
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మెదీ అనుకున్న సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేరని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం శ్రీరాముడు కోరుకున్నప్పుడు వస్తుందని.. మోదీ అనుకున్నపుడు రాదని ఆయన చెప్పారు.
‘శ్రీరాముడిని బీజేపీ నేతలు, నరేంద్ర మోదీ నమ్ముకున్నారు.. అయితే రాముడు మాత్రం వారిని నమ్మడం లేదు’ అని సిబల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్నిన్యాయవ్యవస్థ కూడా నిరూపించింది అని ఆయన చెప్పారు. దేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత అయోధ్య-బాబ్రీ వివాదాన్ని విచారించాలన్న కపిల్ సిబల్ వాదనతో కోర్టు ఏకీభవించిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాయిదా వేయాలని సిబల్ కోరినా.. కోర్టు మాత్రం విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న వరకూ వాయిదా వేసింది.