లుక్ మార్చేసిన టాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా ముఖానికి రక్తంతో | Apsara Rani Racharikam Movie Special Poster And Details | Sakshi
Sakshi News home page

నోట్లో కత్తి.. ముఖానికి నెత్తురు.. ఈ బ్యూటీ ఇలా మారిపోయిందేంటి?

Jan 12 2024 9:19 PM | Updated on Jan 12 2024 9:25 PM

Apsara Rani Racharikam Movie Special Poster And Details - Sakshi

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బోలెడంత మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా కొన్నేళ్ల ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ బ్యూటీని పరిచయం చేశాడు. ఆమె పేరే అప్సర రాణి. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో నటించిన ఈమె.. బోల్డ్, హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచింది. వరసపెట్టి అలాంటి సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చింది.

(ఇదీ చదవండి: ఆ గుడిలో స్పెషల్ పూజలు చేసిన హీరో ప్రభాస్.. ఎందుకో తెలుసా?)

అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాచరికం'. విజయ్ శంకర్ హీరోగా చేస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‪‌పై ఈశ్వర్ నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే శుక్రవారం, అప్సరా రాణి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖమంతా రక్తంతో, నోట్లో కత్తితో భయపెట్టేలా కనిపించింది. ఇప్పుడీ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ ఇలా మారిపోయిందేంటా అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement