
నయనతార హాబీస్ ఇవే..!
స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న నయనతార, తనలోని మరో టాలెంట్ గురించి బయటపెట్టింది. తన తాజా చిత్రం అరమ్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నయనతార పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తుందట.
నయన్ తన వ్యక్తిగత విషయాలను ఎవరితో పెద్దగా షేర్ చేసుకోదు. అందుకే తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే నయన్ మంచి రచయిత కూడా అన్న విషయం తెలుసు. అయితే కవితలు రాయటం తన హాబీ అన్న నయన్ భవిష్యత్తు తన రచనలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించలేదు. అంతేకాదు తన కవితలు ఇంతవరకు ఎవరికీ చూపించలేదట. కేవలం కలం మాత్రమే కాదు మరింత ఖాళీగా ఉంటే కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తుందట ఈ బ్యూటీ.