Nick Powell
-
బాలీవుడ్ హీరోయిన్‌పై హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' మూవీలో మెరుపుతీగలా వచ్చి మాయమైపోయిన ఈ బ్యూటీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన 'ఉలజ్' ఈ వారమే (ఆగస్టు 2న) విడుదల కానుంది. తాను తెలుగులో ఎంట్రీ ఇస్తున్న 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.యాక్షన్ సీన్స్‌లో మాత్రంఇదిలా ఉంటే ఉలజ్ సినిమాకు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్ నిక్ పోవెల్.. జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించాడు. 'జాన్వీ సున్నిత మనస్కురాలు. ఎవరినైనా కొట్టేసి గాయపర్చే రకం కాదు. కానీ యాక్షన్ సీన్లో మాత్రం నలుగుర్ని కొట్టడానికి కూడా వెనుకాడనట్లుగా కనిపించేందుకు ప్రయత్నించింది. యాక్షన్ సీన్స్‌లో అవతలివారు ఎక్కడ గాయపడతారోనని భయపడిపోయింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నిక్ పోవెల్.. బర్న్ ఐడెంటిటీ, గ్లాడియేటర్, ద లాస్ట్ సమురై వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు పని చేశాడు.ఉలజ్..ఇకపోతే ఫ్యాన్స్ కోసం పలు నగరాల్లో ఉలజ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్స్ వేశారు. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ స్పెషల్ స్క్రీనింగ్ అని చెప్పగానే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. ఉలజ్ విషయానికి వస్తే ధాన్షు సారియా దర్శకత్వం వహించగా అతిక చౌహాన్ సంభాషణలు రాశాడు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, అదిల్ హుస్సేన్, జితేంద్ర జోషి, రాజేంద్ర గుప్త కీలక పాత్రల్లో నటించారు.చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత -
‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూట్లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌధ్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు స్వాతంత్ర్య సమరవీరులుగా నటిస్తున్న ఈ మూవీ అప్డేట్స్ను ఒక్కొక్కటికి విడుదల చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. అదే రేంజ్లో మూవీ మేకింగ్ విషయంలో కూడా దర్శకధీరుడు వెనక్కి తగ్గడంలేదు. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం రాజమౌళీ ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్‌ను తీసుకువచ్చారు. ఆర్ఆర్ఆర్ సెట్ ఆయన రాజమౌళికి సన్నివేశాలను వివరిస్తున్న వీడియోను చిత్ర యూనిట్ ట్విటర్లో షేర్ చేసింది. అయితే నిక్ పావెల్ కత్తియుద్ధంలో నిపుణుడు అనే విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్‌ను రాజమౌళీ భారీగా ప్లాన్ చేశాడు, ఈ మూవీ చివర్లో కత్తి యుద్దాలు ఉండనున్నాయని అభిప్రాయపడుతున్నారు. నిక్ పావెల్ గతంలో బ్రిటన్ వూషూ టీమ్ తరపున యూరోపియన్ చాంపియన్ షిప్లో పతకం గెలుచుకున్నాడు. అనేక యుద్ధ విద్యలను అధ్యయనం చేసిన ఆయన హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ‘బ్రేవ్ హార్ట్’, ‘గ్లాడియేటర్’, ‘మమ్మీ ది లాస్ట్ సమురాయ్’, ‘సిండ్రెల్లా మ్యాన్’ వంటి చిత్రాలకు పోరాట సన్నివేశాలు రూపకల్పన చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఆయన. అలాగే బాలీవుడ్ హిస్టారికల్ చిత్రం మణికర్ణికలో కత్తి యుద్దాలు, స్టంట్స్‌కు ఆయనే రూపకల్పన చేశాడు. చదవండి: ‘ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ ఆర్ఆర్ఆర్ సెట్లో పవన్ కల్యాణ్ -
హాలీవుడ్ టీమ్ 30... లోకల్ ఫైటర్స్ 300!
‘మణికర్ణిక’... ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథతో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రమిది. లక్ష్మీభాయ్ అంటేనే యుద్ధాలు, గుర్రపు స్వారీలు గట్రా కంపల్సరీ కదా! ఆ యుద్ధాలు తెరకెక్కించ డం కోసం నిక్ పావెల్ అనే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ను రప్పించారు క్రిష్. ‘గ్లాడియేటర్’ వంటి హాలీవుడ్ హిట్ సిన్మాలకు నిక్ వర్క్ చేశారు. ఆయన చేత స్వోర్డ్ ఫైటింగ్, హార్స్ రైడింగ్ తదితర అంశాల్లో కంగనాకు శిక్షణ ఇప్పించారనే సంగతి తెలిసిందే. ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... కంగనాకే కాదు, హైదరాబాద్ లోకల్ ఫైటర్స్కూ నిక్ పావెల్ టీమ్ చేత ట్రైనింగ్ ఇప్పించారట. అందుకోసం, హాలీవుడ్ నుంచి 30 మంది స్పెషల్ టీమ్ వచ్చారట! ఎందుకంటే... వార్ సీక్వెన్సులను వీలైనంత లైవ్‌లో షూట్ చేయాలనుకుంటారు క్రిష్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగును అలానే చేశారు. ఇప్పుడీ సిన్మాకు సేమ్ థియరీ ఫాలో అవు తున్నారట! మొన్నామధ్య ఓ 30 రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘మణికర్ణిక’ కోసం యుద్ధ సన్నివేశాలు తీశారు. అప్పుడు 300 మంది లోకల్ ఫైటర్స్, మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వార్ సీక్వెన్స్ కోసమే లోకల్ ఫైటర్స్ కు ట్రైనింగ్ ఇప్పించారు. కంగనా నటించిన హిందీ సినిమా ‘సిమ్రన్’ శుక్రవారం రిలీజవుతోంది. ఆ హడావుడి ముగిశాక ‘మణికర్ణిక’ షూట్ మళ్లీ ఇక్కడే మొదలవుతుందట!