Aaram
-
రెండో కర్తవ్యంలో సమంత
‘యు టర్న్, సూపర్ డీలక్స్, మజిలీ’ తాజాగా ‘ఓ బేబీ’... ఇలా సమంత సక్సెస్ మంచి పీక్స్‌లో ఉంది. సినిమా ఎంపిక, కథలోని పాత్రల్లో ఆమె ఒదిగిపోయే తీరు ప్రేక్షకులకు భలేగా నచ్చుతున్నాయి. ఇప్పటికే మహానటి, రంగస్థలం, యు టర్న్ చిత్రాల్లోని నటనకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్న సమంత ‘ఓ బేబీ’లో విజృంభించారు. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సమంత లేటెస్ట్ చాయిస్ అని పలువురు దర్శక–నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో సమంతతో ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) దర్శకుడు గోపీ నాయర్ ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి ట్రై చేస్తున్నారట. అయితే... సమంతతో గోపీ తెరకెక్కించబోయే సినిమా కొత్త కథనా? లేక ‘ఆరమ్’ సీక్వెల్‌నా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
సీక్వెల్‌కు సిద్ధం!
‘ఆరమ్’ (తెలుగులో కర్తవ్యం) చిత్రంలో పవర్ఫుల్ కలెక్టర్ పాత్రలో అలరించారు నయనతార. నూతన దర్శకుడు గోపీ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్లో నయనతార కలెక్టర్‌గా కనిపించరట. మరో కొత్త పాయింట్‌తో దర్శకుడు కొత్త కథను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం నయనతార చిరంజీవితో సైరా’, తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ చిత్రం, డ్యూయల్ రోల్లో ‘ఐరా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. -
తెర మీదకు మరో ఫ్రీడం ఫైటర్ బయోపిక్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.తాజా మరో ఫ్రీడం ఫైటర్ జీవిత కథ కూడా వెండి తెరకెక్కేందుకు రెడీ రంగం సిద్ధమవుతోంది. భారత గిరిజన ఉద్యమ కారుడు బిర్సా ముండా జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నారు. నయనతార ప్రధాన పాత్రలో ఆరమ్ సినిమాను తెరకెక్కించిన గోపి నయనార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గిరిజన ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న బిర్సా ముండా తరువాత స్వాతంత్ర్యోధ్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. -
నయన్.. అందులోనూ అగ్రస్థానమే..!
తమిళసినిమా: ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడితే ఆ తరువాత అంతా ఆనందమే. ఇందుకు నటి నయనతార ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్ నయనతార ఆదిలో ఎన్నో అవమానాలను, అవరోధాలను ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా చాలా ఒడిదుడుకులు చవిచూశారు. ప్రేమలోనూ రెండు సార్లు విఫలమయ్యారు. వాటన్నింటినీ ఎదురొడ్డి ఇప్పుడు అగ్రనటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో దుమ్మురేపిన నయనతార ఇప్పుడు అభినయంతోనూ అదరగొడుతున్నారు. ఇంత బిజీగా ఉన్నా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమ, షికార్లు చేస్తున్నారు. ఇటీవల పర్సనల్ లైఫ్ కోసం కాస్త సమయాన్ని కేటాయించి విఘ్నేశ్‌శివన్‌తో విదేశాలకు చెక్కేశారు. సింగపూర్, దుబాయ్‌లో విహరించి ఆ తరువాత అమెరికా చేరుకున్నారు. అటు నుంచి సొంత గడ్డ (కేరళలోని కొచ్చి)కి చేరుకుంటారట. అక్కడ మలయాళ సూపర్‌స్టార్‌తో కలిసి నటించే భారీ చిత్రంలో పాల్గొంటారని సమాచారం. తాజా సమాచారం ఏమిటంటే నయనతార ఇంతకుముందు పారితోషికంగా రూ.3కోట్లు పుచ్చుకునే వారు. అయితే తను సెంట్రల్ రోల్ పోషించిన అరమ్ చిత్రం విజయం మరింత ఇమేజ్ను తెచ్చి పెట్టింది. అంతే అమ్మడు పారితోషికాన్ని రూ.4కోట్లకు పెంచేశారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు తనవైపు రావడంతో పారితోషికం విషయంలో మరింత డిమాండ్ చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నయనతార తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో అజిత్ సరసన విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలోనూ నయనే నాయకి అనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్ముట్టితో కలిసి నటించనున్న తాజా చిత్రం కోసం తన పారితోషికాన్ని అక్షరాల రూ.5కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇది తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. దక్షిణాదిలో ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి నయనతారనే అవుతుంది. ఇలా అగ్రనాయకిగా వెలుగొందుతున్న నయనతార పారితోషికంలోనూ అగ్రస్థానాన్నే అధిరోహించిందన్న మాట. -
హ్యాండ్ ఇచ్చిన నిర్మాత.. ఆగేది లేదంటున్న నయన!
సినిమా తీస్తానని మాటిచ్చిన నిర్మాత మధ్యలో హ్యాండ్ ఇస్తే? అసలు సెట్స్‌కి వెళ్లకముందే డ్రాప్ అయితే అప్పుడు ఆ సినిమా కమిట్ అయినవాళ్లు వేరే సినిమా చూసుకుంటారు. బాగా బిజీగా ఉన్నవాళ్లు ‘పోతే పోయిందిలే’ అనుకుంటారు. స్టోరీ బాగా నచ్చేసినవాళ్లు మాత్రం ‘మంచి ప్రాజెక్ట్ పోయిందే’ అని ఫీలవుతారు. ఓ సినిమా విషయంలో నయనతార అలానే బాధపడుతున్నారట. ఫైనల్లీ ‘ఈ బాధ పడే బదులు ఆ సినిమాకి మనమే ప్రొడ్యూసర్ని సెట్ చేస్తే పోలా’ అనుకున్నారట. ఫుల్ డీటైల్స్‌లోకి వెళితే.. ‘ఈరమ్’, ‘కుట్రమ్ 23’ చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు నయనతార. గతేడాది నవంబర్‌లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. డిసెంబర్లో సెట్స్‌కి వెళ్లాల్సింది. కానీ నిర్మాత నా వల్ల కాదంటూ సినిమా నుంచి తప్పుకున్నారని చెన్నై టాక్. సడన్‌గా నిర్మాత అలా హ్యాండ్ ఇవ్వడంతో ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి లేదని చాలామంది ఫిక్సయ్యారు. కానీ నయనతారకు కథ బాగా నచ్చిందట. దాంతో పాటు అరివళగన్ కూడా మంచి డైరెక్టరే. అందుకని సినిమా ఆగడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతను సెట్ చేయాలనుకుంటున్నారట. ఇటీవల నయనతార నటించిన ‘అరమ్’ చిత్రానికి కూడా ఈ విధంగానే జరిగింది. ఓ నిర్మాత తప్పుకోవడంతో మరో నిర్మాతతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారామె. ‘అరమ్’ సూపర్ డూపర్ హిట్టయింది. సో.. నయనతార నమ్మిన కథ కాసుల వర్షం కురిపిస్తుందని ప్రూవ్ అయింది. ఆ సెంటిమెంట్‌తో, కథానాయికగా నయనతార మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా అరివళగన్‌తో ఆమె చేయాలనుకున్న సినిమాను నిర్మించడానికి వేరే నిర్మాతలు ముందుకు రావచ్చనే ఊహాగానాలున్నాయి. ఏదేమైనా ‘మనకెందుకులే’ అనుకోకుండా నయన్ ఈ విధంగా చేయడం మాత్రం గొప్ప విషయమే. -
కలెక్టర్ కర్తవ్యం
ఆమె ఒక జిల్లా కలెక్టర్. ప్రజల సంక్షేమం కోసం బాధ్యతతో పనిచేయాల్సిన కర్తవ్వం ఆమెపై ఉంది. కానీ ఆమె కర్తవ్యానికి కొందరు రాజకీయ స్వార్థపరులు సంకెళ్లు వేయాలనుకున్నారు. అప్పుడు ఆ కలెక్టర్ ఎలా స్పందించింది? ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది? అన్న అంశాల ఆధారంగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరమ్’. నయనతార లీడ్ రోల్లో గోపీ నైనర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటరై్టన్మెంట్ అధినేత శరత్‌మరార్ ‘కర్తవ్యం’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ‘‘నయనతార కెరీర్లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. నిర్మాత శరత్ మరార్తో కలిసి ఈ సినిమాను విడుదల చేయనుండటం ఆనందంగా ఉంది. రిలీజ్ డేట్‌ను తర్వలో ఎనౌన్స్ చేస్తాం’’ అన్నారు ఆర్. రవీంద్రన్. విఘ్నేష్, రమేష్, సునులక్ష్మీ, వినోదినీ వైద్యనాథన్ కీలకపాత్రలు చేసిన ఈ సినిమాకు కెమెరా: ఓం ప్రకాశ్. -
సై అంటే సీక్వెల్
మేడమ్ ఎప్పుడు ఫ్రీ అవుతారు? డేట్స్ ఇచ్చేదెప్పుడు? అని దర్శకుడు గోపీ నాయర్ వెయిటింగ్. ఈ గోపీ నాయర్ ఎవరో తమిళ సినిమాలు ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా రిలీజైన్ ‘ఆరమ్’ సినిమా దర్శకుడు ఈయనే. నయనతార లీడ్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంత హిట్టయిన సినిమాని అలా వదిలేస్తే ఎలా? పైగా కథను కొనసాగించే వెసులుబాటు కూడా ఉంది. అందుకే సీక్వెల్ ప్లాన్ చేశారు గోపీ నాయర్. ఇందులోనూ నయనతారనే కథానాయికగా అనుకున్నారు. ఈ బ్యూటీకి కూడా సినిమా చేయడం ఇష్టమే. కానీ డేట్స్ ఎక్కడ? డైరీ ఫుల్. తెలుగులో చిరంజీవి ‘సైరా’కి డేట్స్ ఇచ్చారు. తమిళంలో ‘ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయనతార. ఇప్పట్లో వేరే సినిమాకి డేట్స్ అంటే కష్టమే. మేడమ్ డైరీ చెక్ చేసుకుని, సై అంటే సీక్వెల్ స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ రెడీ. మరి.. సై అనేదెప్పుడు? సీక్వెల్ స్టార్ట్ అయ్యేదెప్పుడు? -
నయన్ నెక్ట్స్ స్టెప్ ఏంటో?
తమిళసినిమా: సినిమా నుంచి నెక్ట్స్ ఏంటీ? అంటే ఇంకేముంది రాజకీయమే అన్నట్టుగా తారల ఆలోచనలు ఉంటున్నాయని ఢంకా పదంగా చెప్పవచ్చు. అలా సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన తారలు చాలా మంది రాజకీయాల్లో రాణించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ద్రావిడ రాష్ట్రాన్ని పాలించిన వారిలో 90 శాతం మంది సినిమా వాళ్లే అన్నది నిర్విదాంశం. నాటి అన్నాదురై నుంచి, ఇటీవల జయలలిత వరకూ తమిళనాడులో అధికారం చేపట్టి ప్రజాదరణను పొందారు. తాజాగా కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ నటుడు అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వీరే కాదు వివిధ రాజకీయ పార్టీల్లో చేసి అధికార ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇక నటీమణుల విషయానికి వస్తే రాధిక శరత్‌కుమార్, కుష్బూ, నగ్మా లాంటి వారు రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. వీరంతా ఇంతకు ముందు సినిమా రంగంలో ఏలిన వారే. పలు చిత్రాల్లో కలెక్టర్లు, శాసనసభ్యులు, మంత్రులు లాంటి పాత్రలు పోషించి, మెప్పించి ఆ ఆదరణ, ఆకర్షణతో రాజకీయాల్లోకి వచ్చారన్నది ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు. ఇప్పుడు అదే కోవలో లేడీసూపర్‌స్టార్‌గా కోలీవుడ్‌ను ఏలేస్తున్న నయనతార పయనించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి ఆమెకు అలాంటి ఆలోచన లేకున్నా, మందిమాగాదులు ఆలాంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టిన ఈ కేరళ బ్యూటీ వరుసగా ఆ తరహా చిత్రాలను కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తను నటించిన అరమ్ చిత్రం నయనతారను రాజకీయ చర్చల్లోకి లాగేసింది.ఆ చిత్రంలో నిజాయితీకలిగిన కలెక్టర్‌గా నటించిన నయనతార ఒక దశలో స్వార్ధం, అవినీతితో కూరుకుపోయిన నాయకులతో ఇమడలేక ఆ పదవికి రాజీనామా చేసిన ప్రజాసేవే లక్ష్యంగా జనాల్లోకి వచ్చేస్తారు. ఇలాంటి సమాజానికి కావలసిన పలు అంశాలతో కూడిన అరమ్ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను రాబట్టుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ చిత్ర నిర్మాత అరమ్ 2 చిత్రాన్ని రెడీ అంటున్నారు. నయనతార కూడా అందుక పచ్చజెండా ఊపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే అరమ్ చిత్ర రెండవ భాగం మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందనే టాక్ వైరల్ అవుతోంది.అందులో ప్రజల్లోకి వెళ్లి శాసనసభ్యురాలు, ముఖ్యమంత్రి వరకూ పదవులను చేపట్టే విధంగా కథను దర్శకుడు గోపీనయినార్ రెడీ చేస్తున్నారట. ఆ చిత్రం తరువాత నయనతారను నెక్టŠస్ ఏంటీ? అన్న ప్రశ్నకు రాజకీయమే అనే బదులు వచ్చినా ఆశ్యర్యపడనవసరం లేదనే ప్రచారం స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇవిన్నీ ఊహాగానాలే. నిజం ఏమిటన్నది నయనతార స్పందిస్తేగానీ తెలియదు. -
నటిస్తారా? లేదా?
మధి... మధివధని! తమిళ సినిమా ‘ఆరమ్’లో నయనతార చేసిన ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పేరు. తమిళనాట థియేటర్లలో ఇప్పుడెక్కడ చూసినా ఈ సిన్మా, అందులో నయనతార నటన గురించే డిస్కషన్! డేరింగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్లో ఈ హీరోయిన్ సూపర్‌గా నటించారని తమిళ ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోలు నయనకు కొత్త కాకున్నా... థియేటర్లకు వెళ్తున్నారు. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ సక్సెస్ వేడిలోనే సీక్వెల్ (‘ఆరమ్–2’) అనౌన్స్ చేశారు చిత్రనిర్మాత రాజేశ్. ట్విస్ట్ ఏంటంటే... ఇందులో నయనతార నటిస్తారా? లేదా? అనేది చెప్పలేదు. 2018 సెకండాఫ్‌లో ‘ఆరమ్–2’ను విడుదల చేస్తామని ప్రకటించారంతే. దాంతో ‘ఆరమ్’ సక్సెస్‌కి ముఖ్య కారణమైన నయనతార సీక్వెల్లో నటిస్తారా? లేదా? అనే డిస్కషన్ చెన్నైలో మొదలైందట. ఏమవుతుందో... వెయిట్ అండ్ సీ!! -
లేడీ సూపర్‌స్టార్... వాట్ ఏ చేంజ్ అమ్మా
ఇటీవల కాలంలో నయనతారను ఎప్పుడైనా ఆడియో వేడుకల్లో గానీ... పోనీ, వీడియో ఇంటర్వ్యూల్లో గానీ చూశారా? అంతెందుకు... ‘నయనతార నటన సూపరో సూపర్’ అని ప్రతి ఒక్కరూ ప్రశంసించిన టైమ్‌లో ఈ బ్యూటీ థ్యాంక్స్ చెప్పడం చూశారా? లేదు కదూ! పబ్లిసిటీకి నయనతార ఎప్పుడూ కొంచెం దూరమే. అటువంటి నయనతారలో ఎంత మార్పు.. ఎంత మార్పు! ఏకంగా థియేటర్ల దగ్గరకు వెళ్తున్నారు. ప్రేక్షకుల్ని నేరుగా కలసి థ్యాంక్స్ చెబుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే... రీసెంట్గా నయనతార ముఖ్య పాత్రలో నటించిన తమిళ్ సిన్మా ‘ఆరమ్’ విడుదలైంది. మింజూర్ గోపీ (గోపీ నైనర్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజల సమస్యల తరఫున పోరాటం చేసే కలెక్టర్‌గా చేశారామె. నయనతార నటనకు సూపర్బ్ రెస్పాన్స్. అంతేనా... ‘లేడీ సూపర్‌స్టార్’గా పిలుస్తున్నారక్కడ. పబ్లిక్ రెస్పాన్స్‌కి ఫుల్ ఫిదా అయిన నయన్, అందరికీ థ్యాంక్స్ చెబుతున్నారు. థియేటర్స్ టూర్ వేశారు. ఆమెలో ఈ మార్పు ప్రేక్షకులకు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. ఇదే విధంగా తెలుగు ప్రేక్షకుల ముందుకూ నయనతార వస్తారా? వెయిట్ అండ్ సీ!! -
నయనతార హాబీస్ ఇవే..!
స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న నయనతార, తనలోని మరో టాలెంట్ గురించి బయటపెట్టింది. తన తాజా చిత్రం అరమ్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నయనతార పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తుందట. నయన్ తన వ్యక్తిగత విషయాలను ఎవరితో పెద్దగా షేర్ చేసుకోదు. అందుకే తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే నయన్ మంచి రచయిత కూడా అన్న విషయం తెలుసు. అయితే కవితలు రాయటం తన హాబీ అన్న నయన్ భవిష్యత్తు తన రచనలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించలేదు. అంతేకాదు తన కవితలు ఇంతవరకు ఎవరికీ చూపించలేదట. కేవలం కలం మాత్రమే కాదు మరింత ఖాళీగా ఉంటే కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తుందట ఈ బ్యూటీ.