సాక్షి, ములుగు: మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
ముందుగా ములుగు జిల్లాలో పర్యటించిన కిషన్‌రెడ్డి గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మేడారం.. అసలు ఘట్టం ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment