పిట్లం, న్యూస్‌లైన్: అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటున్న మోసగాళ్లు వారిని మోసగిస్తూ వేల రూపాయలు దోచుకుంటున్నారు. మీ ఫోన్ నంబర్‌కు లక్షల రూపాయల లాటరీ తగిలింది. మీరు అందులో ఒక శాతం మాపేరున ఉన్న ఖాతాల్లో జమచేస్తే మీ ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేస్తాం అని ఫోన్లు చేస్తుండటంతో వారి మాటలను నమ్మిన అమాయక జనం చివరికి మోసపోతున్నారు. శుక్రవారం జుక్కల్ మండ లం మహ్మదాబాద్ గ్రామ తండాకు చెందిన పాండు జాదవ్ అనే వ్యక్తికి ముంబయి నుంచి ఓ ఫోన్ వచ్చిం ది. తనపేరు సురేంద్రలాల్ అని, పాండుజాదవ్‌కు ఫోన్ నంబర్‌కు రూ. 25 లక్షల లాటరీ తగిలిందని చెప్పాడు. అయితే అందులో ఒక శాతం అంటే రూ. 25 వేలు తమ ఖాతాలో (నంబర్ 33143374026) జమచేస్తే రూ. 25 లక్షలు పాండుజాదవ్ ఖాతాలో జమ చేస్తాం అని ఫోన్‌లో చెప్పారు. అది నమ్మిన పాండుజాదవ్ రూ. 25 వేలను తీసుకుని పిట్లం ఎస్‌బీ ఐ బ్రాంచ్‌కి వెళ్లాడు.
అనంతరం అనుమానం వచ్చి విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో ఇందులో ఏదో మోసం ఉందని స్నేహితుడు వారించడంతో డబ్బు ఖాతాలో జమ చేయలేదు. అనంతరం మళ్లీ ముంబ యి నుంచి ఫోన్ చేసి మీ వద్ద ఎంత డబ్బు ఉంటే అంత జమ చేయాలని చెప్పారు. దీంతో జాదవ్ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ‘న్యూస్‌లైన్’ పిట్లం ఎస్‌బీఐ బ్యాంకులో విచారణ చేయగా గతంలో జుక్కల్ మండలం నుంచి కొందరు యువకులకు ఫోన్ రాగా వారు ఒక్కొక్కరు వేల రూపాయలు ఖాతాల్లో జమచేసి మోసపోయారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయపై పిట్లం ఎస్సై ప్రశాం త్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇటువంటి మోసాలను ప్రజలు నమ్మొద్దని, ఫోన్ వచ్చినవెంటనే పోలీ సులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరునెలల క్రితం జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన యువకులు ఇలాగే మోసపోయారని పేర్కొన్నారు.