టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్‌లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు సమాచారం.
2023లో బాగా భయపెట్టిన చిత్రంగా పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు. మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అన్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment