raffle bonanza
-
నిజామాబాద్ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తికి నిరాశే మిగిలినప్పటికీ.. లాటరీ టికెట్ మాత్రం అతని జీవితాన్నే మార్చివేసింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కాల, పద్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే విలాస్ 45 రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ ఉద్యోగం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చేశాడు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన విలాస్.. రెండేళ్లుగా అక్కడి ప్రముఖ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న అతడు... లాటరీ టికెటు కొనుగోలు చేసే అలవాటును మానుకోలేకపోయాడు. తన చేతులో డబ్బులు లేకపోవడంతో భార్య పద్మ దగ్గరి నుంచి రూ. 20వేలు తీసుకుని.. లాటరీ టికెట్లు కొనుగోలు చేయాల్సిందిగా దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడు రవికి చెప్పాడు. దీంతో విలాస్ పేరు మీద రవి మూడు టికెట్లు కొనుగోలు చేశాడు. ఇక్కడే కీలక పరిణామం చోటుచేసుకుంది. అందులోని ఓ టికెటు.. విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతను భారీ లాటరీ గెలుపొందినట్టు విలాస్‌కు ఫోన్ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లాటరీలో విలాస్ ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు(రూ. 28.4 కోట్లు) సొంతం చేసుకున్నాడు. విలాస్ మాత్రం ఈ సంతోష క్షణాలకు తన భార్యే కారణమని చెప్పాడు. కాగా, విలాస్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు హిమానీ ఇంటర్మీడియట్, చిన్న కూతురు మనస్విని 8వ తగరతి చుదువుతున్నారు. ఈ మేరకు గల్ఫ్ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. -
లాటరీల్లో భారతీయులను వరిస్తున్న అదృష్టం
దుబాయి: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన భారతీయులకు ఈ మధ్య లాటరీలు బాగానే తగులుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన డ్రైవర్ జాన్ వర్గీస్ ఓ లాటరీలో రూ.80 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. తాజాగా మరో భారతీయుడికి (4 మిలియన్ అమెరికా డాలర్ల) రూ.27.7 కోట్ల విలువైన లాటరీ తగిలింది. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేసిన అబుదాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ సిరీస్ డ్రాలో షార్జాలో నివసిస్తున్న భారతీయుడు షోజిత్ కేఎస్ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. షోజిత్ గతనెల 1వ తేదీన ఆన్లైన్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే లాటరీ తగిలిన విషయం షోజిత్‌కు తెలియక నిర్వాహకులను సంప్రదించనే లేదట. దీంతో నిర్వాహకులే స్వయంగా షోజిత్ ఇంటికి వెళ్లి, లాటరీ మొత్తాన్ని అందజేశారు. ఇక ఇదే లాటరీ లక్కీ డ్రాలో బహిష్కృత భారతీయుడు మంగేశ్ మైందె బీఎండబ్ల్యూ కారును దక్కించుకున్నాడు. మరో ఎనిమిదిమంది భారతీయులతోపాటు ఒక పాక్ పౌరుడు కూడా ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. -
లాటరీ టికెట్.. కోటీశ్వరులైన స్నేహితులు
సాక్షి, దుబాయ్ : కేరళలోని త్రిస్సూర్‌కి చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులను అదృష్టం వరించింది. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో పెరిగి, ఒకే స్కూల్లో విద్యనభ్యసించిన ఫ్రాన్సిస్ సెబాస్టియన్, పింటో పాల్ తొమ్మాన తలరాతను ఓ లాటరీ టికెట్ మార్చేసింది. చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వీరిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరులని చేసింది. సెబాస్టియన్, తొమ్మాన ఇద్దరు కలిసి గత నెలలో టికెట్ కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 2465 లక్కీ డ్రాలో 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.ఆరున్నర కోట్లు) నగదు బహుమతికి ఎంపికైంది. తొమ్మాన షార్జాలో మెకానిక్‌గా పని చేస్తుంటే, అతని భార్య ధన్య దెవాసి స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తొమ్మాన 12 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటున్నారు. సెబాస్టియన్ అరేబియన్ ఆటోమొబైల్స్‌లో పని చేస్తున్నారు. ఇద్దరు ప్రాణస్నేహితులకు లక్కి లాటరీ తగలడం, అదే రోజు(ఏప్రిల్ 10) సెబాస్టియన్ భార్య లియోనీ ఫ్రాన్సిస్ పుట్టిన రోజు కూడా కావడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండాపోయింది. -
అదృష్టం అంటే ఈయనదే, ఒక్క టిక్కెట్టుతో..
దుబాయ్: పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వచ్చి చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరుడ్ని చేసింది. సోమవారం ఈ లాటరీ సంస్థ విజేతలను ప్రకటించింది. కేరళకు చెందిన ధనీష్ అనే 25 ఏళ్ల యువకుడు లాటరీలో ఒక మిలియన్ డాలర్ల(అంటే రూ.6,49,25,000/-)ను గెలుచుకున్నారు. ఆయనతో పాటు జోర్దాన్ దేశానికి చెందిన వ్యక్తి కూడా ఈ లాటరీలో విజేతగా నిలిచారు. ఆయన కూడా ఒక మిలియన్ డాలర్ల నగదు పొందనున్నారు. దుబాయ్‌లో ఏడాదిన్నర కాలం ఎలక్ట్రీషన్‌గా పని చేసిన ధనీష్.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ టిక్కెట్టును మొదటిసారిగా కొన్నట్లు ధనీష్ తెలిపారు. లాటరీ సిరీస్ 266లో 4255 టిక్కెట్టు నంబర్‌పై అయన విజేతగా నిలిచారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన సదరు లాటరీ సంస్థను నుంచి తాను గెలిచినట్లు ఫోన్ వచ్చిందని చెప్పారు. -
లక్కీ డ్రాలో.. భారతీయులకు జాక్‌పాట్
దుబాయి: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్‌పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. కేరళకు చెందిన థాన్సిలాస్ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్లు (దాదాపు 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత నెలలో రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టికెట్ నెంబర్ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, బెహ్రెయిన్ కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతలు వీరే.. -
కోట్ల లాటరీ.. భారతీయురాలి పంటపండింది
దుబాయి: అబుదాబిలో ఓ భారతీయురాలి పంటపండింది. ఎంతోమంది ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న మిలయనీర్ బంపర్ లాటరీలో భారీ మొత్తం ఆమె సొంతమైంది. ఏకంగా రూ.17,69,03,813.39 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రాఫెల్ బోనాంజా లాటరీ ఆమెను వరించింది. దాదాపు 50 ప్రయత్నాల తర్వాత ఈ అదృష్టం కలిసొచ్చింది. నిషితా రాధాకృష్ణ పిళ్లై అనే మహిళ అబుదాబిలో రెండేళ్లపాటు ఆమె భర్తతో కలిసి మెడికల్ ప్రాక్టీస్ చేసింది. ఆమె భర్త ఇప్పటికే 50సార్లు రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. దాదాపు 50సార్లు టికెట్ కొన్న ఆయన తన భార్య నిషితా పేరిట 058390 నెంబర్‌గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో ఈ నెంబర్‌కే ఆ లాటరీ తగిలింది. దీంతో నిషితా, ఆమె భర్త సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన రాధా ప్రస్తుతం టెక్సాస్‌లో భర్తతో కలిసి ఉంటోంది. గత ఏడాది(2016) జూలై నెలలో టెక్సాస్‌లో జెనెటిక్స్ విభాగంలో ఫెలోషిప్ ప్రోగ్రాం పూర్తి చేసేందుకు వెళ్లింది. అక్కడికి వెళ్లినా వారి లాటరీ ప్రయత్నాలు ఆపకపోవడంతోనే ఈ అదృష్టం దక్కింది. ఇలా రాఫెల్ బోనాంజా ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బు లాటరీ రూపంలో తీసుకెళ్లనున్న రెండో వ్యక్తి ఈమె కానున్నారు.