాం...’ అని రాసి ఉంది. ఈ వాల్పోస్టర్లపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.