
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
విన్ను మద్దిపాటి, అక్షత జంటగా రూపొందిన చిత్రం ‘శేఖరంగారి అబ్బాయి’. అక్షత కథానాయికగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ ఆవిష్కరించారు. అక్షత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఇది.
వైవిధ్యమైన కథనం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఇటీవల మోహన్‌బాబుగారు లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి యెలేందర్, కెమెరా: రాఘవ.