విమానంలో హడావుడి చేసిన నటి | Actress Selma Blair 'carried off plane on stretcher after midair outburst | Sakshi
Sakshi News home page

విమానంలో హడావుడి చేసిన నటి

Published Tue, Jun 21 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

విమానంలో హడావుడి చేసిన నటి

విమానంలో హడావుడి చేసిన నటి

లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ నటి సెమ్లా బ్లెయిర్(43) విమానంలో హడావుడి చేసింది. విమానంలో విచిత్రంగా ప్రవర్తించి అందరినీ కంగారు పెట్టేసింది. తన నాలుగేళ్ల కొడుకు ఆర్థర్ తో కలిసి డెల్టా విమానంలో మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ కు బయలు దేరింది. వైన్ లో ఏవో మందులు కలుపుకుని తాగింది. తర్వాత ఒక్కసారి అరవడం మొదలు పెట్టింది. 'అతడు కొడుతున్నాడు. తిననీయకుండా, తాగకుండా అడ్డుకుంటున్నాడు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడ'ని గట్టిగా కేకలు పెట్టింది.

ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియక విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు బుర్రలు గోక్కున్నారు. లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇద్దరు నర్పుల సాయంతో స్ట్రెచర్ పై ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెమ్లా బ్లెయిర్ ఏ మందులు కలుపుకుని తాగిందో తెలుసుకునేందుకు ఆమె బ్యాగులు వెతికారు. ఆమె ఏదైనా రుగ్మతతో బాధ పడుతూవుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఆమె తరపు ప్రతినిధి నిరాకరించారు. 'క్రుయల్ ఇంటెన్షన్, ది యాంగర్ మేనేజ్ మెంట్' సినిమాల్లో నటించిన సెమ్లా బ్లెయిర్ 'ది పీపుల్ వీ.' టీవీ సిరీస్ లోనూ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement