రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ హయాంలో ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం ఉదయం హైకోర్టులో ఏజీగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు.