
మేడమ్ ఎప్పుడు ఫ్రీ అవుతారు? డేట్స్ ఇచ్చేదెప్పుడు? అని దర్శకుడు గోపీ నాయర్ వెయిటింగ్. ఈ గోపీ నాయర్ ఎవరో తమిళ సినిమాలు ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా రిలీజైన్ ‘ఆరమ్’ సినిమా దర్శకుడు ఈయనే. నయనతార లీడ్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంత హిట్టయిన సినిమాని అలా వదిలేస్తే ఎలా? పైగా కథను కొనసాగించే వెసులుబాటు కూడా ఉంది.
అందుకే సీక్వెల్ ప్లాన్ చేశారు గోపీ నాయర్. ఇందులోనూ నయనతారనే కథానాయికగా అనుకున్నారు. ఈ బ్యూటీకి కూడా సినిమా చేయడం ఇష్టమే. కానీ డేట్స్ ఎక్కడ? డైరీ ఫుల్. తెలుగులో చిరంజీవి ‘సైరా’కి డేట్స్ ఇచ్చారు. తమిళంలో ‘ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయనతార. ఇప్పట్లో వేరే సినిమాకి డేట్స్ అంటే కష్టమే. మేడమ్ డైరీ చెక్ చేసుకుని, సై అంటే సీక్వెల్ స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ రెడీ. మరి.. సై అనేదెప్పుడు? సీక్వెల్ స్టార్ట్ అయ్యేదెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment