రీ-రిలీజ్ సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ ఇదే. ఈ హీరో- ఆ హీరో అని తేడా లేదు. పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఆయా హీరోల పాత మూవీస్‌ని థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులూ వాటిని స్క్రీన్‌పై చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రెండ్ వల్ల ఇండస్ట్రీకి ప్లస్ కంటే మైనస్‌లే అనిపిస్తుంది.
వాళ్ల పైత్యం!
స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ చెడ్డోళ్లు కాదు. కానీ వాళ్లలోని కొందరు మాత్రం అభిమానం అనే ముసుగు వేసుకుని ఎక్కడలేని పైత్యం బయటపెడుతున్నారు. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఈ మధ్యే ప్రభాస్ 'యోగి' సినిమాని రిలీజ్ చేశారు. చాలామంది చూసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన కొందరు మాత్రం.. ఖాళీ కూల్‌డ్రింక్ కేసులు విరగ్గొట్టారు. మరోచోట స్క్రీన్ చింపేశారు. ఇది నిజంగా పైత్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)
అందరూ అంతే!
అయితే అభిమాని అని చెప్పుకునే ఎక్కడలేని పైత్యం అంతా చూపించేది ఏదో ఓ హీరో ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్స్ అలానే తగలడ్డారు. ఎంజాయ్ చేయడానికి, పైత్యం చూపించడానికి మధ్య ఉన్న గీతని దాటేస్తున్నారు. వీళ్లు ఇలా చేయడం వల్ల పలు థియేటర్ యాజమానులు.. రీ రిలీజ్ సినిమాలంటేనే భయపడుతున్నారు.
లక్షల్లో నష్టం
రీ రిలీజ్‌ల వల్ల స్టార్ హీరోల సినిమాలకు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కుతున్నాయి.. ఈ వార్తల వల్ల థియేటర్ యజమానుల నష్టాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ ట్రెండ్ దెబ్బకు థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మైకంలో కుర్చీలు విరగ్గొట్టడం, స్క్రీన్ చించేయడం లాంటివి చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. వచ్చిన డబ్బుల కంటే పెట్టుబడే ఎక్కువవుతోంది.
(ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?)
చిన్న సినిమాలకు దెబ్బ
తెలుగులో చిన్న సినిమాలకు ఉండే ఆదరణే అంతంత మాత్రం. టాక్ చాలా బాగుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి వాటిని చూడరు. అలాంటిది ఇప్పుడు ఈ రీ రిలీజ్ చిత్రాల వల్ల.. ప్రతివారం పలు చిన్న మూవీస్ విడుదలవుతున్నా ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలా రీ రిలీజ్ ట్రెండ్ వల్ల చిన్న సినిమాలు బలవుతున్నాయి.
మరీ ఎక్కువైపోతున్నాయి!
రీ రిలీజ్ అనేది ఎప్పుడో ఓసారి చేస్తే.. ప్రేక్షకులకు కూడా ఓ సరదాలా ఉంటుంది. అదేదో ఉద్యమం.. పనిగట్టుకుని మరీ స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం రెగ్యులర్ చిత్రాలు- పాత సినిమాలు.. ఇలా దేనిపై కూడా ఆసక్తి లేకుండా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి రీ రిలీజ్ ట్రెండ్‌కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో ఏంటో?
(ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment