బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ భార్, భారతీయ ఐటీ వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా నష్టపోయారు. ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం (ఏప్రిల్ 17) 9.4 శాతం పడిపోయాయి. ఫలితంగా అక్షతా మూర్తి సుమారు రూ. 500 కోట్లు నష్టపోయారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 2020 తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల అత్యంత భారీ పతనం ఇదే. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తికి 0.94 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ ఇప్పటికీ రూ. 4,586 కోట్లకు పైమాటే. ఆమె షేర్లపై లక్షలాది డివిడెండ్‌లను సంపాదించారు. ఆమె ఎన్నారై కావడంతో తన ఆదాయంలో ఎక్కువ భాగంపై పన్నులు చెల్లించలేదు. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌లో పన్నులు చెల్లిస్తానని చెప్పడంతో ఏప్రిల్‌లో వివాదానికి తెరపడింది.
విలాసవంతమైన జీవనాన్ని గడిపే రుషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు లండన్‌లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఇల్లు ఉంది. అమెరికాలో ఓ ఫ్లాట్ ఉంది. వారు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 4 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.3.3 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment