ఆ జంటకు లాటరీ తగలడంతో వారిద్దరూ ఆ సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేస్తూ, ఎంజాయ్ చేశారు. ఇంతలో వారికి వచ్చిన ఒక ఈమెయిల్ వారి జీవితాలను దుర్భరం చేసింది. తమకు లాటరీలో £1.8 మిలియన్(18 కోట్లు) వచ్చిన విషయం, ఆ తరువాత భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తమను ఎలా విడదీసినదీ ఆ మహిళ తెలిపింది.
భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు
రోజర్, లారా గ్రిఫిథ్స్‌లు 2005లో నేషనల్ లాటరీలో జాక్‌పాట్ కొట్టారు. ఆ సొమ్ములోని కొంత మొత్తంతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఎంజాయ్ చేసేందుకు మిగిలిన మొత్తం ఖర్చు చేశారు. దీంతో వెనక్కి తిరిగిచూసుకుంటే తమ దగ్గర అస్సలు డబ్బులు మిగలలేదని లారా తెలిపింది. చాలామంది మాదిరిగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
దుబాయ్‌లో ఎంజాయ్
లాటరీ సొమ్ము అందిన కొన్ని వారాలకు రోజర్£18,000తో సాఫ్ట్-టాప్ ఆడీ కొనుగోలు చేశాడు. లారా తాము దుబాయ్‌లో ఎంజాయ్ చేసేందుకు, బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రోజర్ మాట్లాడుతూ తాము 10 రోజుల్లో £15,000 ఖర్చు చేశామని తెలిపారు. ఆమెకు హ్యాండ్ బ్యాగ్‌లన్నా, షాపింగ్‌అన్నా ఇష్టమని అన్నారు.
దంతాలను తెల్లగా మార్చుకునేందుకు..
డైలీస్టార్ తెలిపిన వివరాల ప్రకారం రోజర్ తన దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖర్చు చేశాడు. కూల్‌గా కనిపించేందుకు డిజైనర్ దుస్తులు కొనుగోలు చేశారు. బొటెక్స్ కోసం ఒకసారి £300 ఖర్చు చేశాడు. టాటూల కోసం £500కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. లాటరీ గెలుచుకున్న ఎనిమిదేళ్ల తరువాత అంటే 2013 నాటికల్లా వారి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. వారి అనుబంధం కూడా ముగిసింది.
రోజూ విలాసవంతమైన పార్టీలు
14 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. తమ ఆర్థిక దుస్థితికి కారణం నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపించుకున్నారు. లారా మాట్లాడుతూ లాటరీ గెలుచుకున్న తరుణంలో తమ మధ్య వివాదాలు లేవన్నారు. తాము రోజూ పార్టీలు చేసుకునేవారమన్నారు. ఆనందంగా కాలం గడిపామన్నారు. అయితే డబ్బును ఎలా కాపాడుకోవాలో తమకు తెలియలేదన్నారు.
బూడిదైన భవనం.. భారీగా నష్టం
తాము లాటరీ సొమ్ములోని £670,000తో నార్త్ యార్క్‌షైర్‌లో కొనుగోలు చేసిన భవనం 2010లో కాలి బూడిదయ్యిందన్నారు. తాము ఆ ఇంటికి తక్కువ మొత్తానికే బీమా చేయించామన్నారు. ఆ సొమ్ము వచ్చినప్పుడు తన భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తాను చూశానని లారా తెలిపింది. దానిలో భర్త అతని స్నేహితుడిని మరో యువతి ఫోన్ నంబర్ అడిగినట్లు ఉందన్నారు. అదే తమ జీవితాలను దుర్భరం చేసిందన్నారు. తాను తన భర్త అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణను గమనించానని లారా పేర్కొన్నారు. తన భర్త ఒక యువతి ఫోన్ నంబర్ అడిగిప్పుడు అతని స్నేహితుడు ఆమెతో ఎంజాయ్ చేసేందుకు భర్తకు సలహాలు ఇచ్చాడని లారా తెలిపింది.
దూరమైన భర్త
దీనిని తాను గమనించానని తెలిసినా తన భర్త తనను క్షమాపణలు కోరలేదని, పైగా అతని బ్యాగు సద్దుకుని, తనపై అరుస్తూ, తనను నిందిస్తూ వెళ్లిపోయాడని లారా తెలిపింది. తరువాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని, ఫేస్‌బుక్‌లో అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా తనను బ్లాక్‌చేశాడని లారా తెలిపింది. వారం రోజుల పాటు అతనిని ద్వేషించానని, ఆ తరువాత అతనిని మనసులోనే క్షమించేశానని, ఎందుంటే అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని లారా పేర్కొంది.
ఇది కూడా చదవండి:‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment