రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది | SSMB29: Mahesh Babu And SS Rajamouli Project With A Hollywood Actor - Sakshi
Sakshi News home page

SSMB29: రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్

Published Thu, Aug 24 2023 12:06 PM | Last Updated on Thu, Aug 24 2023 12:42 PM

Mahesh Babu And SS Rajamouli Project SSMB29 In Hollywood - Sakshi

భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి- ప్రిన్స్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్‌ కూడా ఇదే. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్​ అందిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

(ఇదీ చదవండి: చంద్రయాన్‌ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ హీరోయిన్‌)

తాజాగ SSMB29 ప్రాజెక్ట్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. యాక్షన్‌ అడ్వంచర్‌ సినిమాగా మహేశ్‌బాబుతో కథ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్షన్‌ సీన్స్‌ ఇండియానా జోన్స్ సినిమా టైపులో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నటులు, టెక్నీషియన్స్‌ సైతం భాగం కానున్నారని ప్రకటించారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్‌ రేంజ్‌లో విడుదల కానున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఆఫ్రికా అడువుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన గతంలోనే ఆయన తెలిపారు.

(ఇదీ చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా?)

సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయని అప్పట్లో చెప్పుకొచ్చారు.  2024లో షూటింగ్‌ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాతో మహేష్‌బాబు  బిజీగా ఉన్నారు. నటిస్తున్నారు.  అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్​ వైడ్​గా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement