స్మృతి ఇరానీని ప్రశంసిస్తూ అరుణ్‌ గోవిల్‌ ఏమన్నారు? | Ramayan Ram Arun Govil Say In Praise Of Union Minister Smriti Irani, Details Inside - Sakshi
Sakshi News home page

Uttar Pradesh: స్మృతి ఇరానీని ప్రశంసిస్తూ అరుణ్‌ గోవిల్‌ ఏమన్నారు?

Published Mon, Apr 8 2024 7:27 AM | Last Updated on Mon, Apr 8 2024 9:59 AM

Ramayan Ram Arun Govil Say in Praise of Union Minister Smriti Irani - Sakshi

రామాయణం సీరియల్‌లో రాముని పాత్రలో నటించి జనాదారణ పొందిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నని అరుణ్‌ గోవిల్‌ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రశంసించారు. ఆమెను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఆమె  మంచి వక్తగా రాణిస్తున్నారని అన్నారు. 

మీరట్‌లో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన సునీతా వర్మ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి దేవవ్రత్ త్యాగి (బీఎస్పీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఏప్రిల్ 26న మీరట్‌లో రెండో దశలో లోక్‌సభ ఓటింగ్ జరగనుంది. మీరట్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని రెండుసార్లు మార్చింది. ముందుగా భాను ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది. తరువాత అతుల్ ప్రధాన్‌ను  ఎంపిక చేసినట్లు ప్రకటించింది. చివరిగా సునీతా వర్మకు టికెట్ కన్ఫర్మ్‌ చేసింది. 
 

అరుణ్ గోవిల్ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముని పాత్రను పోషించారు. ఈ  సీరియల్ తర్వాత, అరుణ్ గోవిల్ ప్రేక్షకాదరణ పొందారు. ముగ్గురు దిగ్గజ నేతలు బరిలోకి దిగిన మీరట్ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. 

ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య. సునీతా వర్మ 2017లో బీఎస్పీ నుంచి మీరట్ మేయర్‌గా  ఎన్నికయ్యారు. త్యాగి వర్గం నుండి వచ్చిన దేవవ్రత్ త్యాగిని బిఎస్పీ తన అభ్యర్థిగా ఎన్నిక చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement