lottary
-
లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు
ఆ జంటకు లాటరీ తగలడంతో వారిద్దరూ ఆ సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేస్తూ, ఎంజాయ్ చేశారు. ఇంతలో వారికి వచ్చిన ఒక ఈమెయిల్ వారి జీవితాలను దుర్భరం చేసింది. తమకు లాటరీలో £1.8 మిలియన్(18 కోట్లు) వచ్చిన విషయం, ఆ తరువాత భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తమను ఎలా విడదీసినదీ ఆ మహిళ తెలిపింది. భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు రోజర్, లారా గ్రిఫిథ్స్లు 2005లో నేషనల్ లాటరీలో జాక్‌పాట్ కొట్టారు. ఆ సొమ్ములోని కొంత మొత్తంతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఎంజాయ్ చేసేందుకు మిగిలిన మొత్తం ఖర్చు చేశారు. దీంతో వెనక్కి తిరిగిచూసుకుంటే తమ దగ్గర అస్సలు డబ్బులు మిగలలేదని లారా తెలిపింది. చాలామంది మాదిరిగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దుబాయ్‌లో ఎంజాయ్ లాటరీ సొమ్ము అందిన కొన్ని వారాలకు రోజర్£18,000తో సాఫ్ట్-టాప్ ఆడీ కొనుగోలు చేశాడు. లారా తాము దుబాయ్‌లో ఎంజాయ్ చేసేందుకు, బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రోజర్ మాట్లాడుతూ తాము 10 రోజుల్లో £15,000 ఖర్చు చేశామని తెలిపారు. ఆమెకు హ్యాండ్ బ్యాగ్లన్నా, షాపింగ్అన్నా ఇష్టమని అన్నారు. దంతాలను తెల్లగా మార్చుకునేందుకు.. డైలీస్టార్ తెలిపిన వివరాల ప్రకారం రోజర్ తన దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖర్చు చేశాడు. కూల్‌గా కనిపించేందుకు డిజైనర్ దుస్తులు కొనుగోలు చేశారు. బొటెక్స్ కోసం ఒకసారి £300 ఖర్చు చేశాడు. టాటూల కోసం £500కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. లాటరీ గెలుచుకున్న ఎనిమిదేళ్ల తరువాత అంటే 2013 నాటికల్లా వారి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. వారి అనుబంధం కూడా ముగిసింది. రోజూ విలాసవంతమైన పార్టీలు 14 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. తమ ఆర్థిక దుస్థితికి కారణం నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపించుకున్నారు. లారా మాట్లాడుతూ లాటరీ గెలుచుకున్న తరుణంలో తమ మధ్య వివాదాలు లేవన్నారు. తాము రోజూ పార్టీలు చేసుకునేవారమన్నారు. ఆనందంగా కాలం గడిపామన్నారు. అయితే డబ్బును ఎలా కాపాడుకోవాలో తమకు తెలియలేదన్నారు. బూడిదైన భవనం.. భారీగా నష్టం తాము లాటరీ సొమ్ములోని £670,000తో నార్త్ యార్క్‌షైర్‌లో కొనుగోలు చేసిన భవనం 2010లో కాలి బూడిదయ్యిందన్నారు. తాము ఆ ఇంటికి తక్కువ మొత్తానికే బీమా చేయించామన్నారు. ఆ సొమ్ము వచ్చినప్పుడు తన భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తాను చూశానని లారా తెలిపింది. దానిలో భర్త అతని స్నేహితుడిని మరో యువతి ఫోన్ నంబర్ అడిగినట్లు ఉందన్నారు. అదే తమ జీవితాలను దుర్భరం చేసిందన్నారు. తాను తన భర్త అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణను గమనించానని లారా పేర్కొన్నారు. తన భర్త ఒక యువతి ఫోన్ నంబర్ అడిగిప్పుడు అతని స్నేహితుడు ఆమెతో ఎంజాయ్ చేసేందుకు భర్తకు సలహాలు ఇచ్చాడని లారా తెలిపింది. దూరమైన భర్త దీనిని తాను గమనించానని తెలిసినా తన భర్త తనను క్షమాపణలు కోరలేదని, పైగా అతని బ్యాగు సద్దుకుని, తనపై అరుస్తూ, తనను నిందిస్తూ వెళ్లిపోయాడని లారా తెలిపింది. తరువాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని, ఫేస్బుక్లో అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా తనను బ్లాక్చేశాడని లారా తెలిపింది. వారం రోజుల పాటు అతనిని ద్వేషించానని, ఆ తరువాత అతనిని మనసులోనే క్షమించేశానని, ఎందుంటే అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని లారా పేర్కొంది. ఇది కూడా చదవండి:‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు.. -
లక్కీ ఫెలో.. భార్య వద్దన్నా లాటరీ టికెట్ కొన్నాడు.. ఇలా జాక్‌పాట్..
ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్ కొనడంతో రోషన్ భార్య తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదట బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై పన్నులన్నీ తీసాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: బైక్‌పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్ -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
బిక్షాటనలో రూ.43 లక్షల లాటరీ
పారిస్ : ఉపాధి లేకపోవడంతో ఆ నలుగురు బిచ్చగాళ్లుగా మారారు. వీరికి రోజూ పూట గడవడమే కష్టంగా ఉండేది. బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవారు. అయితే లాటరీ టికెట్లు అమ్మే దుకాణాన్ని బిక్షాటనకు స్థలంగా ఏంచుకున్నారు. ఎందుకంటే లాటరీ టికెట్లు కొనేందుకు అక్కడికి జనం ఎక్కువగా వస్తారనేది వీరి ప్లాన్. అవతలి వారికి లాటరీ తగులుతుందే లేదో తెలియదు గానీ కస్టమర్లు పారేసిన లాటరీ టికెట్లను భద్రంగా ఉంచుకునేవారు. ఏదోఒక రోజు వారికి ఆ లాటరీ టికెట్ల రూపంలో లక్షలు తగిలే అవకాశం ఉండవచ్చన్నది. (చదవండి : భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) ఆరోజు రానే వచ్చింది. ఒకరోజు అక్కడికి ఓ యువతి వచ్చి లాటరీ టికెట్ కొన్నారు. అప్పటికే పక్కనే ఉన్న ఆ నలుగురు బిచ్చగాళ్లు దానం చేమయని యువతిని ప్రాదేయపడగా ఆమె ఏం ఆలోచించకుండా చేతిలో ఉన్న లాటరీ టికెట్‌ను బిక్షంగా వేసింది. బిక్షమడిగితే డబ్బులు ఇవ్వకుండా ఎందుకు పనికిరాని లాటరీ టికెట్ చేతిలో పెట్టిందేంటి అనుకున్నారు. అయితే లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగానే వారి కళ్లు బైర్లు కమ్మాయి. దాదాపు 50వేల యూరోలు( దాదాపు రూ. 43లక్షల రూపాయలు) వారికి లాటరీగా తగలింది. పాపం ఆ యువతి తాను కొన్ని టికెట్‌ను కనీసం స్క్రాచ్ చేయకుండా ఎందుకు వీరికి బిచ్చమేసిందో తెలియదుగాని వారిని లక్ష్మీదేవి కనికరించింది. అయితే లాటరీ నిజంగా గెలుచుకున్నామా లేదా అనే సంగతి తెలుసుకోవడానికి ఫ్రెంచ్ లాటరీ ఆపరేటర్ ఎఫ్డీజేను కలుసుకున్నారు. వారికి నిజంగానే లాటరీలో డబ్బు వచ్చిందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యువతి దానం చేసిన లాటరీలో గెలుచుకున్న డబ్బులు వీరికే సొంతమని పేర్కొంది.(చదవండి : కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?!) -
ఉద్యోగం పోయినా రూ. 46 కోట్లు వచ్చాయి
వెల్లింగ్టన్ : ఈ వార్త చదివిన తర్వాత అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. లాక్డౌన్ పుణ్యమా అని ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తికి అక్షరాల రూ. 46 కోట్లు లాటరీ ద్వారా తగిలాయి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వింత ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌తో కట్టడికి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే పని చేపట్టాయి. ఈ విధంగా న్యూజిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఉద్యోగం ఊడింది. అయితే ఆయన ఎప్పుడో తీసుకొన్న లాటరీ టికెట్ అదృష్టాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఉద్యోగం ఊడిపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఆ వ్యక్తికి కంప్యూటర్ ఏదో చూస్తుండగా వెబ్సైట్లో లాటరీ ఫలితాలు కనిపించాయి. దీంతో తనకు ఏమైనా అదృష్టం కలిసొస్తుందేమోనని లాటరీ టికెట్‌ను చెక్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తికి దాదాపు రూ.46 కోట్ల (10.3 న్యూజిలాండ్ డాలర్స్) ప్రైజ్ మనీ వచ్చింది. ఈ విషయాన్ని మైలోటో కస్టమర్ సపోర్ట్ కూడా స్పష్టం చేసింది. ఉద్యోగం చేస్తున్న భార్య ఇంటికి రాగానే లాటరీ తగిలిన విషయం చెప్పి.. ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ముందు ఆమె నమ్మకపోయినా లాటరీ టికెట్ చూపించడంతో ఎగిరి గంతేసింది. ' మా పంట పండిందనే చెప్పాలి. మొత్తానికి లాటరీ ద్వారా కోట్లు సంపాదించిన తాము ఆ డబ్బుతో ముందుగా పాతబడిన కారును రిపేరింగ్ చేయించుకోవాలి. తర్వాత మిగిలిన డబ్బుతో మంచి ఇళ్లుతో పాటు పిల్లలకు ఉన్నత విద్యను చెప్పించాలని నిర్ణయించుకున్నామని' సదరు వ్యక్తి భార్య పేర్కొన్నారు. (కరోనా.. 24 గంటల్లో 132 మంది మృతి) -
అదృష్టమంటే వాళ్లదే..!
-
అదృష్టం అంటే ఈయనదే, ఒక్క టిక్కెట్టుతో..
దుబాయ్: పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వచ్చి చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరుడ్ని చేసింది. సోమవారం ఈ లాటరీ సంస్థ విజేతలను ప్రకటించింది. కేరళకు చెందిన ధనీష్ అనే 25 ఏళ్ల యువకుడు లాటరీలో ఒక మిలియన్ డాలర్ల(అంటే రూ.6,49,25,000/-)ను గెలుచుకున్నారు. ఆయనతో పాటు జోర్దాన్ దేశానికి చెందిన వ్యక్తి కూడా ఈ లాటరీలో విజేతగా నిలిచారు. ఆయన కూడా ఒక మిలియన్ డాలర్ల నగదు పొందనున్నారు. దుబాయ్‌లో ఏడాదిన్నర కాలం ఎలక్ట్రీషన్‌గా పని చేసిన ధనీష్.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ టిక్కెట్టును మొదటిసారిగా కొన్నట్లు ధనీష్ తెలిపారు. లాటరీ సిరీస్ 266లో 4255 టిక్కెట్టు నంబర్‌పై అయన విజేతగా నిలిచారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన సదరు లాటరీ సంస్థను నుంచి తాను గెలిచినట్లు ఫోన్ వచ్చిందని చెప్పారు. -
లాటరీ పేరుతో రూ.10 కోట్ల లూటీ!
సాక్షి, హైదరాబాద్: ఒకే వ్యక్తి.. ఒకే చిరునామా.. 14 బ్యాంక్ ఖాతాలు.. నకిలీ పత్రాలతో బోగస్ కంపెనీ.. దాని పేరిట లాటరీతో జనానికి కుచ్చుటోపీ.. ఒకరిద్దరు కాదు దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు! వేలు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకుపైగా దోపిడీ!! హైదరాబాద్ కేంద్రంగా ఓ చీటర్ సాగించిన ఘరానా మోసమిదీ. ఒకే అడ్రస్‌తో అనేక బ్యాంకుల ద్వారా జరుగుతున్న నగదు లావాదేవీలపై అనుమానంతో కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్.. తీగ లాగితే ఈ డొంకంతా కదిలింది. ఆర్థికశాఖ అధికారుల ఆదేశాలతో ఈ మోసంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో విస్తుబో యే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. షెవర్లీ లాటరీ వచ్చిందంటూ.. హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో ఉన్న ఓ అడ్రస్‌తో రాజేశ్‌కుమార్ అనే వ్యక్తి ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరిచాడు. ఈ కంపెనీ పేరుతో నగరానికి చెందిన అగర్వాల్ అనే వ్యక్తి సెల్‌కు రూ.2.5 కోట్ల షెవర్లీ లాటరీ వచ్చిందంటూ సందేశం పంపాడు. తర్వాత కొద్దిసేపటికే అతడికి ఇంటర్నేషనల్ ఇంటర్ నెట్ కాల్ వచ్చింది. ‘మీకు షెవర్లీ లాటరీ వచ్చింది. రూ.2.5 కోట్లు. ఇది కావాలంటే ఖాతా నంబర్ 112401500363(టోలిచౌక్‌లోని ఐసీఐసీఐ బ్రాంచీ)లో రూ.లక్ష, జ మ చేయండి’అని చెప్పారు. ఇది నమ్మిన అగ ర్వాల్ ఆ ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేశాడు. వారం, నెల గడిచినా లాటరీ డబ్బులు రాలేదు. ఇంతలో మరో ఇంటర్నెట్ కాల్ వచ్చింది. ‘మీ డబ్బు ప్రాసెస్‌లో ఉంది. ఆర్బీఐ వాళ్లు చెక్ చేస్తున్నారు. త్వరలోనే అందుతుంది’అంటూ నమ్మించాడు. చివరికి నెలలు గడిచినా డబ్బు రాలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులు తనను విచారిస్తారన్న భయంతో అగర్వాల్ మిన్నకుండిపోయాడు. ఇలా బెంగళూరు, అహ్మదాబాద్, బాంగూర్‌నగర్(గుర్గావ్), భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే.. ఇలా దాదాపు 15 నగరాల్లో అమాయకులను మోసం చేసి బ్యాంకు అకౌంట్ల్లో కోట్ల రూపాయలు జమ చేయించుకున్నాడు. ఎవరీ రాజేశ్‌కుమార్? పెద్దసంఖ్యలో జనాలను బురిడీ కొట్టించిన రాజేశ్‌కుమార్ ఎవరు? పాన్ నంబర్‌పై ఉన్న ఫొటో అతడిదేనా? లేదా ఇంకెవరిదైనానా? ఇప్పుడు సీఐడీని వేధిస్తున్న ప్రశ్నలివీ. సెల్‌ఫోన్ వాడకుండా, ఇంటర్నెట్ కాల్స్‌తో జనాలను మోసం చేసిన అతడిని ఎలా పట్టుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ నంబర్లు.. ఒకే అడ్రస్‌పై ఉన్నాయి. ఆ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేస్తే అసలు ఆ పేరుతో ఎవరూ లేరని, తాను 17 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నానని ఓ మహిళ తెలిపింది. చుట్టుపక్కల విచారించినా, జీహెచ్ఎంసీ, తదితర రికార్డులు చెక్‌చేసినా సంబంధిత మహిళ పేరిటే ఉన్నాయి. దీంతో రాజేశ్‌కుమార్‌ను పట్టుకోవడం ఎలా? అతడికి హైదరాబాద్‌లోని అడ్రస్ ఎలా చిక్కింది? అన్న అంశాలపై అధికారులు దృష్టి సారించారు. రాజేశ్‌కుమార్ ఉపయోగించిన ఫోన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ నంబర్‌కు సంబంధించిన కాల్‌డేటాలు బయటకు తీయడం అంతసులభం కాదు. ఏడాదిలోపు కాల్‌డేటా మాత్రమే సర్వీస్ ప్రొవైడర్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఏడాది మించితే కాల్‌డేటా రాదు. ఒకవేళ ఉన్నా అందించకూడదన్న కోర్టు ఆదేశాలుండటంతో కేసు సంక్లిష్టంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం రాజేశ్‌కుమార్‌కు సంబంధించిన 14 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. డబ్బు పడగానే విత్‌డ్రా.. దేశవ్యాప్తంగా షెవర్లీ లాటరీ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించిన రాజేశ్‌కుమార్.. తన ఖాతాలో డబ్బులు పడిన నిమిషాల్లో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డ్రా చేసుకునే వాడు. అయితే ఈ విత్‌డ్రా కూడా ఒక్క ప్రాంతంలో కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కావడంతో సీఐడీకి చుక్కలు చూపుతోంది. ఖాతాల్లోని డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఏటీఎం సెంటర్లతో ఎలా విత్‌డ్రా అయ్యాయో అర్థం కావడం లేదు. లాటరీ పేరిట రాజేశ్‌కుమార్ 2011, 2012 రెండేళ్ల కాలంలో రూ.4.5 కోట్ల లావాదేవీలను సాగించినట్టు సీఐడీ గుర్తించింది. ఆ తర్వాత జరిగిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నామని, అమాయకుల నుంచి సుమారు రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి ఉంటాడని సీఐడీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ అడ్రస్‌తో 14 ఖాతాలు.. టోలీచౌక్, దిల్షాన్కాలనీ అడ్రస్‌పై దొంగ పత్రాలు సృష్టించిన రాజేశ్‌కుమార్ హైదరాబాద్‌లో ఏకంగా 14 బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అన్ని అకౌంట్లు ఆర్కే ఎంటర్ప్రైజెస్, రాజేశ్‌కుమార్ పేరుతో తెరిచినట్టు బ్యాంకు అధికారులు సీఐడీకి తెలిపారు. ఆ ఖాతాలు.. యాక్సిస్ బ్యాంక్, పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్; ఐసీఐసీఐ బ్యాంక్, నాగార్జునహిల్స్, పంజాగుట్ట్ట; ఐసీఐసీఐ బ్యాంక్, ఖైరతాబాద్; ఐసీఐసీఐ బ్యాంక్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్; ఐసీఐసీఐ బ్యాంక్, వినాయకనగర్, గచ్చిబౌలి; యాక్సిస్ బ్యాంక్, మెహిదీపట్నం; యాక్సిస్ బ్యాంక్, జూబ్లీహిల్స్; స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, సోమాజీగూడ; స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, రాజ్‌భవన్‌రోడ్; స్టాండర్ట్ చార్టెడ్ బ్యాంక్ ఎస్పీ రోడ్, సికింద్రాబాద్; హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హైటెక్ సిటీ; కోటక్ మహీంద్ర బ్యాంక్, హిమాయత్‌నగర్; హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గచ్చిబౌలి, లింగంపల్లి. -
యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్
