![Fan Funny Comment On Samantha Oh Baby Cutout - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/4/Samantha.jpg.webp?itok=7pN2Ygqt)
క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ అభిమాని ఆసక్తికర కామెంట్ చేశాడు.
‘ మా స్నేహితుడు ఈ కటౌట్‌ను తన జిమ్ అడ్వర్టైజ్ కటౌట్‌గా వాడుకోవచ్చా. కొద్దిగా గ్రాఫిక్స్‌లో కండలు కనిపించేలా చేసి. మీ వీరాభిమాని అయిన అతను మా ఊళ్లో జిమ్ నడుపుతున్నాడు. మీరేమంటారు’ అంటూ కామెంట్ చేశాడు. వెంటనే స్పందిచిన సమంత ‘బేబీ ఆన్ స్టెరాయిడ్స్’ అంటూ రిప్లై ఇచ్చారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమాలో సమంతతో పాటు నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు కీలక పాత్రల్లో నటించారు. యు సర్టిఫికేట్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Baby on steroids 😂😂😂 https://t.co/iOkPJNcXWs
— Baby Akkineni (@Samanthaprabhu2) 4 July 2019
Comments
Please login to add a commentAdd a comment