
ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి నాటి అగ్రకథానాయకల నుంచి ఈ తరం కుర్రహీరోల సినిమాలనూ నిర్మిస్తోన్న ఈ సంస్థ ఇండస్ట్రీలో 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థలో తెరకెక్కిన ‘ఓ బేబి’ సినిమాలోని సమంత లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘ఓ బేబి’. సురేశ్‌ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
విజయ్ దొంకాడ, దివ్యా విజయ్ సహ–నిర్మాతలు. ‘‘ఇండస్ట్రీలో 55 ఏళ్ల లెజెండరీ జర్నీని కంప్లీట్ చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు శుభాకాంక్షలు. ఈ సంస్థ తర్వాతి చిత్రం ‘ఓ బేబి’లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన స్వాతి పాత్ర లుక్‌ను విడుదల చేశాం’’ అని పేర్కొన్నారు సమంత. ‘‘పేరు స్వాతి.. తనతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’’ అని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది. సీనియర్ నటి లక్ష్మీ, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment