మరో చిత్రానికి పచ్చజెండా? | Samantha Sign For Another Movie in Tamil | Sakshi
Sakshi News home page

మరో చిత్రానికి పచ్చజెండా?

Jan 8 2020 8:42 AM | Updated on Jan 8 2020 8:42 AM

Samantha Sign For Another Movie in Tamil - Sakshi

సినిమా: నటి సమంత కోలీవుడ్‌లో మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లేనా?.. అంటే అవుననే ప్రచారమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. 2019లో సక్సెస్‌పుల్‌ కథానాయకిగా కొనసాగిన నటి ఈ బ్యూటీ. తమిళంలో సూపర్‌డీలక్స్, తెలుగులో మజిలి, ఓ బేబీ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళంలో సంచలన విజయాన్ని అందుకున్న 96 చిత్ర తెలుగు రీమేక్‌లో నటించి పూర్తిచేసింది. కాగా ఇప్పుడు తొలి సారిగా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. దీ ఫ్యామిలీ మాన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. కాగా ఇటీవల చిత్రాల ఎంపికలో ఆచీతూచి నిర్ణయాలను తీసుకుంటూ వచ్చింది. తాజాగా మళ్లీ నటిగా వేగం పెంచినట్లు తెలుస్తోంది. తమిళంలో రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇప్పటికే తాప్సీ హీరోయిన్‌గా గేమ్‌ ఓవర్‌ వంటి సక్సెస్‌పుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ సరవణన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది.

లేడీ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందనున్నట్లు సమాచారం. కాగా తాజాగా మరో చిత్రానికి సమంత పచ్చజెండా ఊపినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇంతకుముందు మలయాళ నటుడు నవీన్‌ పౌలీ హీరోగా రిచ్చీ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ రామచంద్రన్‌ కొత్త చిత్రానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇందులో నటి సమంత ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇదిచాలా ఆసక్తికరమైన కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందని టాక్‌. మరో విషయం ఏమింటే దీన్ని స్క్రీన్‌ సీన్స్‌ మీడియా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల సుందర్‌ సీ హీరోగా ఇరుట్టు చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శశికుమార్‌ హీరోగా ఎంజీఆర్‌ మగన్‌ చిత్రాన్ని, హరీశ్‌కల్యాణ్‌ హీరోగా ధారల ప్రభు అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా సమంత హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలో నటించే చిత్రాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement