Oh Baby Movie
-
'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!
'బేబి' సినిమా గతేడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. గతంలో పలు సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. 'బేబి'తోనే అందరికీ బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడికి తాజాగా వింత అనుభవం ఎదురైంది. భోజనానికి పిలిచి మరీ షాకిచ్చారు. దీని గురించి స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)'నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, 'నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు' అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, 'బేబీ సినిమా డైరెక్టర్' అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. 'మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో' అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబీ' అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.గతంలో సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమా వచ్చింది. 'బేబి' పేరుతో సాయి రాజేశ్ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. ఏదేమైనా 'బేబి' పేరు ఎంత పనిచేసింది!(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ!
విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకున్న సామ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ప్రస్తుతం ‘కాతువాకుల రెండు కాదల్’ తమిళ చిత్రంలో పాటు ఓ థ్రీల్లర్ సినిమాకు సంతకం చేసింది. చదవండి: ఆ బాధలో డిప్రెషన్‌కు వెళ్లిపోయా: శివాని రాజశేఖర్ అలాగే మరో తమిళ చిత్రానికి కూడా ఆమె ఒకే చెప్పింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు సామ్ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటించేందుకు సమంత సంతకం చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం ‘అరెంజ్మంట్స్ ఆఫ్ లవ్ మూవీ’ని సమంత గతంలో నటించిన ‘హో! బేబీ’ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నట్లు ఇటివల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇండియన్ ప్రొడక్షన్ హౌజ్ గురు ఫిల్మ్స్ సమర్పణలో సునీత తాటి నిర్మించనున్నారట. ఇండియన్ రైటర్ టైమెరి ఎన్. మురారి రాసిన నవల ఆధారంగా బ్రిటిష్-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో పబ్లిష్ చేసింది. ఇది 2004లో విడుదలై అత్యధిక అమ్ముడైన నవలగా పేరొందింది. అంతేగాక టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు ఎంపికైన ఏకైక ఆసియా ప్రాజెక్ట్ ఇది. చదవండి: క్రేజీ అప్డేట్: ‘పుష్ప’రాజ్‌తో సమంత ఐటెం సాంగ్? -
ఓ బేబీ.. సాంగ్ లిరిక్స్
ఏదో ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా బేబీ అవతరించే అదిగో (2) ఒళ్లంత వెటకారం పుట్టింది సూర్యకాంతం ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ బ్లాక్ అండ్ వైట్ దొరసాని ట్రెండీగా మారే కహానీ అల్లాద్దీన్ దీపంలా దొరికింది మళ్లీ జవానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నీ లైఫ్‌కి నువ్వే రారాణి దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు గడియారం ముల్లేదో రూట్ మారి తిరిగినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ సూర్యుడైన నీవైపు సన్ గ్లాసే పెట్టి చూడాలి మూన్ వాక్‌తో బేబీ వస్తుంటే ఈలే కొట్టాలి మూవీ స్టార్స్ నీకోసం పిచ్చోళ్లై క్యూలే కట్టాలి ఎంత మారిపోయే ఓవర్ నైట్ ఏ బేబీ రూట్ ఏ సూపర్ క్యూట్ ఏ ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ ఎంజాయే చెయ్యాలి లైఫ్ నీకు నచ్చినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ చిత్రం: ఓ బేబీ సంగీతం: మిక్కీ జె. మేయర్ రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి -
తేజ సజ్జతో శివానీ రాజశేఖర్ మూవీ..
‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జ, హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌తో హీరో, హీరోయిన్లులా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నఈ మూవీ నుంచి హీరో తేజ లుక్ రిలీజైంది. ఆదివారం తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి అతని లుక్ ను రివీల్ చేసారు.(చదవండి : సాయిధరమ్ తేజ్ పెళ్లి ప్రకటన!) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’అన్నారు. లక్ష్మీ భూపాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. -
మరో చిత్రానికి పచ్చజెండా?
సినిమా: నటి సమంత కోలీవుడ్‌లో మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లేనా?.. అంటే అవుననే ప్రచారమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. 2019లో సక్సెస్‌పుల్ కథానాయకిగా కొనసాగిన నటి ఈ బ్యూటీ. తమిళంలో సూపర్‌డీలక్స్, తెలుగులో మజిలి, ఓ బేబీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళంలో సంచలన విజయాన్ని అందుకున్న 96 చిత్ర తెలుగు రీమేక్‌లో నటించి పూర్తిచేసింది. కాగా ఇప్పుడు తొలి సారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. దీ ఫ్యామిలీ మాన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. కాగా ఇటీవల చిత్రాల ఎంపికలో ఆచీతూచి నిర్ణయాలను తీసుకుంటూ వచ్చింది. తాజాగా మళ్లీ నటిగా వేగం పెంచినట్లు తెలుస్తోంది. తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇప్పటికే తాప్సీ హీరోయిన్గా గేమ్ ఓవర్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సరవణన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందనున్నట్లు సమాచారం. కాగా తాజాగా మరో చిత్రానికి సమంత పచ్చజెండా ఊపినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతకుముందు మలయాళ నటుడు నవీన్ పౌలీ హీరోగా రిచ్చీ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ రామచంద్రన్ కొత్త చిత్రానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇందులో నటి సమంత ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇదిచాలా ఆసక్తికరమైన కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందని టాక్. మరో విషయం ఏమింటే దీన్ని స్క్రీన్ సీన్స్ మీడియా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల సుందర్ సీ హీరోగా ఇరుట్టు చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శశికుమార్ హీరోగా ఎంజీఆర్ మగన్ చిత్రాన్ని, హరీశ్‌కల్యాణ్ హీరోగా ధారల ప్రభు అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా సమంత హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే చిత్రాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ఓ బేబీ ఎంత పనిచేశావ్
చెన్నై : ఏ నటీనటుడికైనా జీవితంలో గుర్తుండిపోయిన చిత్రాలంటూ కొన్ని ఉంటాయి. అలా నటి సమంత తన జీవితంలో మరచిపోలేని చిత్రం ఏం మాయచేసావే. ఈ చిత్రం తెలుగులో ఆమెను నటిగా సుస్థిరత స్థానాన్ని కల్పించడంతో పాటు, తనకు జీవిత భాగస్వామినే అందించింది. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో పలు కమర్షియల్ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అలాంటిది తను తాజాగా నటించిన ఓబేబీ చిత్రం సమంతను మరో స్థాయికి తీసుకెళ్లింది. అదే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకి స్థాయి. అనుష్కకు ఓ అరుంధతి, నయనతారకు ఓ మాయ, అరమ్ చిత్రాల లాగా సమంతకు ఓ బేబీ మైలురాయిగా నిలిచి పోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రం తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్నే మార్చుకునేలా చేసింది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ బ్యూటీ తెలుగు నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కథానాయకిగా తన క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తోంది. తరుచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. కాగా ఓ బేబీ చిత్రం తరువాత ఈ భామ తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత సమంత వచ్చే ఏడాది తల్లి కావాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరిగుతోంది. కాగా ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టేలా సమంత తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. 96 చిత్రం తరువాత తాను నటించనున్న కొత్త చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపింది. నటి అనుష్క నటించిన భాగమతి చిత్రం తరువాత అమెరికాలో ఒక మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన చిత్రం ఓ బేబీనేనని పేర్కొంది. అందుకే తాను బిడ్డకు తల్లి కావాలన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఇకపై ఈ బ్యూటీ కథానాయకికి ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఓ బేబీ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందన్న మాట. -
ఓ బేబీ షాకిచ్చింది!
నటి సమంత నటించిన తాజా చిత్రం ఓ బేబీ. ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశంతో కూడిని చిత్రం. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా సమంతకు తొలి సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం ఇదే అవుతుంది. ఇంతకు ముందు యూటర్న్ చిత్రంలో అలాంటి పాత్రను పోషించినా, అది ఆశించినంతగా సక్సెస్ కాలేదు. మొత్తం మీది నయనతార, అనుష్కల మాదిరి సమంత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల పట్టికలో చేరిపోయారు. అదేవిధంగా అంతకుముందు తన భర్త నాగచైతన్యతో నటించిన మజిలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇంతకంటే మంచి తరుణం రాదనో ఏమో! పారితోషికాన్ని అమాంతం పెంచేశారట. బాలీవుడ్‌ను పక్కన పెడితే ఇప్పటి వరకూ దక్షిణాదిలో అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న నటిగా నయనతార నిలిచారు. ఈ అమ్మడు చిత్రానికి అక్షరాలా రూ.5 కోట్లు పుచ్చుకుంటున్నారని సమాచారం. తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా దర్బార్, విజయ్ సరసన బిగిల్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తరువాత అధిక పారితోషికం తీసుకుంటున్న లిస్ట్‌లో నటి అనుష్క నిలిచారు. ఈ బ్యూటీ రూ.4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఆ తరువాత కాజల్‌అగర్వాల్, సమంత, తమన్నా వంటి తారలు పారితోషికం అందుకుంటున్నారు. కాగా నటి సమంత ఇప్పటి వరకూ రూ.2 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటోందని, దాన్ని ఓ బేబీ హిట్ తరువాత ఏకంగా రూ.3 కోట్లకు పెంచేసిందని సినీ వర్గాల్లో టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఓ బేబీ చిత్రం భారత దేశంలోనే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాల్లోనూ కలక్షన్ల మోత మోగిస్తోందట. సాధారణంగా ఒక చిత్రం హిట్ అయితేనే పారితోషికం పెంచేస్తున్న ఈ రోజుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న సమంత పారితోషికం పెంచడంలో ఆశ్చర్యం ఉండదనుకుంటా. అయితే పెళ్లి తరువాత హీరోయిన్గా కొనసాగడం ఒక ఎత్తు అయితే, సక్సెస్‌లు వరించడం మరో ఎత్తు. ఎందుకంటే నయనతార, కాజల్‌అగర్వాల్ వంటి తారలే వివాహం అయితే మార్కెట్ తగ్గిపోతుందనే భయంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. సమంత మాత్రం ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని కథానాయికిగా, అదీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. తన మార్కెట్‌కు ఎలాంటి డోకా లేకపోవడంతో పారితోషికాన్ని పెంచేసి నిర్మాతలకు అలా షాక్ ఇచ్చారు ఓ బేబీ. ప్రస్తుతం ఈ భామ 96 రీమేక్‌గా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. -
వన్ బకెట్ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ చాలెంజ్ ఫేమస్ అవుతుందో చెప్పలేము. నిన్నటి వరకు బాటిల్ క్యాప్ చాలెంజ్ నడిచింది. తాజాగా సమంత ఓ వినూత్న చాలెంజ్‌ను విసిరారు. నీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీటి కష్టాలను తీర్చేందుకు రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోంది. చెన్నైలో నీటి కష్టాలకు అక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కూడా వాటర్ లేవు అంటే అక్కడి పరిస్థితి అర్థమవుతోంది. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు కానీ.. నీటి నిల్వలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకూడదని.. నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు. అందుకోసం వన్బకెట్ చాలెంజ్‌ను స్వీకరించాలని సమంత పేర్కొన్నారు. ఈ చాలెంజ్‌పై అడివి శేష్ కూడా స్పందించాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Ready 🙌 #onebucketchallenge pic.twitter.com/MlERG6MK2m — Samantha Akkineni (@Samanthaprabhu2) July 21, 2019 -
నలుగురు ఓహ్ బేబీలు
జీవితం అరిగిపోయిందని.. సారం కరిగిపోయిందని.. స్వప్నం చెదిరిపోయిందని.. ఆశ ఇంకిపోయిందని.. అవకాశం ఆవిరైపోయిందని.. నడివయసు నైరాశ్యం నుంచి బయటపడ్డ నలుగురు ఓహ్.. బేబీల కథ ఇది!! బేబీకి డెబ్బై ఏళ్లు. మంచి గాయని కావాలనేది చిన్నప్పటి నుంచీ ఉన్న లక్ష్యం. సంగీతమూ నేర్చుకోవడానికి వెళ్తుంది. కాని సంప్రదాయ కుటుంబంలోని తండ్రి.. పాటలుగీటలు అంటూ ఆడపిల్ల బయటకు వెళ్లడమేంటంటూ ఆమె చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెడ్తాడు. తండ్రిని ఏమీ అనలేక దేవుడిని తిట్టుకుంటుంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లిచేసుకొని అయినా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంటుంది. కాని పెళ్లయిన యేడాదికే భర్త చనిపోతాడు. అనుకున్న జీవితం అటకెక్కి.. అనుకోని కష్టం ముందు పడ్తుంది. వంటలు చేసుకుంటూ కష్టపడి పిల్లాడిని పెంచి పెద్దచేస్తుంది. అతనికీ పెళ్లయి.. పిల్లలు పుడ్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న బాధ్యతల్లో తనను ముంచుతున్న దేవుడిని తిట్టుకోవడం తప్ప బేబీకి తనకంటూ ఏమీ మిగిలి ఉండదు. గాయని కావాలనుకున్న.. కావాలన్న తపన మెదడు అట్టడుగుపొరల్లో రగులుతూనే ఉంటుంది. లైఫ్పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంటుంది. అప్పుడు దేవుడు ఆమెకు ఓ అవకాశం ఇస్తాడు.. డెబ్బై ఏళ్ల ఆ ముసలావిడకు ఇరవై ఏళ్ల యవ్వనాన్నిస్తాడు. నచ్చినట్టు బతుకుతూ అనుకున్నది సాధించమని ఆశీర్వదిస్తాడు. ఆ బేబీ గాయని అవుతుంది. ఇది ‘‘ఓహ్.. బేబీ’’ సినిమా సారాంశం క్లుప్తంగా! రియల్‌లైఫ్‌లో బేబీ లాంటి వాళ్లు చాలామందే ఉంటారు. ఎటొచ్చీ ఆమెకు దొరికిన వరమే.. ప్రాక్టికల్‌గా అసాధ్యం. అయినా రెండు జీవితాలు అనుభవించిన, ఆస్వాదించిన వాళ్లుంటారు.. ఉన్నారు కూడా. పెళ్లి, పిల్లల పెంపకంతో తమ ఆశలు,ఆశయాలు ఆవిరైపోకుండా.. హ్యాండ్‌బ్యాగ్‌లో అట్టేపెట్టుకొని.. మూడుముళ్ల బంధం ముడి వేసిన కర్తవ్యాన్ని నిర్వర్తించాక ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను భుజానికి, అందులోని ధ్యేయాన్ని మనసుకు బదిలీ చేసుకొని సా«ధించిన అమ్మల గురించే ఈ కథనం.. గోల్స్ అంటే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం, ఫ్రీదా ఖాలో అంతటి ఆర్టిస్ట్ అవడం, ఇంగ్లిష్ చానల్ ఈదడం, ప్రపంచమంతా పాదయాత్ర చేయడం, క్లియోపాత్ర కిరీటాన్ని పెట్టుకోవడం, టాటా, బిర్లా, అంబాని, అదానీలకు దీటుగా వ్యాపారం చేయడం లాంటివే కానఖ్ఖర్లేదు కదా... చిన్నప్పటి నుంచీ తాము అనుకున్నవి మ్యారేజ్ వల్ల దారి తప్పి.. మళ్లీ వాటి జాడను పట్టుకొని గాడిలో పెట్టుకునేవి కూడా కదా! అలాంటి వాటినే అఛీవ్ చేసిన రియల్ లైఫ్ ఓహ్ బేబీలు వీళ్లు... మిసెస్ ఫొటోజెనిక్.. కుంభం రేణుక కుంభం రేణుక వయసు నలభై పైనే. పుట్టింది తెలంగాణలోని సిద్ధిపేటలో.. పెరిగింది కరీంనగర్లో. రేణుకను డాక్టర్ చెయ్యాలని ఆమె తండ్రి అనుకున్నారు. రేణుకకేమో అందాల పోటీల్లో పాల్గొనాలని, ఒక్కసారైనా ర్యాంప్ మీద నడవాలనే ఆకాంక్ష. కాని ఆమె సంప్రదాయ కుటుంబం ఆ కోరకను కనీసం ఆమె కలలోకి కూడా రానివ్వకుండా మెడిసిన్ ఎంట్రన్స్ కోసం కోచింగ్‌కు పంపించింది. కష్టపడ్డా ఫలితం దక్కలేదు. దాంతో బీఎస్సీ మైక్రోబయాలజీలో చేరింది. అప్పుడే మంచి సంబంధం రావడంతో వెంటనే పెళ్లిచేసేశారు. అయినా చదువును కంటిన్యూ చేశారు రేణుక. భర్త కుంభం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. తరచూ ట్రాన్స్ఫర్స్ అవుతూన్నా చదువుకి ఫుల్స్టాప్ పెట్టలేదు. అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరికా పోలేదు. పిల్లలు పుట్టారు. పెద్దవాళ్లవుతున్నారు. టీవీల్లో బ్యూటీ కాంటెస్ట్‌లు ఎప్పుడు టెలికాస్ట్ అయినా ఆసక్తిగా చూసేవారు. వయసు రీత్యా కాస్త ఒళ్లు రావడంతో శ్రద్ధగా వ్యాయామం చేసి బరువు తగ్గారు. యోగాలో తర్ఫీదు తీసుకున్నారు.దాంతో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనలియర్‌కు వచ్చాక.. తల్లి ఇంట్రెస్ట్ గమనించి మిసెస్ కర్ణాటక బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనమని ఎంకరేజ్ చేశాడు. ఆ పోటీలకు సంబంధించిన వివరాలు, సమాచారం అన్నీ సేకరించి తల్లికిచ్చాడు. దరఖాస్తు చేసుకున్నాక తన భర్తకు చెప్పారు రేణుక. సరే అన్నారు ఆయన. భర్త, పిల్లల ప్రోత్సాహంతో మాగ్నా పబ్లికేషన్స్ నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లోనూ (ఇటీవలే) పార్టిసిపేట్ చేశారు. ఫైనల్స్‌కు చేరి మిసెస్ ఫొటోజెనిక్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు. చిన్నప్పటి కల నెరవేర్చుకున్నారు. రేణుక సుప్రసిద్ధ చిత్రకారుడు కాపు రాజయ్య మనవరాలు. ‘‘మా తాత గొప్ప ఆర్టిస్ట్ అయినా నా మీద మా అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఆవిడ చాలా స్ట్రాంగ్. పట్టుదల మనిషి. అమ్మమ్మే నాకు ఇన్సిపిరేషన్. మన సంకల్పం గట్టిదైతే పెళ్లి, పిల్లలు హార్డిల్స్ కావు, కారు. అఫ్కోర్స్.. ఆ రెస్పాన్సిబిలిటీస్తో మన ఎయిమ్ వెనకబడొచ్చు.. తర్వాత పర్స్యూ చేసుకోవాలి. లేకపోతే మనకు మనం మిగలం. మనల్ని మనం ప్రేమించుకోవాలి. నేను బ్యూటీకాంటెస్ట్లో పోటీ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా మంది చాలారకాలుగా కామెంట్ చేశారు. పట్టించుకోలేదు. విని ఉంటే నా కలను ఎక్స్‌పీరియెన్స్ చేసేదాన్నే కాదు. ఆ పోటీలో పాల్గొనడం వల్ల కొత్త ప్రపంచం తెలిసింది. చాలా మంది పరిచయం అయ్యారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఒక కొత్త రేణుకను చూసుకోగలుగుతున్నా. ప్రస్తుతం నా ఇంకో ఎయిమ్ మీద దృష్టిపెట్టా.. అదే యోగా ట్రైనింగ్. చాలామంది ఆడవాళ్లు పెళ్లి, పిల్లలు కాగానే అంతా అయిపోయిందని తమని తాము పట్టించుకోరు. అలాంటి వాళ్లను మోటివేట్ చేసి వాళ్లలో హెల్త్ కాన్షస్ తీసుకురావాలనుకుంటున్నా. ఓ నలుగురిని మోటివేట్ చేయగలిగినా..నేను హ్యాపీ’’ అంటారు కుంభం రేణుక. ఆర్టిస్ట్.. నానుబాల భారతి నానుబాల భారతి బార్న్ ఆర్టిస్ట్. స్వస్థలం కడప. ఉగ్గుపాలతో ఒంటబట్టిన కళ. భారతి వాళ్లమ్మ కూడా ఆర్టిస్టే. ఆమె ఆయిల్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తుంటే చూస్తూ పెరిగారు భారతి. అందుకే చిన్నప్పుడే బొమ్మలు వేయడం వచ్చేసింది ఆమెకు. స్వతహాగా అబ్బిన కళ, తల్లిని చూస్తూ పెంచుకున్న నైపుణ్యంతో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయ్యే సరికి ఆమె ఆర్ట్‌కు ఓ గుర్తింపూ వచ్చింది. ఆ ప్రవృత్తిని సీరియస్‌గా తీసుకోవాలి అనే సమయానికి పెళ్లి అయిపోయింది. భర్త గండికోట రమేశ్‌కు సౌదీలో ఉద్యోగం. కొత్త చోటు, ఆమె పాతబడడానికే చాలా కాలం పట్టింది. ఈలోపు పిల్లలు. అందరి తల్లుల్లాగే ఆమెకూ పిల్లలే ప్రాధాన్యమయ్యారు. అక్కడి నుంచి భర్త ఉద్యోగం దుబాయ్‌కు మారింది. కాని ఆమె ప్రయారిటీస్ మారలేదు. కాన్వాస్, కుంచె రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. పాప యుక్తా ఫ్యాషన్ స్టడీస్‌లో డిగ్రీ, బాబు హేమంత్ ట్వల్త్ స్టాండర్డ్లోకి రావడంతో భారతికి కాస్త ఖాళీ సమయం దొరికింది. ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఆ ఉత్సాహం, భర్త ప్రోత్సాహంతో మళ్లీ కుంచెకు కళ తెచ్చారు భారతి. అందమైన ఆయిల్ పెయింటింగ్స్‌తో తన ఉనికిని చాటుకుంటున్నారు. త్వరలోనే ఎగ్జిబిషన్ పెట్టాలనే ప్లాన్‌లోనూ ఉన్నారు. బొమ్మలే కాదు.. డ్రెస్, జ్యుయెలరీ డిజైనింగ్కీ భారతి క్రియేటివిటీని కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. ‘‘పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే ఆర్టిస్టే అనుకునేదాన్ని. అదే నా లోకం. అయితే ఆడవాళ్లు అనుకున్నది సాధించాలంటే ముందు వైఫ్‌గా, మదర్‌గా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతే మన గోల్. తప్పదు.. మన ప్రయార్టీస్ అలా సెట్ అయ్యుంటాయి. ఇప్పటికైనా పర్స్యూ చేసుకునే చాన్స్ వచ్చింది. మావారూ మంచి ఆర్టిస్టే. సో.. అర్థంచేసుకొని.. ఎంకరేజ్ చేస్తున్నారు’’ అంటారు భారతి. బైక్ రైడర్.. కూర్మ నాగమణి కూర్మ నాగమణి.. వయసు.. అరవై. స్వస్థలం హైదరాబాద్. బైక్ రైడింగ్ అండ్ పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచీ ఇంట్రెస్ట్. భర్త సహకారంతో పాలిటిక్స్‌లో అడుగుపెట్టి కౌన్సిలర్‌గా పనిచేశారు. కాని బైక్ రైడింగే తనకు అరవయ్యో యేడు వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కళ్లముందు రయ్‌మంటూ టూ వీలర్స్ వెళ్తూంటే మనసు కొట్టుకునేది.. నడపాలని. కాని సాధ్యపడలేదు. పెళ్లయ్యాక కూడా ఆమె బండీ నడపాలనే కాంక్షను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు ఆమె రాజకీయాల్లోకి రావాలనే ఇష్టాన్ని పట్టించుకున్నంతగా. నలుగురు పిల్లలు (ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పుట్టారు. వాళ్లూ బండి నేర్చుకున్నారు.. ఆమెకు ఆ అవకాశం రాలేదు. పెళ్లిళ్లయి కోడళ్లు, అల్లుడు వచ్చారు. స్థిరపడ్డారు. ఈలోపు ఆమె అరవయ్యోపడిలో పడ్డారు. అప్పుడు ఇక ఆగలేదు. ఈ వయసులో బండి ఏంటమ్మా అని లర్నింగ్ లైసెన్స్ కోసం వెళ్లిన ఆమెను ఆర్టీఓ సిబ్బంది నిరాశ పర్చినా రివర్స్ గేర్ వేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని.. హార్డిల్ పెట్టినా.. దాటేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చారు.. లర్నింగ్ లైసెన్స్ పొందారు. తాను బండీ నడపడమే కాక.. తన ఈడువాళ్లనూ ఎంకరేజ్ చేస్తున్నారు నేర్చుకొమ్మని. ‘‘పనులకు ఆడ, మగ తేడా ఉంటదా? ఉండదు. ఈత రావడం ఎంత అవసరమో డ్రైవింగ్ కూడా అంతే అవసరం. ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా! నా ఈడు వాళ్లు కొంతమంది ముందు భయపడ్డారు. నేనే నేర్చుకోగాలేంది మీకు రాదా? అని వాళ్ల భయం పోగొట్టిన. మన పనులు మనం చేసుకుంటే ఎంత ఆనందం! ఎటైనా వెళ్లాలంటే ఇప్పుడు ఎవరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు.. బండీ తీసి కిక్ కొడితే చాలు. కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటా’’ అంటారు ఎంతో ఆత్మవిశ్వాసంతో నాగమణి. వీ స్టార్.. షీలా జోసెఫ్ షీలా జోసెఫ్. వయసు అరవై పైనే. స్వస్థలం కేరళ. బిజినెస్‌లో రాణించాలనేది చిన్నప్పటి నుంచీ వెంటాడుతున్న కల. టీన్స్‌లోనే పెళ్లయిపోయింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలు షరామామూలే. భర్త యోసెఫ్.. వీ గార్డ్ సంస్థ యజమాని. పిల్లలు స్థిరపడ్డాక.. మనసులో మాట బయటపెట్టారు షీలా భర్త దగ్గర. ‘‘వేరే ఎందుకు నాకే తోడుగా ఉండు నా వ్యాపారంలో’’ అన్నాడు భర్త. అతని మాట ప్రకారమే కొన్నాళ్లు ఆ బిజినెస్ వ్యవహారాల్లో భర్తకు తోడుగా ఉన్నారు. కాని అది ఆమెకు నచ్చలేదు. ఆమెకు గార్మెంట్ బిజినెస్ అంటే ఇష్టం.. ఇంట్రెస్టునూ. సొంతంగా పెట్టుకుంటాను అంది. భర్త దగ్గరే వడ్డీకి 20 లక్షలు అప్పు, భర్త పాత ఆఫీస్‌నే అద్దెకు తీసుకున్నారు. పది మంది ఉద్యోగులతో పని ప్రారంభించారు. ఏడాది తిరిగేలోపు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. భర్తకు వడ్డీ, రెంట్ కట్టలేని పరిస్థితి. ఇలా కాదని ఆ రేడీమేడ్ బట్టలను ఎప్పుడో తన భర్త రిజిస్టర్ చేసుకున్న వీ స్టార్ అనే లేబుల్ కింద అమ్మడం మొదలుపెట్టారు. కొత్తలో కొంత కష్టమైనా తర్వాత సాఫీగా సాగింది. అయితే వీ స్టార్‌ని భర్త ఎలక్ట్రికల్స్ కంపెనీ అయినా వీ గార్డ్‌కు సిస్టర్ ఆర్గనైజేషన్ అనుకునేవారట వీ స్టార్ఎంప్లాయ్స్. దాంతో ఆమె వీ గార్డ్ కంపెనీ ఉద్యోగులకు సమానమైన జీతాలను తన ఉద్యోగులకూ ఇవ్వాల్సి వచ్చిందట. తర్వాత వీ స్టార్ అండర్‌గార్మెంట్స్ ప్రొడక్షన్నూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే ఆ కంపెనీ యూఎస్పీ అయింది. స్త్రీల అండర్గార్మెంట్స్కి సంబంధించి వీ స్టార్ ఇప్పుడొక పాపులర్ బ్రాండ్. రెండు కోట్లతో మొదలై ఇప్పుడు 75 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరింది. ఇది మొదలుపెట్టిన నాలుగేళ్లలో భర్త దగ్గర తీసుకున్న అప్పు తీర్చేశారు షీలా.. వడ్డీతో సహా. ‘‘కలలు.. మనలో చాలెంజింగ్ స్పిరిట్‌ను నిద్రలేపుతాయి. అదే ముఖ్యం. పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలు కూడా మన చాలెంజింగ్ స్పిరిట్‌ను స్ట్రాంగ్ చేసేవే అని నమ్ముతాను’’ అంటారు షీలా. దేవుడు వరమివ్వకపోతేనేమి.. కాలం అవకాశం ఇచ్చింది.. కల నెరవేర్చుకొమ్మని. ఇంకా యవ్వనవంతులమనే నిరూపించుకున్నారు లక్ష్యాన్ని చేరి! ‘‘ఓహ్.. బేబీ’’కే స్ఫూర్తిలా! – సరస్వతి రమ -
బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’!
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. దీంతో ఓ బేబీని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పాత్రకు కంగనా లేదా అలియా భట్ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావూ రమేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీ, తేజలు కీలక పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాళికి యవ్వనం తిరిగి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి. ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
అందుకు ‘ఓ బేబీ’కి ఓకే చెప్పేశా : నాగశౌర్య
‘‘ఓ బేబీ’ చిత్రంలో నాది అతిథి పాత్ర అని చెప్పినా నందినీ రెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మీగారు ఉన్నారు. ‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి ఆమెతో పని చేయాలనుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అనుకున్నా కుదరలేదు. ‘ఓ బేబీ’ తో కుదిరింది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. సమంత, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో బి.వి. నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ♦ హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడం ఇబ్బందిగా లేదు. నాకు నచ్చిన వారితో సినిమా చేయడం చాలా ఇష్టం. నందినీరెడ్డిగారు నాకు అక్కలాంటివారు. ఈ సినిమా గురించి ఆమె నాకు చెప్పడానికి సందేహిస్తుంటే మా అమ్మ ఒత్తిడి చేసి నాకు చెప్పించింది. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అనిపించి, ఇందులో నేనూ భాగం కావాలనుకున్నా. ♦ తొలుత నాది అతిథి పాత్రే అనుకున్నా. సెట్లోకి వెళ్లాక ఫుల్ లెంగ్త్ అయింది. లక్ష్మీగారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం నేను, సమంతగారు అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించాను. ఆ తర్వాత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు. నా సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్‌కి దూరంగా ఉంటున్నా. కానీ, తప్పదంటే మాత్రం చేస్తా. ♦ ఈ సినిమాలో నా లుక్ బాగుందని అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా? అనిపించింది (నవ్వుతూ). సమంత గారితో పని చేస్తున్నప్పుడు నేను పెద్ద హీరోయిన్‌తో పని చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఈ సినిమాలో ఆమె ముఖం మీద ఉమ్మివేసే సీన్ ఉంటుంది. నేను ఆ పని చేస్తే బయట అందరూ నా మీద ఉమ్మేస్తారనుకున్నా. కానీ ఆమె డెడికేటెడ్ వ్యక్తి. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేశా. ♦ ప్రస్తుతం మా ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ చేస్తున్నా. అదే విధంగా ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది. రిస్క్ చేయడం వల్ల ఇటీవల గాయపడ్డానని అంటున్నారు. అంత రిస్క్ అవసరమే. అది 14 నిమిషాల సీను. డూప్‌ని పెడితే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో పడే టెన్షన్ వాళ్లూ పడాలంటే నేనే కష్టపడాలని అర్థమైంది.. అందుకే రిస్క్ చేసి నేనే చేస్తున్నా. -
సీక్రెట్ టాటూ రివీల్ చేసిన సమంత!
వివాహానంతరం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరోయిన్ సమంత. వైవిధ్యమైన పాత్రలు ఎన్నుకుంటూ నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. నిజానికి పెళ్లి తర్వాతే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఆమెను ఎక్కువగా వరిస్తున్నాయి. ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్.. శుక్రవారం విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వసూళ్లలో దుసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సమంత వైట్‌డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఈ క్రమంలో ఫొటోషూట్‌లో పాల్గొన్న సమంత సోషల్‌మీడియా వేదికగా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ‘ అత్యుత్తమ జీవితాన్ని గడుపుతున్నాను... ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న టాట్టూను రివీల్ చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో... సామ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. లక్షల్లో లైకులు సాధిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. View this post on Instagram Living my best life ...😎... (the only tattoo that I’ve been hiding finally on display 🤪) @chayakkineni my husband my world ❤️ A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Jul 7, 2019 at 9:11am PDT -
‘ఓ బేబి’ సక్సెస్ మీట్
-
సమంతా.. ఏ టైంలో పుట్టావమ్మా!
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ మూవీ ఈ శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్‌లో సమంతదే కీలక పాత్ర కావటంతో సినీ ప్రముఖులు, విమర్శకులు సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన నటనతో బేబీ పాత్రకు సమంత ప్రాణపోశారంటూ తెగపొగిడేస్తున్నారు. అయితే చార్మీ మాత్రం ఓబేబీపై విభిన్నంగా స్పందించారు. ఓ బేబీ విజయం సాధించినందుకు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన చార్మీ ‘ఏ టైంలో పుట్టావమ్మా నువ్వు సమంతా. నీ హర్డ్ వర్క్, నీ నిర్ణయాలు ఇంకా నీ జాతకానికి ఓ నమస్కారం. నందిని రెడ్డికి ఓ బేబీ టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సమంత, చార్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు. Ye time lo puttaavu Amma nuvvuu 😍🥰 @Samanthaprabhu2 Nee hard work , nee decisions and nee jatakam ki namaskaaram 🙏🏻🙏🏻🙏🏻 #samrocks #OhBabyRocks 👌🏻👌🏻 Very happy for @nandureddy4u n complete team too 🤩🙌🏻🥳 — Charmme Kaur (@Charmmeofficial) 5 July 2019 -
రెండో కర్తవ్యంలో సమంత
‘యు టర్న్, సూపర్ డీలక్స్, మజిలీ’ తాజాగా ‘ఓ బేబీ’... ఇలా సమంత సక్సెస్ మంచి పీక్స్‌లో ఉంది. సినిమా ఎంపిక, కథలోని పాత్రల్లో ఆమె ఒదిగిపోయే తీరు ప్రేక్షకులకు భలేగా నచ్చుతున్నాయి. ఇప్పటికే మహానటి, రంగస్థలం, యు టర్న్ చిత్రాల్లోని నటనకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్న సమంత ‘ఓ బేబీ’లో విజృంభించారు. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సమంత లేటెస్ట్ చాయిస్ అని పలువురు దర్శక–నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో సమంతతో ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) దర్శకుడు గోపీ నాయర్ ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి ట్రై చేస్తున్నారట. అయితే... సమంతతో గోపీ తెరకెక్కించబోయే సినిమా కొత్త కథనా? లేక ‘ఆరమ్’ సీక్వెల్‌నా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
‘ఓ బేబీ’ని సీక్రెట్‌గా చూసిన సమంత
సెలబ్రెటీలు బయట కనిపిస్తే అభిమానులు చేసే హంగామా గురించి తెలిసిందే. అలాంటిది ఓ పెద్ద సినిమా రిలీజైతే అక్కడి థియేటర్‌కు హీరో, హీరోయిన్లు వెళ్లే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా విడుదలైన ఓ బేబీ చిత్రం పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ సమయంలో ఓ థియేటర్‌కు సీక్రెట్‌గా వెళ్లి సినిమాను వీక్షించినట్లు సమంత ట్వీట్ చేశారు. తాను ఎవరకీ తెలియకుండా సినిమాను చూశానని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘ దేవీ థియేటర్లో ఓ బేబీ చిత్రాన్ని ఎవరికీ తెలియకుండా చూశాను. సినిమా చేస్తున్న ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూడాలంటే ఆ మాత్రం చేయాలి. ఇదే నా స్ఫూర్తి. థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, నాగశౌర్య ప్రధాన పాత్రల్లో నటించారు. #OhBaby Visited #Devi today without anyone knowing . The sound of laughter from the audience makes everything worth it .. this is everything .. my inspiration . Thankyou ❤️ #singlescreen #euphoria — Baby Akkineni (@Samanthaprabhu2) July 6, 2019 -
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
-
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓ బేబీ జానర్ : ఫాంటసీ కామెడీ డ్రామా తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్, తేజ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : నందినీ రెడ్డి నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యూన్వూ థామస్ కిమ్ పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్టైనింగ్ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బేబీ పాత్రలో సమంత మెప్పించారా? కథ : సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి తరువాత సక్సెస్ వేటలో వెనుకపడ్డారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత సమంత ప్రధాన పాత్రలో కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్ లేడీ ఓరియంటెడ్ సినిమాల తరహాలో కాకుండా ఓ ఫన్ రైడ్‌లా సినిమాను తెరకెక్కించిన నందిని సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సూపర్బ్‌గా వర్క్ అవుట్ అయ్యింది. తొలి భాగాన్ని ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకురాలు ద్వితీయార్థం ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో నడిపించారు. ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గటం, కథనం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సాగడంతో సెకండ్ హాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. సినిమాకు మరో ప్రధాన బలం లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు. డైలాగ్స్ నవ్వులు పూయిస్తూనే, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడనే చెప్పాలి. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కపాట కూడా లేకపోవటం నిరాశపరిచే అంశమే. నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్ఫుల్గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌కు కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత పర్ఫామెన్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాప్ లెంగ్త్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
బేబీ డాల్
-
సమంత కటౌట్‌పై ఫన్నీ కామెంట్
క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ అభిమాని ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘ మా స్నేహితుడు ఈ కటౌట్‌ను తన జిమ్ అడ్వర్టైజ్ కటౌట్‌గా వాడుకోవచ్చా. కొద్దిగా గ్రాఫిక్స్‌లో కండలు కనిపించేలా చేసి. మీ వీరాభిమాని అయిన అతను మా ఊళ్లో జిమ్ నడుపుతున్నాడు. మీరేమంటారు’ అంటూ కామెంట్ చేశాడు. వెంటనే స్పందిచిన సమంత ‘బేబీ ఆన్ స్టెరాయిడ్స్’ అంటూ రిప్లై ఇచ్చారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమాలో సమంతతో పాటు నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు కీలక పాత్రల్లో నటించారు. యు సర్టిఫికేట్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Baby on steroids 😂😂😂 https://t.co/iOkPJNcXWs — Baby Akkineni (@Samanthaprabhu2) 4 July 2019 -
‘నాగశౌర్య.. వాడో వేస్ట్ ఫెలో’
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర చంటి.. యాక్చ్యువల్‌గా లక్ష్మీగారికి గానీ, సమంతకి గానీ బాయ్‌ఫ్రెండ్‌ని నేనే. ఊరికే నాగశౌర్య కాళ్లు అవి ఇరగొట్టుకొని నేను బాయ్‌ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంటాడు గానీ, వాడు వేస్ట్ ఫెలో. ఆల్ రెడీ కాళు విరగొట్టుకొని వచ్చాడు కూడా’ అంటూ నవ్వులు పంచారు. ఇదే వేదిక నుంచి సినిమా షూటింగ్ సమయంలో తనపై వచ్చిన రూమర్స్‌కు సమాధానమిచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఓ బేబీ షూటింగ్ స్పాట్‌కు రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఆ సీన్‌కు సంబంధించిన మూడ్‌ను క్యారీ చేస్తూ సెట్లో అలా ఉన్నానే గానీ 42 సంవత్సరాల సినీ కెరీర్లో తానెప్పుడూ తాగి రావటం లాంటి పనులు చేయలేదని చేయబోనని చెప్పారు. -
‘సమంత’ర రేఖ
సమాంతర రేఖలు కలవవు.. కానీ ఆ పట్టాల మీదే జీవిత రైలు నడుస్తుంది. కమర్షియల్ సినిమా ఒక రేఖ అయితే.. సమాంతర సినిమా రెండో రేఖ. పాటలు పాడుతూ కమర్షియల్ సినిమాలు చేసిన సమంత ఇప్పుడు తనలోకి తనే తొంగి చూసుకుంటోంది. మనందరిలోనూ ఈ రేఖలు ఉండాలి. ఒకటి.. అందరి కోసం... ఒకటి... మన కోసం. పెళ్లికి ముందు సక్సెస్‌లు చూశారు. తర్వాత రంగస్థలం, మహానటి, యు టర్న్, మజిలీ.. ఇలా వరుస విజయాల ఈ సక్సెస్ రైడ్ గురించి? సక్సెస్ రైడ్ అనేది వినడానికి బాగుంది. కానీ ప్రెషర్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మన గత సినిమా కంటే నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ బావుండాలి. అప్పుడే ఈ రైడ్ కంటిన్యూ అవుతుంది. అందుకే ఏది పడితే అది అంగీకరించ కూడదనుకున్నా. దీనివల్ల చేసే సినిమాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయితే క్వాలిటీ సినిమాలు మాత్రమే బయటకు వస్తాయి. సంఖ్య తగ్గినా ఫర్వాలేదనుకుంటున్నా. ఒకప్పుడు ఏడాదికి ఒకటో రెండో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వచ్చేవి. మహానటి, యు టర్న్, ఇప్పుడు మీరు నటించిన ‘ఓ బేబి’.. తెలుగులో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయనుకోవచ్చా? అనుకోవచ్చు. అయితే ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ కొన్నిసార్లు ఒక్క సెక్షన్‌కే రీచ్ అవుతున్నాయి. అలా కాకూడదని కోరుకుంటున్నాను. ఉదాహరణకు ‘మహానటి’ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్. ఆ తర్వాత నేను ‘యు టర్న్’ చేశాను. ఆ సినిమా అనుకున్నంత కలెక్ట్ చేయలేదు. కానీ తక్కువ కలెక్షన్లు వచ్చాయని మనమెప్పుడూ ఆడియన్స్‌ను నిందించకూడదు. యూనివర్శల్ సబ్జెక్ట్స్ చేయాలి. ‘యు టర్న్’ మంచి సినిమానే. రివ్యూలు బావున్నాయి కదా, ఎందుకు కలెక్షన్స్ రాలేదు? అంటే థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ నంబర్ తక్కువ ఉండొచ్చేమో. ఆ సినిమా నుంచి నేనేం నేర్చుకున్నానంటే.. అందరూ చూసే కథలతో సినిమాలు చేయాలని. ఇప్పుడు నేను చేసిన ‘ఓ బేబీ’ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. మంచి కామెడీ, చక్కని ఎమోషన్స్ ఉన్నాయి. వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ‘మనల్ని ఈ జానర్‌కే పరిమితం చేస్తారేమో? హీరోలు మనల్ని పక్కన పెట్టేస్తారేమో?’ అనే భయాలు ఉంటాయా? హీరోల గురించి ఆలోచించకుండా మన దారి మనమే సెట్ చేసుకోవాలి. కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో కమర్షియల్ సినిమాలు చేయాలి. ఓ పేరు సంపాదించుకోవాలి. హీరోయిన్గా పదేళ్లు అయిపొయ్యాక కూడా అదే పాటలు.. అవే డ్యాన్సులు అంటే యాక్టర్‌గా కచ్చితంగా నిరాశ చెందుతాం. ఇన్ని సినిమాలు చేశాక ఇంకా అవే కమర్షియల్ చేస్తూ ఉంటే కేవలం డబ్బు కోసమే నేను సినిమాలు చేసినట్టు ఉంటుంది. అప్పుడు నాకు నేనే రోబోలా అనిపిస్తాను. ప్యాషన్ లేకుండా వర్క్ చేస్తున్న ఫీలింగ్ నాకు వస్తుంది. అందుకే దారి మార్చాలనుకున్నాను. మరి.. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా అంటే.. ఇండస్ట్రీకి రావడం రావడమే ‘సోలో’ ఫిల్మ్స్‌కి అవకాశం తక్కువ. తక్కువ అంటే.. లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే క్రేజ్ ఉన్న హీరోయినే చేయాలంటారా? కావొచ్చు. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకు రావాలి కదా. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీకి ఆడియన్స్‌ని లాగేంత కెపాసిటీ హాలీవుడ్లో ఉంటుంది. ఇక్కడ కూడా అలా జరగాలి. అయితే ఇంకా టైమ్ పడుతుందనుకుంటున్నాను. కొరియన్ సినిమా ‘మిస్. గ్రానీ’కి ‘ఓ బేబి’ రీమేక్. ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? మన తెలుగు సినిమా చూస్తున్నట్టే అనిపించింది. కొరియన్ వాళ్ల ఎమోషన్స్, కల్చర్, ఫ్యామిలీ ఇవన్నీ మన కల్చర్‌కు దగ్గరగా అనిపించాయి. వెంటనే కనెక్ట్ అయ్యాను. కథలో ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టే ఈ సినిమాను ఏడు భాషల్లో రీమేక్ చేశారు. డిస్నీ సినిమాలు అందరికీ కనెక్ట్ అవుతాయి కదా. ఈ సినిమా కూడా డిస్నీ సినిమాలానే ఉంటుంది. ‘ఓ బేబీ’లో వృద్ధాప్యంలో ఉన్న మీ పాత్రకు మళ్లీ యవ్వనంలోకి వచ్చేలా మేజిక్ జరుగుతుంది. లైఫ్‌లో మళ్లీ వెనక్కి వెళ్లే చాన్స్ వస్తే ఏదైనా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటారా? అలాంటిది ఏమీ లేదు. జరిగిన ప్రతిదీ మన మంచికే జరిగింది అనుకుంటాను. దేనికీ రిగ్రెట్ ఫీల్ అవ్వను. నాకు జరిగిన ప్రతిదీ ఇవాళ నన్ను ఓ స్ట్రాంగ్ పర్సన్‌గా తయారు చేసిందనే నమ్ముతాను. తప్పు జరిగితేనే ఒప్పు ఏంటో తెలుసుకుంటాం. అందుకే ఏదీ మార్చదలచుకోవడం లేదు. నాకు యాక్టింగ్‌లో గురువులు ఎవరూ లేరు. నేను చేసిన ప్రతీ సినిమా ఏదోటి నేర్పింది. తప్పు చేస్తే అందులో నుంచి ఓ పాఠం వస్తుంది. ఆ పాఠం భవిష్యతులో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందనుకుంటా. ‘ఓ బేబీ’ సినిమాకు ఎక్కువ మంది ఉమెన్ పని చేయడం ఎలా అనిపించింది? రిలీజ్‌కు మూడు నెలల ముందే సినిమా రెడీ అయింది. ఒక్కరోజు షూటింగ్ కూడా ఆలస్యం కాలేదు. వాయిదా పడిన సందర్భాలూ లేవు. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. నిజం చెప్పాలంటే మేం సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాం ఎప్పుడు పూర్తి చేశామో కూడా చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలో మా (ఉమెన్) సంఖ్య చాలా తక్కువ. నిజానికి మెన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కష్టపడతాం. ఒక అమ్మాయికి పని చెబితే అది పూర్తయిందా? లేదా అని ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు. పని జరిగిపోతుంది. డైరెక్టర్ నందినీరెడ్డితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నా నెక్ట్స్ సినిమాకు కూడా వీళ్లను నా సినిమా సెట్లో ఉండేలా చూసుకుంటా. మరి.. ఈ సినిమాను మీరే నిర్మించి ఉంటే బావుండేదేమో? కొరియన్ సినిమా రీమేక్ చేద్దాం అనే ఆలోచనతోనే నిర్మాత సునీతగారు నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ అంటే ఫ్యామిలీయే కదా. భవిష్యత్తులో మీ పేరు మీద సినిమాలు నిర్మిస్తారా? ప్రస్తుతానికి నాకు ఐడియాలేదు. కానీ భవిష్యత్తులో కచ్చితంగా నిర్మిస్తాను. అది నా పేరు మీదా? నా ఫ్యామిలీ పేరుతోనా చెప్పలేను. ‘ఓ బేబి’ సినిమాను ఆడియన్స్ ఎందుకు చూడాలి? 70 ఏళ్ళ ముసలావిడ 25 ఏళ్ల అమ్మాయిలాగా ఎలా మారింది? అన్నదే ఈ సినిమాలో యూనిక్ పాయింట్. ఈ కాన్సెప్ట్ వల్ల సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఈ సినిమా చేయడానికి మరో కారణ ం ఏంటంటే.. కొరియన్ సినిమా చూశాక మా అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వు చిన్నప్పుడు ఏం చేయాలనుకున్నావు? నీ కలలు ఏంటి? అని అడిగాను. ప్రేక్షకులు కూడా అలానే చేస్తారని అనుకుంటున్నాను. అంటే.. అమ్మని నెగ్లెక్ట్ చేశాననే బాధ ఉందా? నా గోల్స్ కోసం పరిగెడుతున్నాను కానీ నీ కలలేంటి అని ఎప్పుడూ అమ్మను అడగలేదు. ఆ ఆలోచనే రాలేదు. జనరల్‌గా నాన్న అది చేస్తారు.. ఇది చేస్తారు అని మన ఇంటికి సంపాదన తెచ్చే వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడతాం కానీ అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడం. ఇంటిని చూసుకోవడం అంటే ఎంత కష్టమైన పని. ఎన్నో త్యాగాలతో కూడుకున్నది. అమ్మ దగ్గరికెళ్లి ‘సంతోషంగా ఉన్నావా?’ అని అడిగితే, ‘నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను’ అంటారు. వాళ్లకు పర్సనల్ అంటూ ఏమీ ఉండదు. వాళ్ల గురించి వాళ్లు ఆలోచించనే ఆలోచించరు. ‘నా.. నేను’ అనే ఓ మాటలు వాళ్ల జీవితంలో ఉండవు. మనందరికీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడూ చెప్పం. ‘అమ్మా థాంక్యూ. మా కోసం ఇన్ని పోగొట్టుకున్నారు’ అని చెప్పం. ‘ఓ బేబీ’ మాత్రం అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. మీ అమ్మా నానమ్మలతో సినిమాకు రండి. సినిమా పూర్తయ్యాక వాళ్లు చిన్నప్పుడు ఏం చేయాలనుకున్నారో అడగండి. నటిగా బెటర్ అవుతున్నానా? అని చెక్ చేసుకుంటుంటారా? అది ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది. నటిగా ఇంప్రూవ్ అవుతున్నాను అనే అనుకుంటున్నాను. అప్పట్లో యాక్టింగ్ పరంగా నాకు మెంటర్స్, దారి చూపించేవాళ్లు ఎవరూ లేరు. నన్ను నేనే గైడ్ చేసుకోవాలి. నా అనుభవాలతో స్వయంగా నేర్చుకున్నాను. అందుకు కొంచెం టైమ్ పట్టింది. కానీ ప్రస్తుతం ఉన్న అనుభవంతో మంచి సినిమాలు ఎంచుకోగలుగుతున్నాను. మీ మామ గారు (నాగార్జున)తో ‘మన్మథుడు 2’లో చేస్తున్నారు కదా... ఎలా అనిపిస్తోంది? ఈ సినిమా నాకు స్పెషల్. రాహుల్, వెన్నెల కిషోర్ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే ఈ సినిమాలో చిన్న భాగమైనా ఆనందంగా ఉంది. సినిమా చాలా సరదాగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పటి ‘మన్మథుడు’ సినిమాలో మామయ్య ఎలా ఉన్నారో ఇప్పుడు ‘మన్మథుడు 2’ లోనూ అలానే ఉన్నారు. టీజర్లో చూసి ‘ఏంటి మామయ్యా! మీరేమనుకుంటున్నారు? మేం రిటైర్ అయినా సరే మీరింకా సినిమాలు చేసేలా ఉన్నారు’ అన్నాను. అప్పుడు ఆయన ‘అవును.. నేను అప్పుడు కూడా చేస్తాను’ అన్నారు. ఆయన లైఫ్ లాంగ్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమలగారు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తే బాగుంటుందంటారా? ఆవిడ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌తో చాలా బిజీ. బ్లూ క్రాస్ పనులతో బిజీగా ఉంటారు. ఇవన్నీ కూడా తన ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆమె చాయిస్ అది. నేను ఇంతకుముందు ఆడవాళ్లకు చాయిస్ ఉండాలన్నాను కదా. ఇది కూడా అలాంటిదే. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు వాళ్లను చేసుకోనివ్వాలి. నాకు యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమా చూశాక వయసు మళ్లిన వాళ్ల మీద మీ అభిప్రాయం మారిందా? మారింది. నేను అనే కాదు.. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను మనం చాలామంది పట్టించుకోం. వాళ్లకు అంత ఇంపార్టెన్స్, టైమ్ ఇవ్వం. ఏదైనా చెప్పబోతుంటే వినం. ఇన్నాళ్లూ పెద్దవాళ్లకు ఇవ్వాల్సినంత టైమ్ ఇవ్వలే దేమో అని కచ్చితంగా అనిపించింది. ఆడియన్స్‌కి కూడా అనిపిస్తుంది. అమ్మగా మారాక ‘నేను’ అనేది ఉండదన్నారు. తల్లయ్యాక మీరూ అలానే ఉంటారా? ఉంటానేమో. పిల్లల మీద ప్రేమ ఏ తల్లిని అయినా అలా చేసేస్తుంది. అయితే ఆడవాళ్లకు చాయిస్‌లు ఉండాలి. గృహిణిగా ఉండాలా? ఉద్యోగం చేయాలా? అనేది వాళ్ల ఇష్టానికి వదిలేయాలి. అయితే కొంతమంది తమ భార్య ఇంటిపట్టునే ఉండాలంటారు. ఉద్యోగం చేయడానికి ఇష్టపడని అమ్మాయిని భర్తే స్వయంగా ఆఫీసుకి పంపిస్తాడు. ఇలా మాట్లాడితే.. ‘ఫెమినిజమ్ ఫెమినిజమ్’ అంటారు. ఫెమినిస్ట్ అంటే మగాళ్లను అసహ్యించుకుంటాం అని కాదు. మగవాళ్లంటే గౌరవం ఉంటుంది. సపోర్ట్‌గా నిలిచే మగవాళ్లు చాలామంది జీవితాల్లో ఉన్నారు. లేనివాళ్ల గురించి మాట్లాడుతున్నాను. సమానత్వం కోసమే ఆడవాళ్ల పోరాటం. అది స్త్రీవాదం కాదు. అయితే ఇప్పుడు భర్త కూడా పిల్లలను పెంచడం, ఇంటి పనులు చూసుకోవడంలో సహాయపడుతున్నాడు.. అది మంచి మార్పు. పూర్వం మగవాడు వంట గదిలోకి వస్తే అదేదో పెద్ద తప్పన్నట్లు మాట్లాడేవారు. అప్పట్లో పిల్లలను చాలావరకు ఆడవాళ్లే ఎత్తుకునేవారు. భర్త దర్జాగా నడిచేవాడు. ఇప్పుడు అలా కాదు. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో చాలా మంది భర్తలు భార్యకంటే ముందే నిద్రలేచి పిల్లలను రెడీ చేస్తుంటారు. ఇంటి పనిని సమానంగా పంచుకుంటున్నారు. అయితే మీ భర్త నాగచైతన్య కూడా పిల్లలను ఇలా చూసుకుంటారనే నమ్మకం ఉందా? 100 శాతం ఉంది. మా ఇంటి కుక్కపిల్లతోనే ఆయన ఎంతో ఓపికగా ఉంటారు. దానికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. తనకు నా కంటే చాలా ఓపిక ఎక్కువ. చైతన్య 100 శాతం గ్రేట్ డాడ్ అవుతారు. ఫైనల్లీ... నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి? త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం. – డి.జి. భవాని -
నాలో మరో కోణాన్ని చూడాలంటే..
తమిళసినిమా: సాధారణంగా హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికాల్లో తేడా ఉండవచ్చు గానీ, ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్, ఫాలోయింగ్‌లో వారికేం తీసిపోరు. దాన్ని వాడుకోవడానికి ఎవరి పంథాను వారు ప్రయత్నాలు చేసుకుంటారు. నటి సమంత తన పాపులారిటీని వాడుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ అమ్మడికి ఇటీవల నటించిన తెలుగు చిత్రం మజిలి, తమిళ చిత్ర సూపర్‌డీలక్స్ వంటి సక్సెస్‌లు ఉన్నా, అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయనే టాక్ మొదలైంది. తనకు అవకాశాలు తగ్గిన మాట నిజమేనని సమంతనే స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అంగీకరించింది. దీంతో అవకాశాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. తరచూ గ్లామర్ ఫొటోలను దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్రీ ప్రచారాన్ని పొందాలనుకుంటోంది. పెళ్లి అయినా ఇలాంటి అవతారాలేంటి అనే కామెంట్స్ వస్తున్నా, ఆమె అభిమానులు మాత్రం ఆ గ్లామరస్ ఫొటోలను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తన తాజా చిత్ర ప్రమోషన్‌కు రెడీ అయ్యింది. ఈ బ్యూటీ నటించిన ఓ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. సమంత సెంట్రిక్ కథా పాత్రలో నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు ఈమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం యూటర్న్ ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఓ బేబీ చిత్రాన్ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందులో భాగంగా తన అభిమానులను ఆకర్షించే విధంగా ట్విట్టర్లో ప్రచారం మొదలెట్టేసింది. తాజాగా చేసిన ట్వీట్లో ఓ బేబీని డాక్యుమెంట్రీ చిత్రం అనుకోవద్దు. ఇది మంచి కమర్శియల్ కథా చిత్రం అని పేర్కొంటూ ప్రమోషన్ చేసుకుంటోంది. అంతే కాదు తన కెరీర్లోనే ఛాలెంజింగ్ చిత్రం ఓబేబీ అని చెప్పింది. ఈ చిత్రం కోసం చాలా శ్రమించానని, తనలోని మరో కోణాన్ని చూడాలనుకుంటే ఓబేబీ చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడండి అని పిలుపునిచ్చింది. కాగా ఓ బేబీ చిత్రం జూలై 5న తెరపైకి రానుంది. మరి సమంత ట్విట్టర్ ప్రచార ట్రిక్స్ ఈ చిత్రానికి ఎంత వరకూ పనిచేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. -
నేను తప్పులు చేశాను!
తానూ తప్పులు చేశాను అంటున్నారు నటి సమంత. ఇతర హీరోయిన్లకంటే ఈ బ్యూటీ ప్రత్యేకం అని చెప్పక తప్పుదు. వివాహానికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్న నటి సమంత. కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ సక్సెస్ అయిన నటి ఈ అమ్మడు. మరో విషయం ఏమిటంటే నిజాలను నిర్భయంగా చెప్పే సత్తా కలిగిన నటిగానూ పేరు గాంచింది. ఇప్పటికీ హీరోయిన్ల రేస్‌లో దూసుకుపోతున్న సమంత చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సమంత నటించిన ఓ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో తన విజయరహస్యం గురించి తెలుపుతూ అందరి మాదిరిగానే తానూ తప్పులు చేశానని చెప్పింది. అయితే ఆ తప్పుల్ని మళ్లీ దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నానని అంది. చేసిన తప్పుల నుంచి చాలా పాఠాలను నేర్చుకున్నట్లు చెప్పింది. నిజం చెప్పాలంటే తనకంటే కఠినంగా శ్రమించే వారు, ప్రతిభ కలిగిన వారు ఈ రంగంలో చాలా మంది ఉన్నారంది. అయినా కథానాయకిగా తన పయనం విజయవంతంగా సాగడానికి కారణం కథల ఎంపికనేనని చెప్పింది. దర్శకుడు కథ చెబుతున్నప్పుడే అందులో కథా పాత్రగా తాను మారిపోతానని చెప్పింది. ఈ కథలో తాను నటించగలనా? తాను అందులో నప్పుతానా? ప్రేక్షకులు ఆ పాత్రలో అంగీకరిస్తారా లాంటి ప్రశ్నలను తనకు తానే వేసుకుని ఆ తరువాతనే అందులో నటించడానికి సమ్మతిస్తానని చెప్పింది. అయితే ఇంతకు ముందు కథల ఎంపికలో తానూ తప్పులు చేశానని, ఆ అనుభవాలను మరచిపోనని చెప్పింది. చేసిన తప్పుల నుంచి ఎదురైన గుణ పాఠాలతో పాటు, ఇతరులను గమనిస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొంది. ఇవే తన విజయ రహస్యాలని నటి సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు చిత్రాలపైనే దృష్టి సారించినట్లుంది. తమిళంలో ఇరుంబుతిరై, సూపర్‌డీలక్స్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా ఇప్పుడు ఇక్కడ ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. మరి తమిళ చిత్రాల అవకాశాలను ఈ అమ్మడే ఒప్పుకోవడం లేదా, లేక కోలీవుడ్‌నే దూరంగా పెట్టిందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది. -
సినిమా వార్తలు