Delta flight
-
విమానంలో శాంసంగ్ టాబ్లెట్ పొగలు
ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనతో తీవ్ర సతమతమైన శాంసంగ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. మరోసారి మరో విమానంలో ఈ ఫోన్ పేలిందని తెలిసింది. ఆ పేలుడు ఘటనతో డెట్రాయిట్ నుంచి అమ్స్టెర్డామ్ వెళ్లే డెల్టా విమానాన్ని శనివారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు మళ్లించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాంచెస్టర్‌కు వెళ్తున్న ఈ విమానంలో శాంసంగ్ పాబ్లెట్ సీటు లోపలికి పడిపోయి, దానిలో ఇరుక్కు పోయింది. అనంతరం ఆ టాబ్లెట్ పేలి సీటు కవర్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఆ వింత వాసన, పొగలను గమనించిన ప్రయాణికులు డెల్టా అధికారులకు వెంటనే సమాచారాన్ని అందజేశారు. దీంతో ఆ విమానాన్ని మాంచెస్టర్‌కు మరలించారు. శాంసంగ్ టాబ్లెట్ వల్ల పాడైపోయిన సీటును కొత్త దానితో పునరుద్ధరించారు. రెండు గంటల అనంతరం మళ్లీ డెల్టా విమానం అమ్‌స్టెర్‌డామ్‌కు పయనమైంది. అయితే ఈ ఘటనను శాంసంగ్ ఖండిస్తోంది. బహిరంగ కారణాలే ఈ ఘటనకు దోహదం చేసి ఉంటాయని, గెలాక్సీ నోట్7 వల్ల ఈ పొగలు వ్యాపించలేదని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. సమస్యాత్మకమైన బ్యాటరీగల ఫోన్లను తాము రీకాల్ చేస్తున్నామని, ఈ ఘటన శాంసంగ్ ఫోన్ వల్ల కాకపోవచ్చని స్పష్టంచేస్తోంది.డెల్టా అధికారులను తాము ఆశ్రయిస్తామని, దీనిపై విచారిస్తామని పేర్కొంటోంది. మరోవైపు ఈ ఘటనను ఎఫ్ఏఏ సమీక్షిస్తోంది. -
విమానాన్ని 10మైళ్ల దూరంలో ల్యాండ్ చేశారు
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా విమానం నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటుగా 10 మైళ్ల దూరంలో ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గురువారం సాయంత్రం డెల్టా ఫ్లయిట్ 2845 మినీయాపోలిస్ నుంచి సౌత్ డకోటాకు 130 మంది ప్రయాణికులతో బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాలి. అయితే ఇందుకు బదులుగా ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో దిగినట్టు డెల్టా ఎయిర్‌లైన్స్ అధికారులు చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌కు, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు 10 మైళ్ల దూరం ఉంటుంది. కాగా రెండు చోట్ల రన్ వే పాయింట్ దాదాపుగా ఒకే దిశలో ఉంటాయి. కొన్ని గంటల తర్వాత అధికారులు సమన్వయం చేసుకుని డెల్టా విమానాన్ని రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై ఫెడరల్ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇప్పటికే సొంతంగా అంతర్గత సమీక్ష ప్రారంభించామని డెల్టా ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడినందుకు క్షమాపణలు చెప్పారు. కాగా గతంలో కూడా విమానాలను నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటున మరోచోట ల్యాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. -
విమానంలో హడావుడి చేసిన నటి
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ నటి సెమ్లా బ్లెయిర్(43) విమానంలో హడావుడి చేసింది. విమానంలో విచిత్రంగా ప్రవర్తించి అందరినీ కంగారు పెట్టేసింది. తన నాలుగేళ్ల కొడుకు ఆర్థర్ తో కలిసి డెల్టా విమానంలో మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ కు బయలు దేరింది. వైన్ లో ఏవో మందులు కలుపుకుని తాగింది. తర్వాత ఒక్కసారి అరవడం మొదలు పెట్టింది. 'అతడు కొడుతున్నాడు. తిననీయకుండా, తాగకుండా అడ్డుకుంటున్నాడు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడ'ని గట్టిగా కేకలు పెట్టింది. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియక విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు బుర్రలు గోక్కున్నారు. లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇద్దరు నర్పుల సాయంతో స్ట్రెచర్ పై ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెమ్లా బ్లెయిర్ ఏ మందులు కలుపుకుని తాగిందో తెలుసుకునేందుకు ఆమె బ్యాగులు వెతికారు. ఆమె ఏదైనా రుగ్మతతో బాధ పడుతూవుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఆమె తరపు ప్రతినిధి నిరాకరించారు. 'క్రుయల్ ఇంటెన్షన్, ది యాంగర్ మేనేజ్ మెంట్' సినిమాల్లో నటించిన సెమ్లా బ్లెయిర్ 'ది పీపుల్ వీ.' టీవీ సిరీస్ లోనూ కనిపించింది.