దుబాయి: దుబాయిలో ఉండే ఎన్నారై జాక్‌పాట్ కొట్టేశాడు. అతని జీవితాన్నే మార్చేటంత పెద్ద మొత్తం అంటే.. దాదాపు రూ.12.71 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. కేరళకు చెందిన శ్రీరాజ్ కృష్ణన్(33) కొప్పరెంబిల్ గత తొమ్మిదేళ్లుగా దుబాయిలోని ఓ షిప్పింగ్ కంపెనీలో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అబుదబీ బిగ్ లాటరీ టికెట్ కొన్నాడు. ఆదివారం తీసిన డ్రాలో అతడు కొనుగోలు చేసిన నంబర్ 44698 టికెట్ ఏడు మిలియన్ దిర్హామ్ (సుమారు రూ.12,71,70,000)లు గెలుచుకుంది. లాటరీ కంపెనీ వాళ్లు కృష్ణన్‌కు ఫోన్ చేసి,తన నంబర్ డ్రాలో ఎంపికయిందని చెప్పేసరికి కృష్ణన్ నోటమాట రాలేదు.
రోజుకొక లాటరీ టికెట్ కొనే అలవాటున్న ఇతడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డబ్బు గెలుచుకోలేదు. కాగా, ఇతని నెలవారీ వేతనం సుమారు రూ.లక్ష. కేరళలో తన సొంతింటి లోన్ కోసమే అందులో ఎక్కువ మొత్తం పంపిస్తుంటాడు. ఈయన భార్య కూడా దుబాయిలోనే ఓప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. లాటరీ దక్కినా తాము దుబాయిని విడిచి ఇప్పట్లో వెళ్లదలుచుకోలేదని అంటున్నారు. ఇంత లాటరీ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనేదానిపై ఇప్పటి వరకు తాను ఆలోచించలేదని, ఈ ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఆ విషయం ఆలోచిస్తామని కృష్ణన్ తెలిపాడు.
యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్
Published Mon, Mar 6 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
Advertisement