సీక్వెల్‌కు సిద్ధం! | Nayanthara Planning for Aram Movie Sequel | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌కు సిద్ధం!

Published Tue, Nov 13 2018 3:01 AM | Last Updated on Tue, Nov 13 2018 3:01 AM

Nayanthara Planning for Aram Movie Sequel - Sakshi

నయనతార

‘ఆరమ్‌’ (తెలుగులో కర్తవ్యం) చిత్రంలో పవర్‌ఫుల్‌ కలెక్టర్‌ పాత్రలో అలరించారు నయనతార. నూతన దర్శకుడు గోపీ నాయర్‌ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్‌లో నయనతార కలెక్టర్‌గా కనిపించరట. మరో కొత్త పాయింట్‌తో దర్శకుడు కొత్త కథను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం నయనతార చిరంజీవితో సైరా’, తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ చిత్రం, డ్యూయల్‌ రోల్‌లో ‘ఐరా’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement