ప్రేమ పేరిట మోసగించిన ఓ విద్యార్ధిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ప్రేమ పేరిట మోసగించిన ఓ విద్యార్ధిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ మోహన్ కథనం ప్రకారం... ఏ.ఎస్.రావు నగర్ సాయినాథపురానికి చెందిన వసపోతుల ప్రశాంత్(23) ఈసీఐఎల్‌లోని వసుంధర డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. మల్కాజిగిరి అనంత సరస్వతీనగర్‌లో నివాసముంటున్న బంధువుల అమ్మాయి(20)ని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొన్నటిదాకా పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికిన ప్రశాంత్ ఇప్పుడు మాట మార్చాడు.
తనకు కట్నం ఇస్తేనే మూడు ముళ్లు వేస్తానని లేకపోతే పెళ్లి అనే మాట తన వద్దకు తీసుకురావద్దని యువతిని హెచ్చరించాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.