pitlam
-
నా భర్తతో ఉండను.. రాందాస్‌తోనే ఉంటా..
సాక్షి, పిట్లం(కామారెడ్డి): వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె ప్రియుడి ప్రాణం మీదికి తెచ్చింది. భర్త దాడి చేయగా ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైయ్యాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని నాగంపల్లితండాకు చెందిన చందర్‌కు, కాస్లాబాద్‌తండాకు చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలిపని చేస్తూ నివసిస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి, తలాబ్‌తండాకు చెందిన రాందాస్ అనే యువకుడు ప్రే మించుకుంటున్నారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఈక్రమంలో శుక్రవారం రాందాస్ నాగంపల్లితండాలోని లక్ష్మిని కలవడానికి వెళ్లగా భర్త చందర్, కుటుంబసభ్యులు అతడిని బెదిరించి పంపించివేశారు. వెంటనే లక్ష్మి, తన పిల్లలతో కలిసి పిట్లం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తతో ఉండనని, రాందాస్‌తోనే ఉంటానని తెలిపింది. రాందాస్, లక్ష్మి స్టేషన్లోనే ఉండగా.. సాయంత్రం రాందాస్ కానిస్టేబుల్‌ను వెంటతీసుకొని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ లక్ష్మి భర్త చందర్ కత్తితో రాందాస్‌పై దాడి చేసి తల, ఛాతి, కడుపుపై మూడు కత్తిపోట్లు పోడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్‌ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు రాందాస్‌ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చదవండి: (విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..) -
సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు
సాక్షి, పిట్లం(కామారెడ్డి) : మండల కేంద్రంలోని శాంతినగర్, రాజీవ్‌గాంధీ, బీజే కాలనీల్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4 గంటలకే ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించారు. దీంతోపాటు కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. మూడు కాలనీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 150 మోటారు సైకిళ్ళు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను ఎస్పీ శ్వేత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి దుకాణదారుడు, ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా చోరీలు జరిగే ఆస్కారం ఉండదన్నారు. ఇటీవలి కాలంలో చోరీలు పెరిగాయని, వాటిలో అధికంగా సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో చోరీలు జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. కొద్ది రోజుల కింద పిట్లం బస్టాండ్ ఎదురుగా ఉన్న బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. పోలీసులు ఎంత పటిష్టంగా కాపలా ఉన్నా చోరీలు జరుగుతుంటాయని, వీటిని నివారించాలంటే సీసీ కెమెరాలు మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఇక వాహనదారులు వాహనం నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. దీంతో పాటుగానే ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. తరువాత స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా పత్రాలు ఉన్నవాటిని యజమానులకు అప్పగించారు. వాహనాలకు సరైన పత్రాలు లేనివాటికి జరిమాన విధించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి, బిచ్కుంద సీఐ నవీన్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, నవీన్ కుమార్, సాయన్న, అభిలాష్, అశోక్, సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయం ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ శ్వేత తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఉదయం ఎస్పీ శ్వేత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డ్లను పరిశీలించి స్టేషన్ పరిసరాలను చూసి ఎస్ఐ నవీన్ కుమార్‌తోపాటు సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మిగితా పోలీస్ స్టేషన్లు పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను, సీసీ కెమెరాలు పని తీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ నవీన్ కుమార్, ఏఎస్ఐ మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
పిట్లాం (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా పిట్లాం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రా బ్యాంకులోకి శనివారం అర్ధరాత్రి తర్వాత చొరబడిన దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సైరన్ మోగడంతో దుండగులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అటవీ అధికారులకు జింక అప్పగింత
పిట్లం(నిజామాబాద్): గుంపు నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన జింకపిల్లను గుర్తించిన స్థానికులు దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం చిల్లరగి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి గ్రామ చెరువులో నీళ్లు తాగడానికి అప్పుడప్పుడు జింకలు వస్తూంటాయి. అలాగే వచ్చిన జింకపిల్ల తిరిగి దారి మరిచి గ్రామంలోనికి వచ్చేసింది. దాన్ని గమనించిన కొందరు యువకులు పట్టుకుని గ్రామ పంచాయతి ఆఫీసులో ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
లాటరీల పేర ఘరానా మోసం
పిట్లం, న్యూస్‌లైన్: అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటున్న మోసగాళ్లు వారిని మోసగిస్తూ వేల రూపాయలు దోచుకుంటున్నారు. మీ ఫోన్ నంబర్‌కు లక్షల రూపాయల లాటరీ తగిలింది. మీరు అందులో ఒక శాతం మాపేరున ఉన్న ఖాతాల్లో జమచేస్తే మీ ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేస్తాం అని ఫోన్లు చేస్తుండటంతో వారి మాటలను నమ్మిన అమాయక జనం చివరికి మోసపోతున్నారు. శుక్రవారం జుక్కల్ మండ లం మహ్మదాబాద్ గ్రామ తండాకు చెందిన పాండు జాదవ్ అనే వ్యక్తికి ముంబయి నుంచి ఓ ఫోన్ వచ్చిం ది. తనపేరు సురేంద్రలాల్ అని, పాండుజాదవ్కు ఫోన్ నంబర్‌కు రూ. 25 లక్షల లాటరీ తగిలిందని చెప్పాడు. అయితే అందులో ఒక శాతం అంటే రూ. 25 వేలు తమ ఖాతాలో (నంబర్ 33143374026) జమచేస్తే రూ. 25 లక్షలు పాండుజాదవ్ ఖాతాలో జమ చేస్తాం అని ఫోన్లో చెప్పారు. అది నమ్మిన పాండుజాదవ్ రూ. 25 వేలను తీసుకుని పిట్లం ఎస్బీ ఐ బ్రాంచ్‌కి వెళ్లాడు. అనంతరం అనుమానం వచ్చి విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో ఇందులో ఏదో మోసం ఉందని స్నేహితుడు వారించడంతో డబ్బు ఖాతాలో జమ చేయలేదు. అనంతరం మళ్లీ ముంబ యి నుంచి ఫోన్ చేసి మీ వద్ద ఎంత డబ్బు ఉంటే అంత జమ చేయాలని చెప్పారు. దీంతో జాదవ్ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ‘న్యూస్‌లైన్’ పిట్లం ఎస్బీఐ బ్యాంకులో విచారణ చేయగా గతంలో జుక్కల్ మండలం నుంచి కొందరు యువకులకు ఫోన్ రాగా వారు ఒక్కొక్కరు వేల రూపాయలు ఖాతాల్లో జమచేసి మోసపోయారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయపై పిట్లం ఎస్సై ప్రశాం త్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇటువంటి మోసాలను ప్రజలు నమ్మొద్దని, ఫోన్ వచ్చినవెంటనే పోలీ సులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరునెలల క్రితం జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన యువకులు ఇలాగే మోసపోయారని పేర్కొన్నారు.