హాలీవుడ్‌ టీమ్‌ 30... లోకల్‌ ఫైటర్స్‌ 300! | Manikarnika shooting 30 Special Team from Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ టీమ్‌ 30... లోకల్‌ ఫైటర్స్‌ 300!

Published Thu, Sep 14 2017 12:03 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

హాలీవుడ్‌ టీమ్‌ 30... లోకల్‌ ఫైటర్స్‌ 300! - Sakshi

హాలీవుడ్‌ టీమ్‌ 30... లోకల్‌ ఫైటర్స్‌ 300!

‘మణికర్ణిక’... ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథతో దర్శకుడు క్రిష్‌ రూపొందిస్తున్న చిత్రమిది. లక్ష్మీభాయ్‌ అంటేనే యుద్ధాలు, గుర్రపు స్వారీలు గట్రా కంపల్సరీ కదా! ఆ యుద్ధాలు తెరకెక్కించ డం కోసం నిక్‌ పావెల్‌ అనే హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ను రప్పించారు క్రిష్‌. ‘గ్లాడియేటర్‌’ వంటి హాలీవుడ్‌ హిట్‌ సిన్మాలకు నిక్‌ వర్క్‌ చేశారు. ఆయన చేత స్వోర్డ్‌ ఫైటింగ్, హార్స్‌ రైడింగ్‌ తదితర అంశాల్లో కంగనాకు శిక్షణ ఇప్పించారనే సంగతి తెలిసిందే. ఇంకో ఇంట్రెస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే... కంగనాకే కాదు, హైదరాబాద్‌ లోకల్‌ ఫైటర్స్‌కూ నిక్‌ పావెల్‌ టీమ్‌ చేత ట్రైనింగ్‌ ఇప్పించారట.

అందుకోసం, హాలీవుడ్‌ నుంచి 30 మంది స్పెషల్‌ టీమ్‌ వచ్చారట! ఎందుకంటే... వార్‌ సీక్వెన్సులను వీలైనంత లైవ్‌లో షూట్‌ చేయాలనుకుంటారు క్రిష్‌. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగును అలానే చేశారు. ఇప్పుడీ సిన్మాకు సేమ్‌ థియరీ ఫాలో అవు తున్నారట! మొన్నామధ్య ఓ 30 రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘మణికర్ణిక’ కోసం యుద్ధ సన్నివేశాలు తీశారు. అప్పుడు 300 మంది లోకల్‌ ఫైటర్స్, మరికొందరు జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వార్‌ సీక్వెన్స్‌ కోసమే లోకల్‌ ఫైటర్స్‌ కు ట్రైనింగ్‌ ఇప్పించారు. కంగనా నటించిన హిందీ సినిమా ‘సిమ్రన్‌’ శుక్రవారం రిలీజవుతోంది. ఆ హడావుడి ముగిశాక ‘మణికర్ణిక’ షూట్‌ మళ్లీ ఇక్కడే మొదలవుతుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement