
మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్‌మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం.
ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు.