కలెక్టర్‌ కర్తవ్యం | Aram movie nayantara next movie by film updates Aram in telugu | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ కర్తవ్యం

Published Fri, Jan 5 2018 2:13 AM | Last Updated on Fri, Jan 5 2018 2:13 AM

Aram movie nayantara next movie by film updates Aram in telugu - Sakshi

ఆమె ఒక జిల్లా కలెక్టర్‌. ప్రజల సంక్షేమం కోసం బాధ్యతతో పనిచేయాల్సిన కర్తవ్వం ఆమెపై ఉంది. కానీ ఆమె కర్తవ్యానికి కొందరు రాజకీయ స్వార్థపరులు సంకెళ్లు వేయాలనుకున్నారు. అప్పుడు ఆ కలెక్టర్‌ ఎలా స్పందించింది? ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది? అన్న అంశాల ఆధారంగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరమ్‌’. నయనతార లీడ్‌ రోల్‌లో గోపీ నైనర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రాన్ని ఆర్‌. రవీంద్రన్, నార్త్‌ స్టార్‌ ఎంటరై్టన్మెంట్‌ అధినేత శరత్‌మరార్‌  ‘కర్తవ్యం’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కంప్లీట్‌ అయ్యాయి. ‘‘నయనతార కెరీర్‌లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది.  నిర్మాత శరత్‌ మరార్‌తో కలిసి ఈ సినిమాను విడుదల చేయనుండటం ఆనందంగా ఉంది. రిలీజ్‌ డేట్‌ను తర్వలో ఎనౌన్స్‌ చేస్తాం’’ అన్నారు ఆర్‌. రవీంద్రన్‌. విఘ్నేష్, రమేష్, సునులక్ష్మీ, వినోదినీ వైద్యనాథన్‌ కీలకపాత్రలు చేసిన ఈ సినిమాకు కెమెరా: ఓం ప్రకాశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement