=పెండింగ్ బిల్లులు చెల్లించేది లేదన్న సర్కారు
=వసూలు చేయూలని ఏపీఈఆర్‌సీ హుకుం
=తలపట్టుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులు
=బకారుులు రాకపోవడంతో మొదలుకాని పనులు
=ముంచుకొస్తున్న మేడారం జాతర గడువు
వరంగల్, న్యూస్‌లైన్ : దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కోటి మందికి పైగా భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు క్యూ కడతారు. అలాంటి మహాజాతరకు ఇంకా 65 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇప్పటివరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి పనులూ మొదలుకాలేదు. వరుసగా ఐదు జాతరలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.2.42 కోట్లను సర్కారు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చెల్లించేది లేదని తేల్చిచెప్పిన సర్కారు.. వసూలు చేయూల్సిందేనని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేయడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సంధిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతూ పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
ఐదేళ్లుగా మొండి‘చేరుు’
వరుసగా 2004, 2006, 2008, 2010, 2012 మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. చిలుకల గుట్ట, కన్నెపల్లి నుంచి మేడారం చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేరకు విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేసేవారు. అంతేకాకుండా వారం రోజులపాటు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇక్కడ ఓ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేవారు. ఈ మేరకు ఏర్పాట్ల కోసం వెచ్చిస్తున్న నిధులతోపాటు విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2004కు ముందు దేవాదాయ శాఖ ఈ ఖర్చులను భరించేది. కానీ... 2004 నుంచి ఇప్పటివరకు సర్కారు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బకారుులు రూ. 2.42 కోట్లకు చేరాయి.
తంటాలు పడుతున్న అధికారులు
మేడారం జాతరకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఎన్పీడీసీఎల్ అధికారులు గతంలో పలుమార్లు నివేదించారు. నెల రోజుల క్రితం కూడా పాత బిల్లులు, కొత్తగా చేపట్టనున్న పనులకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. బిల్లులు విడుదల చేయాలంటూ అందులో విజ్ఞప్తి చేశారు. ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేల్చిచెప్పడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు ఏపీఈఆర్‌సీకి నివేదించారు. సదరు బిల్లు మొత్తం ప్రభుత్వం నుంచి తీసుకోవాలని అక్కడి నుంచి సమాధానం రావడంతో వారు సందిగ్ధంలో పడిపోయూరు. అటు ప్రభుత్వం ఇవ్వక... ఇటు ఈఆర్‌సీ ఆమోదించకపోవడంతో అధికారులు తలపట్టుకున్నారు.
పనులు మొదలుపెట్టని అధికారులు
మేడారం జాతర సమయం దగ్గరపడుతున్నా... పెండింగ్ బిల్లులు రాకపోవడంతో విద్యుత్ అధికారులు ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఈసారి కొత్తగా తాత్కాలిక లైన్లు, లైట్ల ఏర్పాట్ల కోసం రూ.1.66 కోట్లు అవసరమున్నట్లు నివేదించారు. వాటిని ఆమోదించి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కూడా ఆమోదించింది. కానీ... నిధుల విడుదలకు వచ్చేసరికి ఎప్పుడూ ఉత్తి చేయే చూపిస్తుండడంతో వారు మొండికేసినట్లు తెలుస్తోంది.
కరెంట్ గేమ్!
Published Sun, Dec 8 2013 4:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement