uttara
-
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
కొందర్ని నమ్మి మోసపోయాం
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. రవికుమార్ మాదారపు సమర్పణలో శ్రీపతి గంగదాస్, తిరుపతి యస్.ఆర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి యస్.ఆర్ మాట్లాడుతూ–‘‘ఉత్తర’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. కానీ, థియేటర్స్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇందులో మా తప్పులూ లేకపోలేదు. సినిమా రిలీజ్, ప్రచార విషయాల్లో కొందర్ని నమ్మి మోసపోయాం. పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ థియేటర్స్ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో కొందరి నిజస్వరూపాలు తెలిశాయి. మంచి సినిమాలను బతికించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు బాగాలేదనలేదు. మా సినిమాను ఇండస్ట్రీ పెద్దలు చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీరామ్. -
మహిళలకు అంకితం
నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. రవికుమార్ మాదారపు సమర్పణలో తిరుపతి యస్.ఆర్, శ్రీపతి గంగదాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. తిరుపతి యస్.ఆర్ మాట్లాడుతూ– ‘‘ఉత్తర’ అంటే ఒక అమ్మాయి. హీరోయిన్ పాత్ర కాదు. ‘ఉత్తర’ అనే అమ్మాయి కథను వెండితెరపై ప్రేక్షకులు తెలుసుకోవాలి. సహజమైన తెలంగాణ మాటలు, మనుషులను తెర మీదకు తీసుకువచ్చాం. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో మహిళల రక్షణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాం. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. మహిళలకు వంద శాతం నచ్చే చిత్రమిది. అందుకే వారికి అంకితం ఇస్తున్నాం. ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాను. అయినా ధైర్యంగా ముందుకు వెళ్లాం’’ అని అన్నారు. -
లంకెబిందెల కోసం...
శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. శ్రీపతి గంగదాస్, తిరుపతి యస్.ఆర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ – ‘‘నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. నటనపై ఆసక్తితో హీరో కావాలని ప్రయత్నిస్తున్న నాకు ‘ఉత్తర’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. తన కూతురు ఒకరిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఓ తండ్రి కోపం తెచ్చుకోకుండా, తన కూతురి ప్రేమలోని తప్పు ఒప్పులను ఎలా చెప్పాడు? ఖాళీగా ఉన్న తన ప్రేమికుడిని ఓ అమ్మాయి ఎలా మార్చింది? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటాయి. సులభంగా ధనవంతులు కావడానికి యువత లంకెబిందెల కోసం చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. నాతో పోల్చుకున్నప్పుడు హీరోయిన్ కారుణ్యకు నటనాపరంగా అనుభవం ఉంది. ఆమెతో డ్యాన్స్ విషయంలో టెన్షన్ ఫీలయ్యాను కానీ యాక్టింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. సినిమాని దర్శకుడు చాలా సహజంగా ఈ సినిమాను తెరకెక్కించాడు’’ అన్నారు. -
ప్రతి ఊరిలో ఓ ఉత్తర ఉంటుంది
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్. ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉత్తర’. తిరుపతి, శ్రీపతి గంగదాస్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా కారుణ్య మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే. చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం. మా అమ్మగారి సపోర్ట్‌తో సినిమాలు చేస్తున్నాను. ‘పెళ్లి పుస్తకం (2013)’, ‘దానవీరశూర కర్ణ’ (2015) చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. ‘ఆట 5’, ‘రాములమ్మ’ సీరియల్ మంచి టర్నింగ్ పాయింట్ . నా నటనకు నంది అవార్డు వచ్చింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగారి చేతుల మీదగా మల్టీటాలెంటెడ్‌గా జాతీయ అవార్డు అందుకున్నాను. కథానాయికగా ‘బంగారి బాలరాజు’ నా తొలి చిత్రం. ‘ఉత్తర’ నా రెండో చిత్రం. ఇందులో నా పాత్ర పేరు స్వాతి. అందమైన అమ్మాయిలకు పొగరు ఉంటే తప్పుకాదని నమ్మే వ్యక్తిత్వం స్వాతిది. ప్రతి ఊరిలోనూ ఉత్తరలాంటి వారు ఒకరుంటారు. నేను టైటిల్ రోల్ చేయలేదు. ప్రస్తుతం ‘ఇట్లు శ్రీమతి’తో పాటు మరో తెలుగు సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
వెంటాడే ఫీల్‌తో..
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్తర’. లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై తిరుపతి ఎస్.ఆర్. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సురేశ్ బొబ్బిలి సంగీతం అంటే చాలా ఇష్టం. సినిమా కథలోని ఆత్మను తన సంగీతంతో పలికించే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు. ‘‘ట్రైలర్ కొత్త ఫీల్‌ని కలిగించింది. ప్రతిభ ఉన్నవాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ సినిమాలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన దర్శకునికి రుణపడి ఉంటాను. సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరూ ఆదరిస్తారు. అలాంటి మంచి సినిమానే మేం చేశాం’’ అన్నారు శ్రీరామ్. తిరుపతి మాట్లాడుతూ– ‘‘సహజమైన పాత్రలతో సినిమా ఉంటుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు ఆ ఫీల్ ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు. నిర్మాత శ్రీపతి గంగదాస్ మాట్లాడుతూ – ‘‘తిరుపతి సినిమాను బాగా తీశారు. అనుకున్నట్లుగానే సినిమా బాగా రావడానికి కారణం టీమ్’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య. -
ఉత్తర ట్రైలర్ లాంచ్
లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ లో నన్ను ఎక్కువుగా ఆకర్షించింది మ్యూజిక్. సురేష్ బొబ్బిలి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే లుక్ అండ్ ఫీల్ చాలా ప్రెష్ గా ఉన్నాయి. తెలంగాణా యాస తెరపై గమ్మత్తును చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయం తో పాటు రెస్సెక్ట్ వస్తుందని నమ్ముతున్నాను ’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బ్యాక్ డ్రాప్ బాగుంది. కొత్త ఫీల్ కలిగింది. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది’ అన్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఏ సినిమాలో అయినా కొత్తదనం ఉంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఆదరణ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొత్తదనం నిండిన సినిమాలను ప్రొత్సహించిన వారే. మా సినిమా కూడా అలాంటి కొత్తదనం తోనే వస్తుంది. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన దర్శకుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ టీం అందరూ నన్ను బాగా ఎంకేరేజ్ చేసారు. అలాగే కారుణ్య నటన ప్రత్యేకంగా చెప్పుకుంటారు’ అన్నారు. దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రలు చాలా సహాజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుతుంది. ఉత్తర సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ కారుణ్య, శ్రీరామ్‌ల పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఈ ట్రైలర్ లాంచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు’ అన్నారు. -
అళగే.. అళగే...
జోల పాడించుకునే వయసులో తన పాటతో పన్నీటి జల్లు చిలకరించింది. ‘అళగే అళగే’ అంటూ కర్ణాటక సంగీత స్వరాలతో సృష్టిలోని అందాలను తన లేలేత గాత్రంలో ఒలికించింది. పేరు ఉత్తర. ప్రముఖ నేపథ్య గాయకుడు ఉన్ని కృష్ణన్ కుమార్తె. చెన్నైలోని కేసరి కుటీర వ్యవస్థాపకులు డా. కె.ఎన్ కేసరిగారి ముని ముని మనవరాలు. ఇటీవలే ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ తండ్రీ కూతుళ్ల ముచ్చట్లను ఫ్యామిలీ మీకు అందిస్తోంది... అళగే అళగే పాటకు అర్థం అందమనేది ఎందులోనైనా ఉంటుంది... అన్నిటిలోనూ ఉంటుంది. ప్రేమ అనే కాంతిలో అంతా అందమే. వర్షం మాత్రమే అందంగా ఉంటుందా... నిప్పులు చెరిగే సూర్యుడు కూడా అందంగానే ఉంటాడు. పూలు మాత్రమే అందంగా ఉంటాయా... నేలకు రాలే ఆకులు కూడా అందంగా ఉంటాయి... చిరునవ్వును చూడటంలోన అందం ఉంటుంది. మాటల తరువాత ఉండే మౌనం అందంగా ఉంటుంది. మంచి కోసం చెప్పే అబద్ధం అందంగా ఉంటుంది. సత్యమనేది మరీ అందంగా ఉంటుంది. కోయిల పాడితే... అదొక అందమైన పక్షి పాట. ఆ పాటకు స్వరాలు అవసరమా... నెమలి నాట్యానికి జతులు అవసరమా... సముద్రాన్ని చేరే నదికి తోడు అవసరమా... అలల ధ్వనికి భాష, వ్యాకరణం అవసరమా... .... అంటూ సాగుతుంది ఈ పాట. ఉత్తర: నేను ఐదో తరగతి చదువుతున్నాను. ఓరోజు మా అమ్మ ప్రియతో కలిసి, సైంధవి ఆంటీ వాళ్ల ఇంటికి బొమ్మల కొలువుకి వె ళ్లాను. అక్కడ ఏదో చిన్న పాట పాడాను. ఆ తరవాత రెండు నెలలకి ప్రకాశ్అంకుల్ (జి.వి.ప్రకాశ్ ప్రముఖ సంగీత దర్శకులు) నన్ను పిలిచి, పాట పాడతావా అని అడిగారు. నేను సరేనని తల వూపాను. స్టూడియోకి తీసుకువెళ్లి అక్కడ నాచేత పాట పాడించారు. అది ‘శైవమ్’ సినిమా కోసమని చెప్పారు. ఆ తరవాత ఇప్పటి వరకు ఐదు పాటలు పాడాను. ఈ సినిమాని తెలుగులోకి తీస్తున్నారు. అందులో కూడా నేనే పాడాను. ఉన్ని: ఉత్తర చేత ‘శైవమ్’లో ఒక సోలో పాట పాడించారు. ఆ పాటకు సినిమాలో ‘సారా అర్జున్’ అనే అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి వయసుకు తగ్గట్టుగా గాత్రం ఉండాలని ఉత్తరను ఎంపిక చేశారు. ఆ పాట రికార్డింగ్ నాటికి ఉత్తర వయసు ఎనిమిది సంవత్సరాలు. ఉత్తర: అన్నయ్య కీబోర్డు మీద వాయిస్తూ నాకు పాటలు నేర్పిస్తాడు. అందువల్ల చాలా తేలికగా నేర్చుకోగలుగుతున్నాను. ఉన్ని: ఉత్తర చిన్నప్పటి నుంచి సరదాగా హమ్ చేస్తుండేది. అలా పాడటం గమనించి, అమ్మాయికి సంగీతం నేర్పించడం ప్రారంభించాను. ఉత్తర ఇంతవరకు ఎక్కడా సంగీత కచేరీలు చేయలేదు. ‘శైవమ్’ సినిమాతోనే పాడటం ప్రారంభించింది. మా అబ్బాయి వాసుదేవ్ కీ బోర్డు వాయిస్తాడు. వాడు ప్లస్ టూ చదువుతున్నాడు. ఉత్తర: నా ఎనిమిదో ఏట సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను. నా మొదటి గురువు సుధా రాజా. కర్ణాటక సంగీతమే కాకుండా పాశ్చాత్య సంగీతం కూడా వింటాను. మా అమ్మ ప్రియ ఉన్నికృష్ణన్ భరతనాట్యం డ్యాన్సర్. నాకు డ్యాన్స్ కన్నా సంగీతం ఎక్కువ ఇష్టం. ఉన్ని: ముత్తుకుమార్ రచించిన ‘అళగే’ పాటను జి.వి.ప్రకాశ్‌కుమార్ దర్బారీ కానడ రాగంలో స్వరపరిచారు. ఒక చిన్న పాప తన పరిసరాలలోని అన్ని వస్తువులలోనూ అందాన్ని ఏ విధంగా చూస్తుందో ఇందులో వివరించారు రచయిత. చాలా అందంగా ఉంటుంది ఈ పాట. ఈ పాటలో ‘సారా అర్జున్’ ఎంతో అందంగా నటించింది. ఉత్తర: నేను ఏవి ఆండాళ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదువుతున్నాను. మా స్కూల్లో టీచర్లందరూ నన్ను ప్రశంసించారు. మా ఫ్రెండ్స్ కూడా నేను చాలా బాగా పాడానని మెచ్చుకున్నారు. బాలు అంకుల్ వాళ్లు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నాకు ఈ పాట బాగా నచ్చింది. పాట కొంచెం కష్టంగా అనిపించినా తొందరగానే నేర్చుకున్నాను. ఉన్ని: కర్ణాటక సంగీతం నేర్చుకుంటూండడం వల్ల అమ్మాయి తేలికగానే నేర్చుకోగలిగింది. తండ్రిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందునా తండ్రీకూతుళ్లకి జాతీయ అవార్డు రావడం చాలా అరుదు. అసలు ఈ అవార్డు వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అవార్డు వచ్చిందని వినగానే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. అంతా భగవంతుడి దయ. మన అంచనాల ప్రకారం ఏదీ జరగదు. మన ఊహలకు అందకుండానే జరుగుతుంది ఏదైనా. ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు ఉన్నా, ప్రత్యేకంగా మా బంగారుతల్లికి రావడం ఒక తండ్రిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనం చాలా తక్కువ ఆశించినప్పుడు పెద్ద ఫలితం వస్తే ఆ ఆనందం వర్ణించడం ఎవరి తరమూ కాదు. ‘అళగే అళగే’ పాటలో పిల్లలు ప్రకృతిని ఎంత అందంగా చూస్తారో వివరించారు రచయిత. వేడి సూర్యుడిలో కూడా అందం ఉంది... అంటూ ఉంటుంది ఈ పాట. చాలా అందమైన సాహిత్యం. అమ్మాయి కూడా బాగా పాడింది. త్రివేణీ సంగమం అందమైన సాహిత్యం, అందమైన సంగీతం, అందమైన స్వరజ్ఞానం. ఇవన్నీ కుదిరితే ఆ పాట అంతకుమించి అందంగా బయటకు వస్తుంది. ‘అళ గే అళగే’ గీతం అటువంటిదే. తన పదవ యేట పాడిన మొట్టమొదటి పాటకు ప్రభుత్వం 2015లో ప్రకటించిన 62వ జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపికయ్యింది ఉత్తర. 2014లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన శైవమ్ సినిమాలో ఈ పాట పాడింది. ‘శైవమ్’ సినిమా కోసం ముత్తు కుమార్ పేర్చిన అక్షరాలకు, జి.వి.ప్రకాశ్ స్వర గంధం అద్దారు. ఉత్తర ఉన్నికృష్ణన్ స్వర పరిమళం జోడించారు. ఇలా త్రివేణీ సంగమంతో ఈ గీతం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై