sammakka sarakka
-
మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, ములుగు: మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ముందుగా ములుగు జిల్లాలో పర్యటించిన కిషన్‌రెడ్డి గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మేడారం.. అసలు ఘట్టం ఆవిష్కరణ -
మేడారంకు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించిన కిషన్ రెడ్డి
-
మేడారం జాతరపై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్
-
జానపద గాథల్లో... సమ్మక్క
ఇంతింతై వటుడింతౖయె... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జన జాతరగా ప్రసిద్ధిగాంచిన ‘మేడారం సమ్మక్క జాతర’కు కారకులైన గిరిజన వీరవనితలు సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మల పుట్టుపూర్వోత్తరాల గురించి అందుబాటులో గల ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రునితో జరిగిన పోరాటంలో కుట్రతో ఒక సైనికుడు దొంగ చాటుగా బల్లెంతో చేసిన దాడిలో సమ్మక్క క్షతగాత్రురాలై చిలకలగుట్ట వద్ద అదృశ్యమైనట్టు జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథల ద్వారా తెలుస్తోంది. కానీ కాకతీయ రాజ్య చరిత్రలో మేడారం పోరాటం, సమ్మక్క– పగిడిద్దరాజుల సామంత రాజ్యం గురించిన ప్రస్తావన లేదు. గిరిజనుల ఆశ్రిత కులం వారు డోలీలు. వీరు ‘పడిగె’ అనే త్రికోణాకార గుడ్డపటం సాయంతో గిరిజన పూర్వీకుల చరిత్ర, వీర గాథలను ‘డోలి’ వాయిస్తూ గానం చేస్తారు. మణుగూరు ప్రాంతంలోని గూడెంకు చెందిన డోలి కళాకారుడు ‘సకిన రామచంద్రయ్య’ చెప్పే పడిగె కథ ప్రకారం: పేరంబోయిన కోయ రాజు వంశానికి చెందిన ఆరవ గట్టు సాంబశివ రాజు– తూలు ముత్తి దంపతులకు ఐదుగురు సంతానం – సమ్మక్క పెద్దకూతురు. ఆమెకు యుక్త వయస్సు రావడంతో బస్తరు ప్రాంతానికి వెళ్లి పగిడిద్ద రాజును చూసి ఆయనతో పెళ్లి చేయ నిశ్చయించాడు తండ్రి. మేడారం దగ్గరి కామారం గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు మైపతి అరుణ్ కుమార్ తన క్షేత్ర పర్య టనలు, పూర్వీకుల మౌఖిక కథల ద్వారా సేకరించిన సమా చారం ప్రకారం... కోయత్తూర్ సమాజంలోని ఐదవ గట్టు ‘రాయి బండని రాజు’ వంశానికి చెందిన ఆడబిడ్డ సమ్మక్క ‘చందా‘ ఇంటి పేరు గల రాయి బండాని రాజుకు ఇద్దరు భార్యలు. ఆ రాజుకు వెదురు పొదల వద్ద ముద్దులొలికే పసిపాప కని పిస్తుంది, ఆ పాపను ఇంటికి తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఈ రాజుకు నాగు లమ్మ అనే మరో కుమార్తె జన్మించింది. కోయ వారి సంప్రదాయం ప్రకారం తొలిసూరి బిడ్డను ఇంటి వేల్పుగా కొలుస్తారు. అందుకే సమ్మక్క చందా వారి ఇలవేల్పు అయ్యింది. ఈ రెండు కథనాల్లోనూ పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహాన్ని ఆమె తండ్రి కుదుర్చుతాడు. అయితే నాట కీయ పరిణామాల మధ్య సమ్మక్క, నాగులమ్మలను ఇద్దరినీ పగిడిద్దరాజు వివాహం చేసుకుంటాడు. స్వాతంత్య్రానికి పూర్వం నైజాం రాజ్యంలో చందా, సిద్ధబోయిన ఇంటిపేర్లున్న గిరిజన కుటుంబాలు మాత్రమే చేసుకునే చిన్న జాతర ఇది. ప్రతి ఏటా జాతర చేసే స్థోమత లేక రెండే ళ్లకోమారు అది కూడా చందాలు వేసుకునీ, అవీ చాలక వరంగల్‌లోని వర్తకులు దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి ఈ జాతర నిర్వహించేవారు. 1961లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. 1996లో ‘రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించింది. పాలకులు, భక్తుల కృషితో నేడు ఉన్న స్థితికి ఈ జాతర చేరింది. – డా‘‘ అమ్మిన శ్రీనివాసరాజు, పరిశోధక రచయిత (నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు మేడారం జాతర) కుంకుమ భరిణ రూపంలో... సమ్మక్క ఓ కోయరాజు కుమార్తెగా జానపద కథలు చెబు తున్నాయి. ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో తమ వారంతా మరణించడంతో సమ్మక్క వీరావేశంతో శత్రు మూకలను సంహరించింది. కానీ ఒక సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడవడంతో రక్తపు టేరుల మధ్య అడవి వైపు వెళ్తూ అదృశ్యమయ్యింది. గిరిజనులు ఆమె కోసం వెదుకు తుండగా చిలకల గుట్టపై నెమలినార చెట్టుకింద కుంకుమ భరిణ కనిపించింది. తన శక్తియుక్తులనూ, ధైర్యసాహసాలనూ సమ్మక్క ఆ భరిణలో నిలిపిందని భావించి ఆమె ప్రతి రూపంగా భావించారు గిరిజనులు. అక్కడే గద్దెలను నిర్మించి అప్పటినుండి సమ్మక్క సారలమ్మ జాతర జరి పించ సాగారు.మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగు తుంది. మొదటిరోజు కన్నెపల్లి నుండి సారలమ్మకు ప్రతి రూప మైన పసుపు భరిణను మేళ తాళాలతో తీసుకువచ్చి వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు. రెండవ రోజు సమ్మక్కకు ప్రతిరూపంగా భావించే కుంకు మభరిణను చిలకల గుట్టనుండి తీసుకువచ్చి వెదురుకర్రకు అలంకరిస్తారు. రెండు గద్దెలపై రెండు వెదురు కర్రలను సమ్మక్క, సారలమ్మలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు ‘వనదేవతలు’గా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు నివేదిస్తారు. జంపన్న వాగులో స్నానం చేసి, తలనీలాలు సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. నాలుగవ రోజు సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. – అయిత అనిత, రచయిత్రి -
వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం సుగమమైంది. సమ్మక్క –సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు, ఇతర ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచే వర్సిటీ అందుబా టులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే గిరిజన యూని వర్సిటీ ఏర్పాటును నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో పదేళ్లుగా జాప్యం అవుతూ వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల క్రితమే భూ కేటాయింపులు పూర్తి చేసి గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేసింది. తాత్కాలిక అవస రాల కోసం భవనాలను కూడా కేటాయించింది. అనంతరం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) అప్పగించారు. కానీ కేబినెట్ అనుమతులు, పార్ల మెంటులో బిల్లు ఆమోదం కాకపోవడంతో యూని వర్సిటీ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. హెచ్‌సీయూ పర్యవేక్షణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గెజిట్ జారీ కావడంతో కేంద్ర విద్యా శాఖ అధికారుల బృందం అతి త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతులు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత సంబంధిత అనుమతులన్నీ వేగంగా జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వర్సిటీని హెచ్‌సీయూ పర్యవేక్షించనుంది. ఇప్పటికే కోర్సులు, ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. అనుమతులు వచ్చిన వెంటనే 2023–24 విద్యా సంవత్సరంలో తరగతులు సైతం ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తోంది. రూ.10 కోట్ల నిధులు..498 ఎకరాల భూమి రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2016–17 వార్షిక బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో 498 ఎకరాల భూమిని వర్సిటీ ఏర్పాటు కోసం గుర్తించి గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందులో 285 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 213 ఎకరాలు అటవీ శాఖకు చెందింది. ఈ భూసేకరణ కోసం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపించింది. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను కేటాయించింది. వర్సిటీ ఏర్పాటుపై హెచ్‌సీయూ లోతైన పరిశీలన జరిపి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమర్పించాలని ఆదేశించడంతో, ఆ మేరకు ప్రక్రియ పూర్తి చేసిన హెచ్‌సీయూ.. మూడేళ్ల క్రితమే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. -
మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత
-
Chinna Medaram Photos: మేడారంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర (ఫొటోలు)
-
నా కామెంట్లను వక్రీకరిస్తున్నారు: చినజీయర్ స్వామి
సాక్షి, విజయవాడ: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి ఎలా పుట్టుకువచ్చాయో తెలియదు. గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని నా వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు. ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదు. మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే ఆ వ్యాఖ్యల ఆంతర్యం తెలుస్తుంది. వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే జాలిపడాల్సి వస్తుంది. పైగా ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. ఎవరినీ చిన్నచూపు చూడం అనేది ఉండదు. ఒకళ్లని లేదా కొంత మంది దేవతలను చిన్నచూపు చూసే అలవాటు అస్సలు లేదు. అందర్నీ గౌరవించాలన్నదే మా విధానం. అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. వివాదంపై వారికే వదిలేస్తున్నా అని వివరణ ఇచ్చుకున్నారు చినజీయర్ స్వామి. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారు. ఆదివాసీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వీలైనంత సేవ చేస్తున్నాం. మాకు కుల, మతం తేడాల్లేవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మతాలకతీతంగా ప్రజలు వస్తుంటారు. కులాన్ని పక్కనపెట్టి.. జ్ఞానసంపదను ఆరాధించాలి. ఇదే రామానుజాచార్యులవారు చెప్పింది. ఆదివాసీలకు ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చాం. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించం. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తూ వివాదం చేయడం సరికాదన్నారు చినజీయర్ స్వామి. -
కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!
సాక్షి, వరంగల్: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని కేంద్రమంత్రి ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొమ్మిది ప్రాజెక్టుల జాబితాలో ఏడు తెలంగాణకు సంబంధించినవి కాగా, ఇందులో నాలుగు ఉమ్మడి వరంగల్‌లోనివే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఇదే అంశంపై కేంద్రమంత్రి షెకావత్ రెండు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మరోమారు జిల్లా ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఆపాలన్న ప్రాజెక్టులు ఇవే... కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణకు సంబంధించినవి ఏడు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి సరఫరా పథకం, సీతారామ ఎత్తిపోతలు, లోయర్ పెనుగంగ నదిపై బ్యారేజీలు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతలు, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలపై అభ్యంతరాలు చెప్పింది. ఇందులో రామప్ప, పాకాల సరస్సు మళ్లింపు, కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్), గోదావరి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి వరంగల్‌లోని కీలక ప్రాజెక్టులు. తెలంగాణకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా తుది దశకు చేరింది. తుపాకులగూడెం పనులు శరవేగంగా సాగుతుండగా, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపుపై కూడా జల్‌శక్తి శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియా సమావేశంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేయడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. డీపీఆర్‌ల తయారీపై కసరత్తు అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. మంగళవారం సమావేశం ముగిసిన వెంటనే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఉమ్మడి వరంగల్‌లో ప్రాజెక్టుల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా అభ్యంతరాలు వ్యక్తమైన నాలుగు ప్రాజెక్టులపైనా నివేదికలు సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలకు సంబంధించి పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. కౌన్సిల్ తర్వాత కూడా స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యాన్ని పెంచింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే పనులు చేపట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుందని కౌన్సిల్ సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు మళ్లింపు పథకంపై కొత్త డీపీఆర్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
వాల్‌పోస్టర్ల కలకలం
కరీమాబాద్: వరంగల్ లోని ఖిలావరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ ప్రాంతంలో సోమవారం వెలసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ మహిళ, సాం స్కృతిక సంఘాల ఐక్యవేదిక పేర వెలిసిన ఈ వాల్ పోస్టర్లో ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి ఫొటో ఉంది. ఈ పోస్టర్‌పై ‘మహిళలపై హింసలేని తెలంగాణ కోసం పోరాడుదాం.. సమ్మక్క సారక్కల నుంచి శ్రుతి వరకు బతుకమ్మలను చిదిమి వేసిన రాజ్యానికి బతుకమ్మ ఆడే నైతిక హక్కు ఎక్కడిది?, గడీల బతుకమ్మ కాదు.. బడుగుల బతుకమ్మ ఆడుదాం...’ అని రాసి ఉంది. ఈ వాల్పోస్టర్లపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
జనం నుంచి వనంలోకి
మేడారం నుంచి సాక్షిప్రతినిధి: గిరిజన మహా జాతర ముగి సింది. నాలుగు రోజులుగా కోటి మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేశారు. సమ్మక్క... ఆ తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును వారివారి వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించి వనప్రవేశం చేయించారు. సమ్మక్కను ముందుగా సాయంత్రం 6.01 గంటలకు.. మిగిలిన ముగ్గురినీ 6.20 గంటలకు గద్దెల నుంచి కదిలించారు. వన దేవత వనప్రవేశం కార్యక్రమం సాయంత్రం పూజలతో మొదలయింది. గిరిజన పూజారులు డోలుచప్పుళ్లతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని గిరిజన పూజారుల బృందం గద్దెలపైకి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లి తల్లిని వన ప్రవేశం చేయించారు. సారలమ్మకు పూజలు గోవిందరాజులు, పగిడిద్దరాజులకు పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. అక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె(వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ సమయంలో పూజారులను తాకడానికి ప్రయత్నించారు. అంతకుముందే పగిడిద్దరాజు, గోవిందరాజులును ఇలాగే పూనుగొండ, కొండాయికి చేర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భక్తులు భారీగా హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం జాతర ముగి సిందని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని, భక్తులు మేడారం చేరుకునేందుకు లక్ష వాహనాలు వచ్చాయని తెలిపారు. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్.కాళిదాసు మాట్లాడుతూ 1.30 కోట్ల మంది భక్తులు వచ్చారని, రోడ్లు వెడల్పుగా ఉండడం వల్ల వాహనాలు రెండుమూడు వరుసల్లో వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు. -
మేడారానికి పూనకం
*గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి *దారిపొడవునా వనదేవతకు మొక్కులు *శివసత్తుల పూనకాలు.. గిరిజనుల నృత్యాలు *మేడారంలో ఉప్పొంగిన భక్తిభావం మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం పులకించింది. గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. కోటొక్క భక్తుల కొంగుబంగారం, వనదేవత సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేరింది. నమో సమ్మక్క... జై సమ్మక్క... అంటూ లక్షలాది మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాలు, పోలీసు అధికారి తుపాకీ కాల్పుల మధ్య... తల్లి సమ్మక్కను గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) మేడారం గద్దెలపైకి చేర్చారు. సమ్మక్కను తీసుకువచ్చే ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 5.39 నుంచి రాత్రి 7.52 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది. ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయం 5.30 గంటలకే ప్రారంభమైంది. మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. కలెక్టర్ జి.కిషన్, ఇతర ఉన్నతాధికారులు అక్కడ పర్యవేక్షించారు.కుంకుమ భరిణె రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె, సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా అధికారిక లాంఛనాల ప్రకారం వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు నాలుగు విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక్క తల్లితో మేడారంవైపు బయలుదేరింది. సమ్మక్కకు ఎదురుగా కోళ్లు, గొర్రెలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొక్కులతో తమతో తెచ్చుకున్న ఒడిబాల బియ్యాన్ని సమ్మక్క దారిలో వెదజల్లారు. మరికొందరు భక్తులు ఆ బియ్యాన్ని అపురూపంగా ఏరుకుని దాచుకున్నారు. సమ్మక్క రాకతో తారాస్థాయికి చేరుకున్న భక్తి ప్రవాహం సెలపయ్య గుడికి చేరుకుంది. తల్లి రావడంతో అక్కడి వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ గ్రామ ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. మిగిలిన భక్తులు ఆ ఆనంద క్షణాలను తమ కన్నుల్లో దాచుకున్నారు. ఆపై వడ్డెలు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. కాగా, జాతరకు ముందే 30లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకోగా బుధ, గురువారాల్లో మరో 60లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరలో అపశృతులు.. ఐదుగురు మృతి మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో గురువారం వివిధ సంఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం చెట్టుపల్లికి చెందిన అసంపల్లి పర్వతాలు(55)కు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన బొమ్మెర వెంకన్న(35), సాతుపెల్లి యాకయ్య(70) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నెల్లికుదురు మండలం జైరాం గ్రామానికి చెందిన బాలుడు సంజయ్(6) ఫిట్స్‌తో చనిపోయాడు. తొక్కిసలాటలో కరీంనగర్ వాసి మృతి కోహెడ: కరీంనగర్ జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఒరుగల కనకయ్య(58) బుధవారం కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకొనేందుకు కోహెడ నుంచి మేడారం వెళ్లాడు. గురువారం క్యూలో తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనలో కనుకయ్య అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
‘సమ్మక్క-సారక్క’ వెబ్సైట్ ప్రారంభం
నేడు సోనియా పేరిట సమ్మక్క, సారక్కలకు నిలువెత్తు బంగారం (బెల్లం): పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంప్రదాయ జాతర ‘సమ్మక్క-సారక్క’కు సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ www.sammakka sarakka.co.in వెబ్సైట్లో జాతర విశిష్టతను తెలియజేసే చరిత్ర, భక్తుల కోసం గూగుల్ రూట్ మ్యాప్, అత్యవసర ఫోన్ నంబర్లు, జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీసీ బస్‌ల రాకపోకలు తదితర వివరాలను పొందుపరిచినట్లు పొన్నాల చెప్పారు. జాతర ఏర్పాట్ల కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 15 వరకు సాగే ఈ జాతరకు కోటి మంది హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘అడవి చేసే అమ్మల జాతర’ పేరుతో సమ్మక్క సారక్క దేవతలపై 40 వేల పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసినట్లు చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమ్మక్క సారక్కలకు బుధవారం సమర్పించనున్నట్లు పొన్నాల చెప్పారు. -
మరుగున పడ్డపనులు
మేడారం, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ... తెలంగాణ కుంభమేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతర... కోటిమందికి పైగా భక్తులు తరలివచ్చే మహాజాతర... అలాంటి ప్రతిష్టాత్మకమైన జనజాతరలో కనీస ఏర్పాట్లపై ఆర్డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. కలెక్టర్ కిషన్ విధించిన డెడ్‌లైన్ జనవరి 31 ముంచుకొస్తున్నా.. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నత్తనడకన కొనసా...గుతూనే ఉన్నారుు. మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.2.50 కోట్లతో 10 వేల మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం ములుగు శివారు గట్టమ్మ ఆలయం మొదలుకుని మేడారం పరిసరాల వరకు బిట్లు బిట్లుగా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. జాతరలో అభివృద్ధి పనులను దక్కించుకునే సమయంలో పలు దఫాలుగా చర్చలు జరుపుకుని వాటాలు పంచుకున్న పార్టీలు పనుల పురోగతిపై మాత్రం ఊసెత్తడం లేదు. దీనిపై అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. అనుభవం నేర్వని అధికారులు గత జాతరలో మరుగుదొడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా సాగింది. దీంతో భక్తులు అష్టకష్టాలు పడినా అధికారులు అనుభవ పాఠాలు నేర్వలేదు. దీనికి ఈ జాతరలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులే తార్కాణంగా చెప్పొచ్చు. గత జాతరలో 8,800 మరుగుదొడ్లు నిర్మించారు. అయితే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు వాటిని 10వేలకు పెంచారు. పనుల వద్ద ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఆయా పార్టీలకు ముందుగానే అధికార యంత్రాంగం సంకేతాలు ఇవ్వగా చర్చోపచర్చలు జరుపుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ 40, టీడీపీ 30, టీఆర్ఎస్ 30 శాతం పనుల ‘కంపు’ను పంచుకున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటినా పనుల్లో మాత్రం చురుకుదనం కారావడంలేదు. గతంలో జాతర రేపుమాపు అనే వరకూ పనులు చేయడంతో తొలిరోజే కంపు..కంపు అయిన పరిస్థితి తెలిసిందే. ముందస్తుగా పనుల పూర్తిపై వెంటబడని అధికార యంత్రాంగం డెడ్‌లైన్ దగ్గరపడ్డాక పరుగులు పెట్టించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పనులు దక్కించుకున్న వారు అడ్డదిడ్డంగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పలుచోట్ల కనీసం వాడకముందే మరుగుదొడ్లు కూలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవంతోనైనా ముందస్తు చర్యలు చేపడుతారనుకుంటే ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. బేస్మెంట్ దశలో... ములుగు గట్టమ్మ ఆలయం శివారు నుంచి మేడారం జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపూర్, రెడ్డిగూడెం, కాల్వపల్లి పరిసరాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. పలుచోట్ల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఊరట్టం, మేడారం ఇంగ్లిష్ మీడియం, చిలకలగుట్ట తదితర చోట్ల బేస్మెంట్ దశకు వచ్చాయి. తూతూమంత్రంగా చేపడుతున్న పనుల కు సరిగా క్యూరింగ్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో అవి కుంగిపోయి భక్తులకు నరకప్రాయంగా మారే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టడంతో అధికారుల పర్యవేక్షణ కూడా సరిగా లేని పరిస్థితి. పనులు త్వరగా పూర్తి చేస్తే మరుగుదొడ్ల బేసిన్లు ఎత్తుకుపోతారని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. దీనిని సాకుగా చూపి పనుల్లో వేగం పూర్తిగా తగ్గించేశారు. అయితే పనులు దక్కించుకున్న వారు కూడా మమ అనిపించి నిధులు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. పేరుకే 10వేల మరుగుదొడ్ల సంఖ్య ఉందని, వీటిలో ఏడెనిమిది వేల మరుగుదొడ్లు చేపట్టి మిగతావి రికార్డుల్లో రాసుకుని పంపకాలు చేసుకుంటారన్న ఆరోపణలున్నాయి. గత జాతరలో నాసిరకానికి తోడు ఇలాంటి తతంగం జరిగిందని అప్పట్లో పనుల సందర్శనకు వచ్చిన ఆయా పార్టీల బృందాలే బాహాటంగా ఆరోపించాయి. అయితే ఆ మూడు పార్టీలు పనుల కంపును పంచుకున్నందున ఇప్పుడు అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల మేలుకోరే అధికారులు ఈసారైనా కక్కుర్తి పనులకు మంగళం పాడాల్సిన అవసముంది. ఇప్పటికే జాతర సందడి నెలకొన్న క్రమంలో మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
కరెంట్ గేమ్!
=పెండింగ్ బిల్లులు చెల్లించేది లేదన్న సర్కారు =వసూలు చేయూలని ఏపీఈఆర్సీ హుకుం =తలపట్టుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులు =బకారుులు రాకపోవడంతో మొదలుకాని పనులు =ముంచుకొస్తున్న మేడారం జాతర గడువు వరంగల్, న్యూస్‌లైన్ : దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కోటి మందికి పైగా భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు క్యూ కడతారు. అలాంటి మహాజాతరకు ఇంకా 65 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇప్పటివరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి పనులూ మొదలుకాలేదు. వరుసగా ఐదు జాతరలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.2.42 కోట్లను సర్కారు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చెల్లించేది లేదని తేల్చిచెప్పిన సర్కారు.. వసూలు చేయూల్సిందేనని ఏపీఈఆర్సీ స్పష్టం చేయడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సంధిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతూ పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఐదేళ్లుగా మొండి‘చేరుు’ వరుసగా 2004, 2006, 2008, 2010, 2012 మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. చిలుకల గుట్ట, కన్నెపల్లి నుంచి మేడారం చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేరకు విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేసేవారు. అంతేకాకుండా వారం రోజులపాటు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇక్కడ ఓ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేవారు. ఈ మేరకు ఏర్పాట్ల కోసం వెచ్చిస్తున్న నిధులతోపాటు విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2004కు ముందు దేవాదాయ శాఖ ఈ ఖర్చులను భరించేది. కానీ... 2004 నుంచి ఇప్పటివరకు సర్కారు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బకారుులు రూ. 2.42 కోట్లకు చేరాయి. తంటాలు పడుతున్న అధికారులు మేడారం జాతరకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఎన్పీడీసీఎల్ అధికారులు గతంలో పలుమార్లు నివేదించారు. నెల రోజుల క్రితం కూడా పాత బిల్లులు, కొత్తగా చేపట్టనున్న పనులకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. బిల్లులు విడుదల చేయాలంటూ అందులో విజ్ఞప్తి చేశారు. ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేల్చిచెప్పడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు ఏపీఈఆర్సీకి నివేదించారు. సదరు బిల్లు మొత్తం ప్రభుత్వం నుంచి తీసుకోవాలని అక్కడి నుంచి సమాధానం రావడంతో వారు సందిగ్ధంలో పడిపోయూరు. అటు ప్రభుత్వం ఇవ్వక... ఇటు ఈఆర్సీ ఆమోదించకపోవడంతో అధికారులు తలపట్టుకున్నారు. పనులు మొదలుపెట్టని అధికారులు మేడారం జాతర సమయం దగ్గరపడుతున్నా... పెండింగ్ బిల్లులు రాకపోవడంతో విద్యుత్ అధికారులు ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఈసారి కొత్తగా తాత్కాలిక లైన్లు, లైట్ల ఏర్పాట్ల కోసం రూ.1.66 కోట్లు అవసరమున్నట్లు నివేదించారు. వాటిని ఆమోదించి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కూడా ఆమోదించింది. కానీ... నిధుల విడుదలకు వచ్చేసరికి ఎప్పుడూ ఉత్తి చేయే చూపిస్తుండడంతో వారు మొండికేసినట్లు తెలుస్తోంది.