తిరుమలలో తెలుగు హీరో సతీమణి.. హీరోయిన్‌లా ఉందంటూ కాంప్లీమెంట్స్‌ | Tollywood Actor Wife Visit Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తెలుగు హీరో సతీమణి.. హీరోయిన్‌లా ఉందంటూ కాంప్లీమెంట్స్‌

Published Thu, Apr 4 2024 1:14 PM | Last Updated on Thu, Apr 4 2024 2:09 PM

Tollywood Actor Wife Visit Tirumala - Sakshi

రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. వాస్తవంగా ఆయన పేరు శ్రీకాంత్‌.. అప్పటికే టాలీవుడ్‌లో ఆ పేరుతో స్టార్‌ హీరో ఇక్కడ ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరకు పరిచయం అయ్యాడు. తమిళ్‌లో మొదట 'రోజా కూటం' అనే పేరుతో వచ్చిన ఈ సినిమా 'రోజా పూలు'గా తెలుగులోకి వచ్చింది. అందులో భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. వాస్తవంగా శ్రీరామ్‌ తెలుగువాడు కానీ ఆయన కోలీవుడ్‌లో స్థిరపడ్డారు.

శ్రీరామ్‌ తాజాగా తిరుమలకు వచ్చారు. ఆయన సతీమణితో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీరామ్ వివాహం 2008లో వందనతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆహిల్ వయసు 15 ఏళ్లు కాగా, కూతురు అహానా వయసు 13 ఏళ్లు.. శ్రీరామ్ తండ్రి చిత్తూరుకి చెందినవారు కాగా.. తల్లి స్వస్థలం తమిళనాడులోని కుంభకోణం. ఆయన ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. కొన్నేళ్ల తర్వాత తాము మళ్లీ తిరుమలకు వచ్చామంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను వందన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  దీంతో వందనను హీరోయిన్‌లా ఉన్నారంటూ నెటిజన్లు కాంప్లీమెంట్స్‌ ఇస్తున్నారు. 

ఒక షోలో శ్రీరామ్ తన భార్య వందన గురించి చెప్పుకొచ్చాడు. మీ భార్య మీకన్నా అందంగా ఉంటుంది కదా.. మీకెప్పుడైనా అసూయగా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు శ్రీరామ్ మాట్లాడుతూ.. అలా ఏం లేదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు.. అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు కదా అని చెప్పుకొచ్చాడు. శ్రీరామ్‌ సినిమా విషయాలకొస్తే.. ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement