హ్యాండ్‌ ఇచ్చిన నిర్మాత.. ఆగేది లేదంటున్న నయన! | Touch Me Not, Please: Nayanatara | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌ ఇచ్చిన నిర్మాత.. ఆగేది లేదంటున్న నయన!

Published Wed, Jan 24 2018 12:57 AM | Last Updated on Wed, Jan 24 2018 12:57 AM

Touch Me Not, Please: Nayanatara - Sakshi

సినిమా తీస్తానని మాటిచ్చిన నిర్మాత మధ్యలో హ్యాండ్‌ ఇస్తే? అసలు సెట్స్‌కి వెళ్లకముందే డ్రాప్‌ అయితే అప్పుడు ఆ సినిమా కమిట్‌ అయినవాళ్లు వేరే సినిమా చూసుకుంటారు. బాగా బిజీగా ఉన్నవాళ్లు ‘పోతే పోయిందిలే’ అనుకుంటారు. స్టోరీ బాగా నచ్చేసినవాళ్లు మాత్రం ‘మంచి ప్రాజెక్ట్‌ పోయిందే’ అని ఫీలవుతారు. ఓ సినిమా విషయంలో నయనతార అలానే బాధపడుతున్నారట. ఫైనల్లీ ‘ఈ బాధ పడే బదులు ఆ సినిమాకి మనమే ప్రొడ్యూసర్‌ని సెట్‌ చేస్తే పోలా’ అనుకున్నారట. ఫుల్‌ డీటైల్స్‌లోకి వెళితే.. ‘ఈరమ్‌’, ‘కుట్రమ్‌ 23’ చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అరివళగన్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు నయనతార. గతేడాది నవంబర్‌లో ఈ సినిమాని అనౌన్స్‌ చేశారు. డిసెంబర్‌లో సెట్స్‌కి వెళ్లాల్సింది. కానీ నిర్మాత నా వల్ల కాదంటూ సినిమా నుంచి తప్పుకున్నారని చెన్నై టాక్‌.  సడన్‌గా నిర్మాత అలా హ్యాండ్‌ ఇవ్వడంతో ఇక ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే పరిస్థితి లేదని చాలామంది ఫిక్సయ్యారు.

కానీ నయనతారకు కథ బాగా నచ్చిందట. దాంతో పాటు అరివళగన్‌ కూడా మంచి డైరెక్టరే. అందుకని సినిమా ఆగడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతను సెట్‌ చేయాలనుకుంటున్నారట. ఇటీవల నయనతార నటించిన ‘అరమ్‌’ చిత్రానికి కూడా ఈ విధంగానే జరిగింది. ఓ నిర్మాత తప్పుకోవడంతో మరో నిర్మాతతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారామె. ‘అరమ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. సో.. నయనతార నమ్మిన కథ కాసుల వర్షం కురిపిస్తుందని ప్రూవ్‌ అయింది. ఆ సెంటిమెంట్‌తో, కథానాయికగా నయనతార మీద ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అరివళగన్‌తో ఆమె చేయాలనుకున్న సినిమాను నిర్మించడానికి వేరే నిర్మాతలు ముందుకు రావచ్చనే ఊహాగానాలున్నాయి. ఏదేమైనా ‘మనకెందుకులే’ అనుకోకుండా నయన్‌ ఈ విధంగా చేయడం మాత్రం గొప్ప విషయమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement