వాల్‌పోస్టర్ల కలకలం | Wall posters uproar sensation | Sakshi
Sakshi News home page

వాల్‌పోస్టర్ల కలకలం

Published Tue, Oct 13 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

వాల్‌పోస్టర్ల కలకలం

వాల్‌పోస్టర్ల కలకలం

కరీమాబాద్: వరంగల్ లోని ఖిలావరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ ప్రాంతంలో సోమవారం వెలసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ మహిళ, సాం స్కృతిక సంఘాల ఐక్యవేదిక పేర వెలిసిన ఈ వాల్ పోస్టర్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి ఫొటో ఉంది. ఈ పోస్టర్‌పై ‘మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.. సమ్మక్క సారక్కల నుంచి శ్రుతి వరకు బతుకమ్మలను చిదిమి వేసిన రాజ్యానికి బతుకమ్మ ఆడే నైతిక హక్కు ఎక్కడిది?, గడీల బతుకమ్మ కాదు.. బడుగుల బతుకమ్మ ఆడుదాం...’ అని రాసి ఉంది. ఈ వాల్‌పోస్టర్‌లపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement