బాలీవుడ్‌ హీరోయిన్‌పై హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ ప్రశంసలు | Gladiator Stunt Director Nick Powell Praises Janhvi Kapoor | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ బ్యూటీపై హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ ప్రశంసలు

Published Mon, Jul 29 2024 10:30 AM | Last Updated on Mon, Jul 29 2024 10:45 AM

Gladiator Stunt Director Nick Powell Praises Janhvi Kapoor

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' మూవీలో మెరుపుతీగలా వచ్చి మాయమైపోయిన ఈ బ్యూటీ 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి'లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన 'ఉలజ్‌' ఈ వారమే (ఆగస్టు 2న) విడుదల కానుంది. తాను తెలుగులో ఎంట్రీ ఇస్తున్న 'దేవర' సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

యాక్షన్‌ సీన్స్‌లో మాత్రం
ఇదిలా ఉంటే ఉలజ్‌ సినిమాకు స్టంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన హాలీవుడ్‌ టెక్నీషియన్‌ నిక్‌ పోవెల్‌.. జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించాడు. 'జాన్వీ సున్నిత మనస్కురాలు. ఎవరినైనా కొట్టేసి గాయపర్చే రకం కాదు. కానీ యాక్షన్‌ సీన్‌లో మాత్రం నలుగుర్ని కొట్టడానికి కూడా వెనుకాడనట్లుగా కనిపించేందుకు ప్రయత్నించింది. యాక్షన్‌ సీన్స్‌లో అవతలివారు ఎక్కడ గాయపడతారోనని భయపడిపోయింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నిక్‌ పోవెల్‌.. బర్న్‌ ఐడెంటిటీ, గ్లాడియేటర్‌, ద లాస్ట్‌ సమురై వంటి పలు హాలీవుడ్‌ చిత్రాలకు పని చేశాడు.

ఉలజ్‌..
ఇకపోతే ఫ్యాన్స్‌ కోసం పలు నగరాల్లో ఉలజ్‌ సినిమా​ స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ వేశారు. ముంబై, ఢిల్లీ, జైపూర్‌, అహ్మదాబాద్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ అని చెప్పగానే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోవడం విశేషం.  ఉలజ్‌ విషయానికి వస్తే ధాన్షు సారియా దర్శకత్వం వహించగా అతిక చౌహాన్‌ సంభాషణలు‌ రాశాడు. గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మాథ్యూ, అదిల్‌ హుస్సేన్‌, జితేంద్ర జోషి, రాజేంద్ర గుప్త కీలక పాత్రల్లో నటించారు.

చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement