
సమంత
‘యు టర్న్, సూపర్ డీలక్స్, మజిలీ’ తాజాగా ‘ఓ బేబీ’... ఇలా సమంత సక్సెస్ మంచి పీక్స్‌లో ఉంది. సినిమా ఎంపిక, కథలోని పాత్రల్లో ఆమె ఒదిగిపోయే తీరు ప్రేక్షకులకు భలేగా నచ్చుతున్నాయి. ఇప్పటికే మహానటి, రంగస్థలం, యు టర్న్ చిత్రాల్లోని నటనకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్న సమంత ‘ఓ బేబీ’లో విజృంభించారు. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సమంత లేటెస్ట్ చాయిస్ అని పలువురు దర్శక–నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో సమంతతో ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) దర్శకుడు గోపీ నాయర్ ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి ట్రై చేస్తున్నారట. అయితే... సమంతతో గోపీ తెరకెక్కించబోయే సినిమా కొత్త కథనా? లేక ‘ఆరమ్’ సీక్వెల్‌నా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment