లండన్: భర్త దేశ ఆర్థిక మంత్రిగా ఉండి భార్యే పన్నులు చెల్లించట్లేదనే ఆరోపణలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్రిటన్‌లోనూ ఇకపై పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి స్పష్టంచేశారు. వాస్తవానికి ఆమెకు బ్రిటన్ పౌరసత్వంలేదు. బ్రిటన్ పౌరసత్వం లేనందున విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులను బ్రిటన్‌లో చెల్లించాల్సిన పనిలేదు. ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో అక్షతకు 0.9 శాతం వాటా ఉంది.
వేర్వేరు సంస్థల్లో పెట్టుబడులతో రూ.కోట్ల మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, స్వయంగా ఆర్థిక మంత్రి భార్యే పన్నులు చెల్లించట్లేదని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంపై అక్షత స్పందించారు. ‘బ్రిటన్‌లో వ్యాపారంపై వచ్చే ఆదాయానికి పన్నులను బ్రిటన్‌లో కడుతున్నాను. ఇక అంతర్జాతీయ ఆదాయంపై అంతర్జాతీయ పన్నునూ చెల్లిస్తున్నాను. భారత్‌సహా ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్నులను ఇకపై బ్రిటన్‌లో చెల్లించడం ప్రారంభిస్తా’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment