
కుమార్తెతో నటి రాశీ
ఏలూరు : ద్వారకాతిరుమల చినవెంకన్నను సంక్రాంతి పర్వదినం రోజున సినీనటి రాశి దర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలుచేశారు. అంతకుముందు జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామిని సినీ నటి రాశి కుమార్తెతో సహా వచ్చి దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో రాశి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ సిబ్బంది స్వామి చిత్రపటాన్ని ప్రసాదాలకు అందజేశారు. రాశి మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.