
దుబాయ్: పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వచ్చి చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరుడ్ని చేసింది. సోమవారం ఈ లాటరీ సంస్థ విజేతలను ప్రకటించింది. కేరళకు చెందిన ధనీష్ అనే 25 ఏళ్ల యువకుడు లాటరీలో ఒక మిలియన్ డాలర్ల(అంటే రూ.6,49,25,000/-)ను గెలుచుకున్నారు.
ఆయనతో పాటు జోర్దాన్ దేశానికి చెందిన వ్యక్తి కూడా ఈ లాటరీలో విజేతగా నిలిచారు. ఆయన కూడా ఒక మిలియన్ డాలర్ల నగదు పొందనున్నారు. దుబాయ్‌లో ఏడాదిన్నర కాలం ఎలక్ట్రీషన్‌గా పని చేసిన ధనీష్.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ టిక్కెట్టును మొదటిసారిగా కొన్నట్లు ధనీష్ తెలిపారు. లాటరీ సిరీస్ 266లో 4255 టిక్కెట్టు నంబర్‌పై అయన విజేతగా నిలిచారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన సదరు లాటరీ సంస్థను నుంచి తాను గెలిచినట్లు ఫోన్ వచ్చిందని చెప్పారు.