దుబాయి: దుబాయిలో ఉండే ఎన్నారై జాక్‌పాట్ కొట్టేశాడు. అతని జీవితాన్నే మార్చేటంత పెద్ద మొత్తం అంటే.. దాదాపు రూ.12.71 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. కేరళకు చెందిన శ్రీరాజ్ కృష్ణన్(33) కొప్పరెంబిల్ గత తొమ్మిదేళ్లుగా దుబాయిలోని ఓ షిప్పింగ్ కంపెనీలో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అబుదబీ బిగ్ లాటరీ టికెట్ కొన్నాడు. ఆదివారం తీసిన డ్రాలో అతడు కొనుగోలు చేసిన నంబర్ 44698 టికెట్ ఏడు మిలియన్ దిర్హామ్ (సుమారు రూ.12,71,70,000)లు గెలుచుకుంది. లాటరీ కంపెనీ వాళ్లు కృష్ణన్‌కు ఫోన్ చేసి,తన నంబర్ డ్రాలో ఎంపికయిందని చెప్పేసరికి కృష్ణన్ నోటమాట రాలేదు. రోజుకొక లాటరీ టికెట్ కొనే అలవాటున్న ఇతడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డబ్బు గెలుచుకోలేదు. కాగా, ఇతని నెలవారీ వేతనం సుమారు రూ.లక్ష. కేరళలో తన సొంతింటి లోన్ కోసమే అందులో ఎక్కువ మొత్తం పంపిస్తుంటాడు. ఈయన భార్య కూడా దుబాయిలోనే ఓప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. లాటరీ దక్కినా తాము దుబాయిని విడిచి ఇప్పట్లో వెళ్లదలుచుకోలేదని అంటున్నారు. ఇంత లాటరీ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనేదానిపై ఇప్పటి వరకు తాను ఆలోచించలేదని, ఈ ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఆ విషయం ఆలోచిస్తామని కృష్ణన్ తెలిపాడు. -
లాటరీల పేర ఘరానా మోసం
పిట్లం, న్యూస్‌లైన్: అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటున్న మోసగాళ్లు వారిని మోసగిస్తూ వేల రూపాయలు దోచుకుంటున్నారు. మీ ఫోన్ నంబర్‌కు లక్షల రూపాయల లాటరీ తగిలింది. మీరు అందులో ఒక శాతం మాపేరున ఉన్న ఖాతాల్లో జమచేస్తే మీ ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేస్తాం అని ఫోన్లు చేస్తుండటంతో వారి మాటలను నమ్మిన అమాయక జనం చివరికి మోసపోతున్నారు. శుక్రవారం జుక్కల్ మండ లం మహ్మదాబాద్ గ్రామ తండాకు చెందిన పాండు జాదవ్ అనే వ్యక్తికి ముంబయి నుంచి ఓ ఫోన్ వచ్చిం ది. తనపేరు సురేంద్రలాల్ అని, పాండుజాదవ్కు ఫోన్ నంబర్‌కు రూ. 25 లక్షల లాటరీ తగిలిందని చెప్పాడు. అయితే అందులో ఒక శాతం అంటే రూ. 25 వేలు తమ ఖాతాలో (నంబర్ 33143374026) జమచేస్తే రూ. 25 లక్షలు పాండుజాదవ్ ఖాతాలో జమ చేస్తాం అని ఫోన్లో చెప్పారు. అది నమ్మిన పాండుజాదవ్ రూ. 25 వేలను తీసుకుని పిట్లం ఎస్బీ ఐ బ్రాంచ్‌కి వెళ్లాడు. అనంతరం అనుమానం వచ్చి విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో ఇందులో ఏదో మోసం ఉందని స్నేహితుడు వారించడంతో డబ్బు ఖాతాలో జమ చేయలేదు. అనంతరం మళ్లీ ముంబ యి నుంచి ఫోన్ చేసి మీ వద్ద ఎంత డబ్బు ఉంటే అంత జమ చేయాలని చెప్పారు. దీంతో జాదవ్ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ‘న్యూస్‌లైన్’ పిట్లం ఎస్బీఐ బ్యాంకులో విచారణ చేయగా గతంలో జుక్కల్ మండలం నుంచి కొందరు యువకులకు ఫోన్ రాగా వారు ఒక్కొక్కరు వేల రూపాయలు ఖాతాల్లో జమచేసి మోసపోయారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయపై పిట్లం ఎస్సై ప్రశాం త్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇటువంటి మోసాలను ప్రజలు నమ్మొద్దని, ఫోన్ వచ్చినవెంటనే పోలీ సులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరునెలల క్రితం జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన యువకులు ఇలాగే మోసపోయారని పేర్కొన్నారు.