
మరోసారి నిర్మాతగా..?
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తనలోని మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న ఈ యంగ్ హీరో నిర్మాణ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఢీ ఫర్ దోపిడి సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు.
దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. డైలాగ్ ఇన్ ద డార్క్ పేరుతో షార్ట్ ఫిలిం తీసిన ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. దేశంలోనే తొలి సారిగా వర్చువల్ ఆడియో టెక్నాలజీతో షార్ట్ ఫిలిం నిర్మించిన ప్రశాంత్, నానికి ఇంట్రస్టింగ్ లైన్ చెప్పి మెప్పించాడట. మరి నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నటిస్తాడో లేదో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.